పేద-మధ్యతరగతికి బాగా నచ్చిన కారు.. చాలా తక్కువకే వస్తుంది! 34 కి.మీ మైలేజ్ కింగ్.. 2000 మంది కొన్నారు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (Celerio) పేద, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో లభిస్తూ కారు కలిగి ఉండాలనే ప్రతి ఒక్కరి కలను నెరవేరుస్తుంది. దేశంలోని చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో ఇది అందరికి ఫేవరెట్ మోడల్. నగర ప్రాంతాల ట్రాఫిక్‌కు అనుకూలంగా, ఆధునిక డిజైన్‌, ఉపయోగకరమైన సౌకర్యాలతో ఇది రూపొందించబడింది. కానీ, అమ్మకాల పరంగా చూస్తే, జూన్ 2025లో సెలెరియోకి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మారుతి నుంచి విడుదలైన సేల్స్ డేటా ప్రకారం, ఈ నెలలో కేవలం 2,038 యూనిట్లే అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 2,985 యూనిట్లతో పోలిస్తే దాదాపు 31.73 శాతం తగ్గుదలగా నమోదైంది.

ఈ ఒక్క నెల అనే కాకుండా సెలెరియో ఇటీవలి వరుస అమ్మకాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ వరకు, అంటే ఐదు నెలల్లో సెలెరియో మొత్తం 11,783 యూనిట్లు అమ్ముడైంది. సగటున నెలకు సుమారుగా 2,300 యూనిట్లకు పైగా అమ్మకాలు జరుగుతున్నా, గతంతో పోల్చితే ఈ గణాంకం కొంత వెనుకబడినదేనని చెప్పాలి. వాహన పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, కొత్త మోడళ్ల వల్ల సేల్స్ తగ్గాయి.

Maruti Suzuki Celerio Price

మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇలా అనేక అంశాలే సెలెరియో అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే కూడా ప్రస్తుతం జనాలు ఎక్కువగా suvలపై ఫోకస్ చేశారు. ఆకట్టుకునే ఎత్తు, ఇంటీరియర్ సౌకర్యాలు, అధునాతన డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ వంటి అంశాలు ఎస్‌యూవీలో ఉండటం కారణంగా కొత్తగా కారు కొనాలనే ఆలోచన చేస్తున్న వారు మొదటగా ఎస్‌యూవీలపై ఆసక్తి చూపిస్తున్నారు.

మారుతి సుజుకి సెలెరియో తన ధర, పనితీరు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ద్వారా హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారును రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి తెచ్చింది మారుతి. దాంతో ఇది మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే కాకుండా, సాధారణంగా రెండో కారును వెతుకుతున్న సంపన్న వినియోగదారులకూ సరైన ఎంపికగా నిలుస్తోంది.

Maruti Suzuki Celerio Design

సెలెరియో LXI, VXI, ZXI అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే వీలుగా వీటిని రూపొందించారు. పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే CNG వేరియంట్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఇది నిజంగా ఆశ్చర్యపరిచే గణాంకాలను అందిస్తుంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బాధపడుతున్న వారు ఈ కారును హాయిగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే, మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఇది న్యాయం చేస్తుంది. వేరియంట్‌ను బట్టి ఇది 24 నుండి 34 కిలోమీటర్లు లీటర్‌కు (kmpl) మైలేజ్ ఇస్తుంది. ఇది చాలా టూవీలర్స్ మైలేజ్‌కి సైతం పోటీ పడే స్థాయిలో ఉంటుంది. దీనిలో ఐదు మంది హాయిగా ప్రయాణించవచ్చు. లోపల ఐదు సీట్లు ఉంటాయి.

Maruti Suzuki Celerio

అందుబాటులో ఉన్న ఫీచర్ల పరంగా చూస్తే, లోపల 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస, కీలెస్ ఎంట్రీ, ఐడిల్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 18, 2025, 10:58 [IST]
English summary
Budget friendly maruti suzuki celerio hatchback june 2025 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+