తక్కువ ధరలో కావాలి.. పల్లె పట్నాలకు కంఫర్ట్ గా ఉండాలి.. 33+కిమీ మైలేజ్ ఇవ్వాలా.. ఈ కార్లను కొనేయండి
కొత్త కారు కొనాలనేది చాలా మంది డ్రీమ్. అది విలేజ్ అయినా, సిటీ అయినా అందరికీ కార్లు కావాల్సిందే. ముఖ్యంగా బెంగళూరు లాంటి పెద్ద సిటీల్లో ఎండ, వాన నుంచి సేఫ్టీ కోసం కార్లు చాలా అవసరం. అలాగే, రూరల్ ఏరియాస్‌లో కూడా చాలా పనులకు కార్లను యూజ్ చేస్తుంటారు.
మీరు కూడా కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, చాలా తక్కువ ధరలో దొరికే, మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10), రెనాల్ట్ క్విడ్ (Renault Kwid), మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) కార్లు బెస్ట్ ఛాయిస్ అవుతాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 : ఇదొక హ్యాచ్‌బ్యాక్. విలేజ్‌లకి, సిటీలకి ఇది చాలా సూటబుల్. అలాగే, చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. దీని ధర రూ.4.23 లక్షల నుండి రూ.6.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 5 సీట్ల ఆప్షన్ ఉంది. వీకెండ్ ట్రిప్స్‌కి లేదా హాలిడేస్‌లో వెళ్ళినప్పుడు ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి 214 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
ఈ కారు 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో వస్తుంది. బైక్‌ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. లీటరుకు 24.39 నుండి 33.85కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ స్పీడీ బ్లూ వంటి చాలా కలర్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్ : ఇది కూడా ఒక హ్యాచ్‌బ్యాక్. రూరల్, అర్బన్ ఏరియాస్‌లో ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ కారు కనీసం రూ.4.70 లక్షల నుండి రూ.6.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 5 సీట్లు ఉన్నాయి, ప్రయాణికులు కంఫర్ట్‌గా కూర్చుని ట్రావెల్ చేయొచ్చు. అలాగే, 279 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త క్విడ్ కారు 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. లీటరుకు 21.46 నుండి 22.3కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, మ్యాన్యువల్ ఏసీ వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ : ఈ హ్యాచ్‌బ్యాక్‌ను చిన్న విలేజ్‌లలో, పెద్ద సిటీలలో యూజ్ చేయొచ్చు. దీని ధర రూ.5.79 లక్షల నుండి రూ.7.62 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. బయట భాగంలో ఆకర్షణీయమైన డిజైన్ ఉంది. సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్, మగ్మా గ్రే వంటి చాలా కలర్ ఆప్షన్స్‌లో కూడా దొరుకుతుంది.
ఇందులో 5 సీట్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. 312 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. 1-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. లీటరుకు 23 నుండి 34కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు కావాలనుకునే వారికి ఈ మూడు కార్లు బెస్ట్ ఆప్షన్స్. సిటీలో వాడాలన్నా, పల్లెటూర్లలో వాడాలన్నా ఇవి బాగా సూట్ అవుతాయి. మీ బడ్జెట్, ఫీచర్ల అవసరాలను బట్టి ఈ కార్లను పరిశీలించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








