హైదరాబాద్‌కు ఎదురేలేదు! ప్రపంచస్థాయి చైనా BYD ఈవీ ఫ్యాక్టరీ.. ఏకంగా రూ.85,000 కోట్ల భారీ పెట్టుబడి!
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజల నుంచి ఈవీలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెలన్నీ కూడా ఇప్పుడు భారత్‌కు రావడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నటువంటి చైనా దేశానికి చెందిన దిగ్గజ వాహన తయారీదారు BYD (బీవైడీ) ఇండియా మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే మంచి మార్కెట్ కలిగి ఉండగా, తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించడానికి పెద్ద ఎత్తున కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేస్తుంది.
BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ) కంపెనీ ప్రధాన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తుండగా, దాని నుంచి వచ్చే పోటీని బలంగా ఎదుర్కొన్ని భరత ఈవీ కార్ మార్కెట్లోలో తన జెండా గట్టిగా పాతడానికి కొత్తగా తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ది ఫిలాక్స్ నివేదిక ఆధారంగా వచ్చిన సమాచారం ప్రకారం, చైనా దేశపు BYD కంపెనీ ఇండియాలో దాదాపు రూ.85,000 కోట్లు ($10 బిలియన్ల) పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌కు సమీపంలో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో చాలా ఈవీ తయారీ కంపెనీలు ఉన్నాయి. పైగా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూడా చాలా సులువు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే BYD కంపెనీ అధికారుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌కు సమీపంలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన మూడు స్థలాలను కూడా చూపించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కంపెనీ అధికారులు ప్రాంతాలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత చివరి నిర్ణయం తాలూకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం-BYD కంపెనీ మధ్య పూర్తి స్థాయి ఒప్పందం కుదిరిన తర్వాత, ఇది తెలంగాణ ఈవీ రంగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలైనట్లయితే, EV విపణిలో హైదరాబాద్ కీలక హబ్‌గా మారనుంది. నగరం చుట్టుపక్కల ఈ పెట్టుబడి ద్వారా ఎలక్ట్రిక్ వాహన భాగాలు తయారయ్యే అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
అంతేకాక, BYD స్థానికంగా ఉత్పత్తి చేసే మోడళ్లను పెంచుకోవడంతో పాటు, దేశీయంగా అధునాతన EV టెక్నాలజీ అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంది. ఈ పెట్టుబడి ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, భారతదేశ EV విపణిలో పోటీని మరింత పెంచుతుంది. హైదరాబాద్ చుట్టూ ఓ బలమైన ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు కావడంతో పాటు, దేశంలోనే కాకుండా ప్రపంచ ఈవీ తయారీదారులకు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల పరంగా బెస్ట్ ఎంపికగా మారుతుంది.

ఇతర దిగ్గజ కంపెనీలు కూడా తమ ఈవీ ప్లాంట్‌లను ఇక్కడ స్థాపించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు దూకుడు పెంచింది. BYD వంటి పెద్ద కంపెనీలు తమ ఉనికిని రాష్ట్రంలో బలోపేతం చేసుకుంటుండటం రాష్ట్రానికి ఇతర పెట్టుబడుల పరంగా కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు.
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన "తెలంగాణ EV పాలసీ" కింద, ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడింది. ఈ ప్రోత్సాహకాలు 2026 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్నాయి. ఇండియాలో BYD చాలా ఏళ్లుగా తన వాహనాలను విక్రయిస్తున్నప్పటికి వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా 2032 నాటికి ఏటా 6 లక్షల ఈవీలను ఉత్పత్తి చేయనున్నారు.


Click it and Unblock the Notifications








