మైలేజ్ మామూలుగా లేదు.. భద్రతకు ఢోకా లేదు! మారుతి ‘బుజ్జిగాడు’ అంటే ఇదే మరి!
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక సంచలనం! కేవలం రూ. 4.23 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే 33.85 కి.మీ మైలేజ్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీని అందిస్తూ.. సామాన్యుడి సొంతింటి కారుగా దూసుకుపోతోంది. ఇంత తక్కువ ధరలో ఇంతటి కాంబినేషన్ అసాధారణం కదా? అదే మారుతి సుజుకి ఆల్టో K10. ఈ బడ్జెట్ బొనాంజా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన కార్లలో మారుతి సుజుకి ఆల్టో K10 ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ప్రారంభ ధర కేవలం రూ. 4.23 లక్షలు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు కొత్త కారు కొనాలనుకున్నప్పుడు మొదట పరిశీలించే కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు సేఫ్టీని పెంచడానికి మారుతి సుజుకి ఇటీవల 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది.

ఇప్పుడు ఈ బడ్జెట్ కారు బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తున్నాయి. మారుతి తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం కారు అమ్మకాలను పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 మార్చి నెలలోని ఆల్టో K10 కారు అమ్మకాలను వివరంగా చూద్దాం.
గత నెలలో ఆల్టో K10 కారు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2025 మార్చిలో మారుతి సుజుకి మొత్తం 9,867 ఆల్టో K10 కార్లను విక్రయించింది. 2024 మార్చిలో విక్రయించిన 9,332 కార్లతో పోలిస్తే మారుతి సుజుకి 6 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. 2025 ఫిబ్రవరిలో విక్రయించిన 8,541 యూనిట్లతో పోలిస్తే ఇది 15.5 శాతం వృద్ధిని సూచిస్తుంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం వల్ల రాబోయే నెలల్లో కూడా ఆల్టో మంచి అమ్మకాలు సాధిస్తుందని మారుతి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆల్టో K10 హార్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 67 PS పవర్‌ను, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో కూడా ఆల్టో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
CNGలో నడుస్తున్నప్పుడు పవర్ అవుట్‌పుట్ కొద్దిగా తగ్గినప్పటికీ, మైలేజ్ పెరుగుతుంది. ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్‌లు లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయి. అదే సమయంలో, CNG వెర్షన్ కిలోగ్రామ్‌కు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. తక్కువ ధర కలిగిన కారు అయినప్పటికీ ఆల్టో K10 కారులో అవసరమైన అన్ని ఫీచర్‌లు ఉన్నాయి.

కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ఈ కారులో ఉన్నాయి. ఆల్టో K10 కారు 214 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.
అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడంతో పాటు, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి భద్రతా ఫీచర్‌లు ఆల్టో K10 కారులో భద్రతను మరింత పెంచుతాయి.

మారుతి సుజుకి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 4.23 లక్షల నుండి రూ. 6.21 లక్షల వరకు ఉంటుంది. CNG వెర్షన్ ధర రూ. 5.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. తక్కువ ధర, మెరుగైన ఫ్యూయెల్ కెపాసిటీ, బెస్ట్ పవర్‌ట్రెయిన్ కారణంగా ఆల్టో ఇప్పటికే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా నిలిచింది.
మారుతి సుజుకి కార్లలో ప్రధాన లోపంగా భావించే భద్రతను మెరుగుపరచడం కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడంతో, ఎక్కువ మంది వినియోగదారులు ఆల్టో K10 కోసం షోరూమ్‌లకు రావడం ప్రారంభించారు. ఇంత తక్కువ ధరలో 30+ కి.మీ మైలేజ్, భద్రత ఒకేసారి లభించే కార్లు చాలా తక్కువగా ఉంటాయి కదా.


Click it and Unblock the Notifications








