మరో షాకింగ్ ఎంట్రీ ఇస్తోన్న చైనీస్ కారు.. ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ రేంజ్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తూ 1.3 కోట్లకుపైగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ఆటోమేకర్‌గా గుర్తింపు పొందింది. ఇది కేవలం చైనీస్ ఆటోమొబైల్ రంగానికే కాదు, మొత్తం గ్లోబల్ EV ఇండస్ట్రీకి గర్వకారణం. ఇటీవలే BYD తన కొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV మోడల్ అట్టో 2 (Atto 2)ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యాధునిక డిజైన్, ఆధునిక సాంకేతికత, ప్రీమియం ఫీచర్ల కలయికగా ఈ కారు నిలిచింది. ముఖ్యంగా, BYD ఇన్నోవేటివ్ E-ప్లాట్‌ఫామ్ 3.0 ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడటం దీని ప్రత్యేకత. ఈ ఆర్కిటెక్చర్ వలన కారు తక్కువ బరువుతో ఉండి, మరింత శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.

ఫాస్ట్ చార్జింగ్, రేంజ్ సామర్థ్యం, భద్రతా పరంగా అత్యుత్తమ ప్రమాణాలను ఈ కారు కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. Atto 2 ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లో విడుదలైంది, అక్కడ ప్రారంభ ధర సుమారు రూ.32 లక్షలుగా నిర్ణయించారు. యూరప్ మార్కెట్లో అడుగుపెట్టిన వెంటనే, ఈ కారు పట్ల మంచి స్పందన లభిస్తోంది. అంతేకాకుండా, భారత మార్కెట్లో కూడా త్వరలో ఈ మోడల్ ప్రవేశించబోతోందన్న వార్తలు ఆటోమొబైల్ రంగంలో సంచలనంగా మారాయి.

Byd Atto 2 Electric Car Coming To India

ఇటీవల భారతదేశంలో ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది త్వరలోనే అధికారికంగా భారత్‌లో విడుదల కానుందనే అంచనాలను మరింత బలపరుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, BYD లాంటి అంతర్జాతీయ ఆటోమేకర్లు ప్రీమియం, సాంకేతికత ఆధారిత మోడళ్లతో ప్రవేశించడంతో భారతీయ వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందించనున్నారు. Atto 2 భారతీయ EV మార్కెట్‌లో పోటీని పెంచనుంది.

BYD Atto 2 మోడల్‌ను రెండు వేరియంట్లలో అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. బూస్ట్ వేరియంట్‌లో 51.1kWh బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కలిగి ఉండటమే కాకుండా, ఒకసారి పూర్తి చార్జ్‌తో సుమారు 345 కి.మీ రేంజ్‌‌ను అందిస్తుందని BYD పేర్కొంటోంది. ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్ 64.8kWh బ్యాటరీని కలిగి ఉండి, 420 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది.

Byd Atto 2 Electric Car Coming To India

రెండు బ్యాటరీ వేరియంట్లూ ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 174 bhp శక్తిని, 290Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో వేగవంతమైన యాక్సిలరేషన్, సిటీ, హైవే డ్రైవ్‌లలో స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. బూస్ట్ వేరియంట్‌‌లో 82kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది, ఇది సుమారు 30 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు చార్జ్ చేయగలదు.

టాప్-ఎండ్ కంఫర్ట్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మరింత ఆకర్షణీయంగా మారింది. 155kW ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సపోర్ట్ వలన ఈ వేరియంట్‌ను కేవలం 21 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది దూర ప్రయాణాలు చేసే వారికి పెద్ద ప్రయోజనం. రెండు మోడళ్లలోనూ BYD సిగ్నేచర్ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించడం మరో ముఖ్యమైన అంశం. దీంతో భద్రత, విశ్వసనీయత, హీట్ కావడం వంటివి ఉండవు.

Byd Atto 2 Electric Car Coming To India

టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, BYD వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. భారత EV మార్కెట్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, BYD మరింత అందుబాటు ధరలో Atto 2 వంటి కాంపాక్ట్ మోడల్‌ను తీసుకురావడం ద్వారా తన స్థాయిని మరింత బలపరుచుకోనుంది. రానున్న రోజుల్లో ఈవీ కంపెనీల మధ్య బలమైన పోటీ మరింత పెరగనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 27, 2025, 13:17 [IST]
English summary
Byd atto 2 electric car coming to india more details inside check
Read more on: #byd #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+