ఈ కారులో ఎంత తిరిగినా ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ ఉండదు.. ఎంతైనా చైనా టెక్నాలజీనే వేరు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న BYD, వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తన శ్రేణిని విస్తరించుకుంటుంది. తాజాగా విడుదలైన e7 మిడ్-సైజ్ సెడాన్ తన స్పెషల్ ఫీచర్లతో వార్తల్లో నిలిచింది. BYD విడుదల చేసిన చిత్రాలు సీల్ సెడాన్ డిజైన్ మాదిరిగానే ఉన్నాయి. ఇది మనదేశ మార్కెట్లలో కూడా ఎట్రాక్టివ్ ఆఫ్షన్‌గా నిలుస్తుంది.
e7 సెడాన్ ఎక్స్టీరియర్ డిజైన్ సీల్ సెడాన్ నుంచి ఓషన్ డిజైన్ లాంగ్వేజ్‌ను తీసుకుంది. అయితే, ఇది తక్కువ ధర కలిగిన వెహికల్‌గా విక్రయించబడుతుందని భావిస్తున్నారు. సీల్ కారులో ఉన్న ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌కు భిన్నంగా, e7 సాధారణ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ధరను తగ్గించడానికి స్టీల్ వీల్స్‌ను అందించింది.

ఇది 19-ఇంచుల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్న సీల్‌తో స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. ఈ డిజైన్ తత్వం e7ని చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అందించే కారుగా నిలబెడుతుంది. e7 సెడాన్ కారు ప్రత్యేకత దాని ఫీచర్ల జాబితాలో స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ ధర కలిగిన కార్లను కోరుకునే వినియోగదారుల కోసం ఇది అనేక ఆఫ్షన్లను అందిస్తుంది.
సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను ఎంచుకునే అవకాశం నుంచి రియర్ కెమెరా, IRVM వంటి ఆఫ్షన్ చేసుకునే సౌకర్యాల వరకు వివిధ రకాల ఫీచర్లు ఉన్నాయి. కస్టమైజేషన్‌లో ఈ సౌలభ్యం e7ని మరింత ప్రీమియమైన సీల్ సెడాన్ కారుకు తక్కువ ధర కలిగిన ఎడిషన్‌గా నిలబెడుతుందని భావిస్తున్నారు.

చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) విడుదల చేసిన కొలతల ప్రకారం e7కొలతలు సీల్ కారుతో చాలా దగ్గరగా ఉంటాయి. e7పొడవు 4,780మిమీ, వెడల్పు 1,900మిమీ, ఎత్తు 1,515మిమీ కలిగి ఉంది. ఈ కారు 2,820మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ కొలతలు సీల్ సెడాన్ కారు కొలతలతో దగ్గరగా ఉండడం వలన, e7 తక్కువ ధర కలిగిన కారు అయినప్పటికీ, పరిమాణంలో పెద్దగా మార్పులేదని తెలుస్తుంది.
పవర్ విషయానికి వస్తే e7 నిరాశపరచదు. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి 48 kWh లిథియం-అయాన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌తో, మరొకటి 57.6kWh బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. CLTC ప్రమాణాల ప్రకారం ఈ పవర్‌ట్రెయిన్‌లు వరుసగా 450కిమీ, 520కిమీ వరకు రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతుంది. తక్కువ ధరలో ఈ కారు స్థానం పొందినప్పటికీ 100 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో 150కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

e7 సెడాన్ విజువల్, టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు ఎక్కువ మంది వినియోగదారులకు కావాల్సిన ప్రాధాన్యతలను అందిస్తాయి. ఇది టాక్సీ సర్వీస్ లేదా రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల వంటి రంగాలను టార్గెట్‌గా చేసుకుంటుంది. ఈ విధానం గతంలో e2 హ్యాచ్‌బ్యాక్, e3 సెడాన్‌లో కనిపించిన ప్రణాళికను కలిగి ఉంది.
ఈ రెండు కార్లు చైనాలో నిర్మించబడ్డాయి. e7 భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించి eMAX 7 ఎలక్ట్రిక్ MPV కారు స్థానాన్ని భర్తీ చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, దాని రాక ఎలక్ట్రిక్ వాహనాల అందుబాటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: BYD e7 సెడాన్ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఒక ఆసక్తికరమైన అదనంగా ఉంటుంది. సీల్ సెడాన్ కారు నుంచి పొందిన డిజైన్, తక్కువ ధరపై దృష్టి పెట్టడంతో, ఇది ఎలక్ట్రిక్ వాహన డ్రైవింగ్ అధిక రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్‌కు పరిచయం చేస్తుందా లేదా అంతర్జాతీయంగా ఎలా ఆదరించబడుతుందనేది ఇంకా తెలియదు.


Click it and Unblock the Notifications








