పాత కారు కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోతారు

కొత్త కారు కొనడానికి బడ్జెట్ సరిపోవడం లేదా? అయితే పాత కారు కొనడం ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే కొత్త కారుతో పోలిస్తే పాత కారు తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, పాత కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, లాభానికి బదులు నష్టాలు ఎదురవ్వవచ్చు. పాత కారు కొనుగోలు చేసే ముందు మీరు తప్పకుండా పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇంజిన్, ఇతర భాగాల చెకింగ్
పాత కారు కొనేటప్పుడు దాని ఎక్సటర్నల్ లుక్ చూసి మోసపోవద్దు. కారు గుండె అయిన ఇంజిన్ పరిస్థితిని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వీలైతే, మంచి అనుభవం ఉన్న మెకానిక్ సాయం తీసుకోవాలి. మెకానిక్ ఇంజిన్, గేర్ బాక్స్, కూలింగ్ సిస్టమ్, ఎగ్జాస్ట్, సస్పెన్షన్ వంటి ముఖ్య భాగాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.

Buying a Used Car Things You Must Check to Avoid a Loss

అలాగే, మీరు ఓన్‎గా డ్రైవింగ్ చేసి చూడటం ద్వారా కారు ఎలా పని చేస్తుందో తెలుసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఇంజిన్ నుంచి వచ్చే శబ్దాలు, గేర్ మార్చేటప్పుడు ఇబ్బందులు, బ్రేకులు ఎలా పని చేస్తున్నాయనేది అర్థం చేసుకోవచ్చు. కారు పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి.

డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించండి
కొనుగోలు చేయాలనుకున్న కారు చోరీకి గురైనదా లేదా నమ్మకమైనదేనా అని తెలుసుకోవాలంటే ఆ కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. కారు రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్, యజమాని వివరాలు, ఇంజిన్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలు సరైనవా కాదా చూసుకోవాలి.

Buying a Used Car Things You Must Check to Avoid a Loss

అలాగే, డీల్ ఖరారైన తర్వాత, కారు ఇన్సూరెన్స్ మీ పేరుపై బదిలీ అయ్యిందా లేదా అని నిర్ధారించుకోవాలి. కారు బదిలీకి ముందు పన్ను రికార్డులు, పీయూసీ సర్టిఫికేట్, మెయింటెనెన్స్ రికార్డులు వంటివి కూడా చెక్ చేయాలి. కారుపై ఏదైనా లోన్ ఉంటే, ఫామ్ 35, ఆ రుణాన్ని ఇచ్చిన సంస్థ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి.

సర్వీసింగ్, మార్పుల రికార్డులు
పాత కారు పర్ఫామెన్స్, స్టేటస్ అర్థం చేసుకోవడానికి దాని సర్వీసింగ్ రికార్డులను చూడడం ఒక మంచి మార్గం. కారును ఎన్నిసార్లు రిపేర్ చేయించారు, ఎక్కడ చేయించారు, ఏ భాగాలు మార్చారు వంటి వివరాలు ఈ రికార్డులలో ఉంటాయి. దీని ద్వారా పాత యజమాని కారును ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో తెలుస్తుంది.

Buying a Used Car Things You Must Check to Avoid a Loss

అలాగే, పాత యజమాని కారులో కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు. ఈ మార్పులు స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొన్నిసార్లు, చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు.

పాత కారు కొనేటప్పుడు కొన్ని సాధారణ మోసాలు జరుగుతుంటాయి. డీల్ ఖరారు అయిన తర్వాత, యజమాని కారులో ఉన్న మంచి భాగాలను మార్చి వేయడం వంటివి జరుగుతుంటాయి. అందుకే, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. సరైన పరిశోధన, జాగ్రత్తలతో తక్కువ ధరకే ఒక మంచి కారును కొనుగోలు చేయవచ్చు. ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, August 17, 2025, 14:53 [IST]
English summary
Buying a used car things you must check to avoid a loss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+