టెస్లా, మహీంద్రా, టాటాలకు షాక్ ఇచ్చిన చైనా బ్రాండ్.. మోస్ట్ పవర్‌ఫుల్‌గా మారిన 521 కి.మీల రేంజ్ కార్లు!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ మామూలుగా లేదు. కొత్తగా విడుదల అవుతున్న చాలా వరకు ఈవీలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తయారీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా టెస్లా, BYD దిగ్గజ తయారీదారులు చాలా కాలంగా ప్రపంచ ఈవీ మార్కెట్‌ను ఛేజిక్కించుకోడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇటీవల అమెరికా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా(Tesla)ను చైనా BYD కంపెనీ అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా అవతరించింది. అంతర్జాతీయంగా ఇప్పుడు భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో టెస్లా, BYD కంపెనీలు తమ చూపును భారత్ వైపు పెట్టాయి. అయితే మస్క్‌కు టెస్లా కంపెనీ ఇంకా ఇక్కడ అడుగుపెట్టలేదు. కానీ చైనా బ్రాండ్ బీవైడీ మాత్రం ఇప్పటికే ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది.
టెస్లా కారణంగా భారత్‌లో చైనా బ్రాండ్ బిల్డ్ యువర్ డ్రీమ్స్(BYD) ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ప్రభావానికి మాత్రం లోను కాలేదు. ఇక్కడ కంపెనీ అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. వీటి సేల్స్ కూడా మెరుగ్గానే ఉన్నాయి. అందుకనే భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుందని తెలిసినప్పటికి కూడా BYD ఇండియా ఏమాత్రం భయపడటం లేదు. తన కార్ల అమ్మకాల పరంగా ఎలాంటి ప్రభావితం ఉండదని అది భారీ అంచనాలు పెట్టుకుంది.

కానీ ముందు జాగ్రత్తగా BYD తన కార్ల అమ్మకాలపై దృష్టి సారించి భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి దాని ప్రసిద్ధ SUVలైన Atto 3, సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌లలో కొత్తగా కొన్ని అప్‌డేట్‌లను ప్రవేశపెట్టింది. 2025 అప్‌డేట్‌లో భాగంగా ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో కస్టమర్లను అలరించడానికి సిద్ధమయ్యాయి. మెరుగైన పనితీరు కోసం బ్యాటరీని కూడా అప్‌గ్రేడ్‌ను చేసినట్లు బిల్డ్ యువర్ డ్రీమ్స్(BYD) పేర్కొంది.
2025 BYD Atto(అట్టో) 3 SUV ధర విషయానికి వస్తే డైనమిక్ వేరియంట్ ధర రూ. 24.99 లక్షలు, ప్రీమియం ధర రూ. 29.85 లక్షలు, అలాగే, సుపీరియర్ వేరియంట్ ధర రూ. 33.99 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ SUV కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 30,000 చెల్లించి ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. మొదటి 3,000 మంది కస్టమర్లకు ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్ ఇస్తుంది.

తక్కువ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని అనుకున్న త్వరపడటం మంచిది. ఇక 2025 మోడల్ సీల్ ఈవీ కారు విషయానికి వస్తే, దీని స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ సెడాన్ ధరను ఏప్రిల్ నెలలో ప్రకటించనున్నారు. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకున్న వారు రూ. 1.25 లక్షలు చెల్లించి ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజర్వేషన్లు మార్చి 11, 2025 నుంచి మొదలవుతాయి.
కొత్త అప్‌డేట్స్‌ను చూసినట్లయితే Atto 3 SUV లో డ్రైవర్, ముందు ప్రయాణీకులకు వెంటిలేటెడ్ సీట్లు అందించారు. ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి లోపల బ్లాక్ కలర్ థీమ్‌ను ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న తక్కువ-వోల్టేజ్ బ్యాటరీని లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఇది మరింత తక్కువ బరువుతో 15 సంవత్సరాల పాటు లైఫ్‌టైం అందిస్తుందని కంపెనీ తెలిపింది.
2025 మోడల్ సీల్ EV విషయానికి వస్తే, పవర్ ఎక్స్‌టీరియర్‌లో సన్‌షేడ్, సిల్వర్-ప్లేటెడ్ డిమ్మింగ్ కానోపీని జోడించడంతో పాటు లోపల ఇంటీరియర్‌లో పెద్ద కంప్రెసర్, లేటెస్ట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మాడ్యూల్‌తో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ప్రీమియం వేరియంట్‌లో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డంపర్స్(FSD) ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో DiSus-C ఇంటెలిజెంట్ డంపింగ్ సిస్టమ్ అందించారు.


Click it and Unblock the Notifications








