34 కి.మీ మైలేజ్ కారు రూ.4.70 లక్షలకే వస్తుందోచ్.. గత నెలలో ఎంతమంది కొన్నారో తెలుసా?
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) దేశీయ మార్కెట్లో ఒక ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. సరళమైన డిజైన్, కాంపాక్ట్ సైజ్, సిటీ డ్రైవింగ్‌కి సరిగ్గా సరిపోయే ఫీచర్లతో ఇది చాలా మందికి ఫేవరెట్ కారుగా నిలిచింది. తక్కువ ధరలో లభిస్తూ, పేద, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉంది. చాలా కాలంగా ఇది మార్కెట్లో తన సత్తా చూపిస్తుంది. కానీ తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు మాత్రం ఈ కారు కోసం అంతగా అనుకూలంగా లేవు. 2025 ఆగస్టు నెలలో సెలెరియో మొత్తం 1,505 యూనిట్లు మాత్రమే డెలివరీ అయింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 3,181 యూనిట్లతో పోలిస్తే 53 శాతం తగ్గుదల. ఈ గణాంకాలు చూస్తే, వినియోగదారుల డిమాండ్‌లో గణనీయమైన తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితికి పెరుగుతున్న పోటీ, కొత్త మోడళ్ల ప్రవేశం, వినియోగదారుల అభిరుచుల మార్పు వంటి కారణాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అదే సెగ్మెంట్‌లో మరిన్ని స్టైలిష్, టెక్నాలజీ ఆధారిత హ్యాచ్‌బ్యాక్‌లు అందుబాటులోకి రావడం వల్ల సెలెరియో అమ్మకాలు వెనుకబడ్డాయి. అయినా కూడా, ఇంధన సామర్థ్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మారుతి సుజుకి నెట్‌వర్క్‌పై నమ్మకం వంటి అంశాలు ఈ కారును మార్కెట్లో కొనసాగిస్తూనే ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో అమ్మకాలలో ఆగస్టు నెలలో గణనీయమైన తగ్గుదలకు పలు కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మార్కెట్లో నెమ్మదిగా వెనుకబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం, కొత్త కార్ల కొనుగోళ్లపై GST తగ్గింపు. ఈ నిర్ణయం వినియోగదారుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా సెలెరియా ధర రూ.94,100 వరకు తగ్గింది.
ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించడంతో, చాలా మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అంటే, భవిష్యత్తులో మరింత తక్కువ ధరకు కారు దొరుకుతుందన్న ఆలోచనతో వినియోగదారులు ఆగస్టులో కొనుగోళ్లు తగ్గించారు. ఇది నేరుగా సెలెరియో సహా మరికొన్ని మోడళ్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. అలాగే వినియోగదారుల అభిరుచులలో వచ్చిన మార్పు కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

ఇప్పటి మార్కెట్ ట్రెండ్ SUVల వైపు మరింతగా వాలిపోయింది. స్టైలిష్ లుక్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, అదనపు ఫీచర్లు, ఫ్యామిలీ యూజ్‌కి బాగా సరిపోవడం వంటివి SUVల పట్ల డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు, ముఖ్యంగా చిన్న కార్లకు డిమాండ్ తగ్గిపోతోంది. సెలెరియో కాంపాక్ట్ డిజైన్, మంచి మైలేజ్ వంటి బలమైన అంశాలను కలిగి ఉన్నప్పటికీ, SUV క్రేజ్‌కి పోటీ ఇవ్వలేకపోతుంది.
మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం మార్కెట్లో ధర రూ.5.64 లక్షల నుండి రూ.7.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండేది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా జిఎస్‌టి రేట్లను సవరించడంతో, సెలెరియో ధరను భారీగా తగ్గించింది. మొత్తం రూ.94,100 తగ్గింపు తర్వాత, సెప్టెంబర్ 22 నుండి ఈ కారు ప్రారంభ ధర రూ.4.70 లక్షలకే అందుబాటులోకి రానుంది.

ఇంజిన్ పరంగా చూస్తే, సెలెరియోలో 1-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. డ్రైవింగ్ అవసరాల ప్రకారం వినియోగదారులు రెండు వేరియంట్లలోనూ ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) లభ్యం అవుతున్నాయి. వేరియంట్‌ను బట్టి ఇది 24 kmpl నుండి 34 km/kg వరకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








