చిన్న కుటుంబాల కోసం వస్తోంది తక్కువ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు! ఒక్కసారి డ్రైవ్ చేస్తే వదలలేరు
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో సుపరిచితమైన పేరు BYD (బిల్డ్ యువర్ డ్రిమ్స్). చైనాలో మొదలై, ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ బ్రాండ్, ఎలక్ట్రిక్ వాహనాల్లో తనదైన ముద్ర వేసుకుంటోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారత్‌లోకి అడుగుపెట్టిన అతి కొద్ది చైనీస్ EV బ్రాండ్స్‌లో BYD ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో BYD నాలుగు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. స్పోర్టీ SUV అయిన Atto 3, కట్‍టీంగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అందర్ని ఆకట్టుకుంటున్న Seal, తాజా లాంచ్ అయిన అధునాతన SUV Sealion 7, అలాగే పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ MPV eMax 7.. ఇవన్నీ వేర్వేరు సెగ్మెంట్లలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేయబడ్డాయి. ప్రతి మోడల్‌కి ప్రత్యేకత ఉంది, ప్రయాణంలో భద్రత, పెర్ఫామెన్స్ ఉంటుంది.
టెస్లా ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టింది. ఈ కంపెనీ కార్లు ఇక రోడ్లపై కనిపించనున్నాయి. టెస్లాకు ప్రధాన పోటీదారు బీవైడీ. ఈ రెండింటి మధ్య అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొంది. భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆటో మార్కెట్‌కు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తుండటంతో కంపెనీలు పోటా పోటీగా పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

ఈ క్రమంలో బీవైడీ తన భారత మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి త్వరలోనే అట్టో 2 (Atto 2) కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ధరపరంగా మరింత మందికి అందుబాటులో ఉండనుంది, అంటే మధ్యతరగతిని టార్గెట్ చేస్తూ మార్కెట్‌కి దూసుకొచ్చే అవకాశం ఉంది. చిన్నవాహనాల సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతూ, నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం అద్భుతంగా సరిపోయేలా ఈ కారును రూపొందించారు.
2025 బ్రస్సెల్స్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించబడిన Atto 2 ఎలక్ట్రిక్ SUVని చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మన దేశానికి తీసుకువస్తున్నట్లు ఇటీవల ఆటో హిందుస్తాన్ నివేదించింది. ప్రస్తుతానికి ఈ కారును టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు మోడల్స్‌తో భారత్‌లో సత్తా చాటిన ఈ బ్రాండ్, ఇప్పుడు కొత్త SUV గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. పండుగ సీజన్ నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశముంది.

అయితే అధికారిక లాంచ్ గురించి మాత్రం కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ కారుకు సంబంధించిన విశేషాలు చైనా, బ్రెజిల్ మార్కెట్లలో ఇప్పటికే బయటపడ్డాయి. అక్కడ ఇది ఇతర పేర్లతో అమ్మకానికి లభిస్తోంది. BYD Atto 2, ఒక ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో రూపొందించబడినది. ఇది BYD అత్యాధునిక మూడవ తరం ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫామ్ పై నిర్మితమైంది, దీన్ని E-ప్లాట్‌ఫామ్ 3.0 అని పిలుస్తారు.
ఇది తక్కువ బరువు, ఎక్కువ పనితీరు, వేగవంతమైన ఛార్జింగ్ వంటి అనేక ప్రయోజనాలు కలిగించగలదని కంపెనీ చెబుతోంది. పనితీరు విషయానికి వస్తే, బ్యాటరీ ప్యాక్, 45.1 kWh సామర్థ్యంతో వస్తుంది. దీని వద్ద ఉన్న సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 175 bhp శక్తిని, 290 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. పూర్తి ఛార్జ్‌పై ఈ SUV సుమారు 380 కి.మీల రేంజ్ అందించగలదని NEDC రేటింగ్ చెబుతోంది.

అయితే, చైనా, బ్రెజిల్‌లో ఉన్న ఈ స్పెసిఫికేషన్లే భారత మార్కెట్‌లోనూ అందుబాటులోకి వస్తాయా అనే విషయం ఇంకా స్పష్టంగా లేదు.తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భారత వినియోగదారులకు అనుగుణంగా, దాని ధర, స్పెక్స్ లో కొంత మార్పు ఉండే అవకాశాలు ఉండొచ్చు. అట్టో 2 ఎలక్ట్రిక్ SUV భారతదేశానికి సరిపోయే సైజు, ఫీచర్లు, ధర కలిగి ఉంటే, మిడ్-సెగ్మెంట్ EV మార్కెట్లో ఆటను మార్చే కారుగా నిలవవచ్చని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








