పేద-మధ్యతరగతి కొనగలిగే అదిరిపోయే Suvలు ఇవే.. 7 లక్షల కంటే తక్కువ.. 26+ కి.మీ మైలేజ్!
భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాల కల.. ఓ నమ్మదగిన, బలమైన, ఇంకా స్టైలిష్ SUV కొనడం. ఎక్కువ డబ్బలు పెట్టి ఖరీదైన కారును కొనుగోలు చేయడానికి బదులుగా, తమకు అందుబాటులో లభించే suvలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. దేశంలో చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కేటగిరీకి చెందిన SUVలు బాగా డిమాండ్ పొందుతున్నాయి. కొత్తగా, అందుబాటు ధరలో లభించే కార్లను జనాలు ఆసక్తిగా కొంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో పలు మోడళ్లు కొనుగోలు చేయడానికి లభిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టార్, రెనాల్ట్ కిగర్.. లిస్టులో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ కార్ల గురించిన వివరాలను మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం.
Hyundai Exter: బడ్జెట్‌లో స్టైలిష్ SUV కావాలా? అయితే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఓ మంచి ఎంపికే! ఇది వేరియంట్‌ను బట్టి ప్రారంభ ధర రూ.6 లక్షల నుంచి రూ.10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లభిస్తుంది. ఇది ప్రీమియం డిజైన్‌ను, సరసమైన ధరను కలిపిన గోల్డ్‌న్ కాంబినేషన్‌లా ఉంది. ఒక్కసారి బయట చూసినా, ఒక్కసారి లోపల కూర్చున్నా.. మీరు ఫీల్ అయ్యేది హ్యుందాయ్ బ్రాండ్ క్లాస్.

ఇది 1.2-లీటర్ పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. అంటే, పెట్రోల్ మైలేజ్ కావాలన్నా, లేదా రోజూ డ్రైవ్ చేసే వారికి CNG ఆప్షన్ కావాలన్నా.. రెండింటికీ ఇది సరైన సొల్యూషన్. మైలేజ్ విషయానికొస్తే, ఇది 19 నుండి 27 కిలోమీటర్ల వరకు ఇచ్చే సామర్థ్యం కలిగివుంది, వినియోగదారుని ఖర్చుల నుంచి బాగా ఆదా చేస్తుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఫీచర్లతో నిండి ఉంది.
Tata Punch: ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికి మధ్యతరగతికి దొరికిన మైక్రో SUV. చిన్న SUV కొనాలి... స్టైలిష్‌గానూ ఉండాలి, ధర కూడా సాధారణంగా ఉండాలి, అని అనుకునే ప్రతి కుటుంబం లిస్ట్‌లో ఇప్పుడు టాటా పంచ్ తప్పనిసరిగా ఉంటుంది. మైక్రో SUV సెగ్మెంట్లో టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ కారు, తన ధర, డిజైన్, పనితీరు, ఇంకా సౌకర్యాలతో అన్ని తరగతుల వినియోగదారులను ఆకర్షిస్తోంది.

రూ. 6.20 లక్షల ప్రారంభ ధరతో మొదలై, రూ. 10.32 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) లభ్యమవుతోన్న ఈ కారును మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే కాదు, సెకండ్ కారుగా ఒక స్టైల్ ఆప్షన్ కోరుకునే వారూ తీసుకుంటున్నారు. ఇంజిన్ పరంగా 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్‌తో పాటు, ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి CNG ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది 18 నుండి 26.99 కిలోమీటర్ల వరకు అందిస్తుంది.
Renault Kiger: అందుబాటు ధరలో, ప్రీమియం లుక్, డే టు డే యూజ్‌కు సరిపోయే పనితీరు కలిగిన SUV కావాలంటే రెనాల్ట్ కిగర్ ఓ చక్కటి ఎంపిక. దీని ధర రూ. 6.15 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.23 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అంటే, బడ్జెట్‌పై భారంగా లేకుండా, SUV అనిపించే డిజైన్‌ను అందించే మోడల్ ఇది. కారు పై నుంచి చూడగానే ఆ డిజైన్ మనసు దోచేస్తుంది.

ఇంజిన్ పరంగా చూస్తే, ఇది రెండు పెట్రోల్ వేరియంట్లలో వస్తోంది. మొదటిది 1 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1 లీటర్ టర్బో పెట్రోల్. స్పూర్తిగా డ్రైవ్ చేయాలనుకునేవారికి టర్బో వేరియంట్ మంచి ఫీల్ ఇస్తుంది. మైలేజ్ విషయానికొస్తే, 18 నుండి 20 కిలోమీటర్ల వరకు ఇవ్వగల సామర్థ్యం ఈ కారు సొంతం. 5 సీట్ల వీలుతో చిన్న కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.


Click it and Unblock the Notifications








