చైనా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు.. ధర, ఫీచర్స్ అన్ని వివరాలు
ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్ పేరు మారుమోగుతుంది. ఇతర దేశాలు చాలా వరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని యుద్ధ భయాలతో అల్లాడిపోతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం అంతా సైలెంట్‌గా ఉంది. అంతర్జాతీయంగా ఉన్న కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారతీయ కార్ల మార్కెట్ ప్రస్తుతం అత్యంత సానుకూలంగా ఉంది. దీంతో వాహన తయారీదారులు ఇక్కడి మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకే వరుసగా కార్లను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా ఉంది. కొత్తగా లాంచ్ అవుతున్న వాటిలో అత్యధిక భాగం ఈవీలే ఉంటున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ Byd (బీవైడీ) ఇండియాలో కొత్తగా సీలియన్ 7 (Sealion 7) అనే అదిరిపోయే కారును విడుదల చేసింది.
తాజాగా మార్కెట్లోకి వచ్చిన Byd సీలియన్ 7 రెండు వేరియంట్లలో కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్ ధర రూ.48.9 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ప్రారంభ ధర. అదే పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ.54,90,000లుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారును CTB (సెల్-టు-బాడీ) టెక్నాలజీ) ఆధారంగా రూపొందించారు. సీలియన్ 7 అత్యాధునిక ఫీచర్స్‌ను కలిగి ఉంది.

గత నెల జనవరి 18న ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ కారును ఆవిష్కరించింది. లాంచ్ సమయంలోనే బుకింగ్స్ సైతం ప్రారంభించారు. ఇది ఎలక్ట్రిక్ Suv మోడల్. ప్రమోషనల్ బుకింగ్స్‌లో భాగంగా ఒక్క నెలలోనే ఇది 1,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను నమోదు చేసింది. డెలివరీలను మార్చి 7, 2025 నుండి ప్రారంభించనున్నారు. ఈ రెండు వేరియంట్లు కూడా డ్రెవ్‌ట్రెయిన్ విషయంలో వేరుగా ఉంటాయి.
ఫీచర్స్, పనితీరు, బ్యాటరీ ప్యాక్ అన్ని ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో ఒకే విధంగా ఉన్నాయి. BYD కంపెనీకి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ప్రధానంగా ప్రపంచంలో అతిపెద్ద ఈవీ కార్ మేకర్ ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇది బలమైన పోటీదారు. భారత్‌లో టెస్లా ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పటికే BYD ఇక్కడ పలు కార్లను విక్రయిస్తూ, మార్కెట్ వాటా దక్కించుకోవాలని కీలకంగా ముందడుగు వేస్తుంది.

ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఇండియాలోని 40 అధీకృత డీలర్‌షిప్‌లలో దేని నుండైనా కొనచ్చు. Byd సీలియన్ 7 ఈవీ కారు 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. రెండు వేరియంట్లలో కూడా ఇదే ఆప్షన్‌ను అందించారు. పెర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్-మోటార్ AWDతో వచ్చింది. ఇది 530bhp పవర్, 690Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది.
దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 542 కి.మీల రేంజ్ వరకు అందిస్తుంది. అదే ప్రీమియం వేరియంట్ విషయానికి వస్తే, సింగిల్-మోటార్ RWDతో వచ్చింది. ఇది 313bhp పవర్, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 567 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

చివరగా ఫీచర్స్ విషయానికి వస్తే, లోపల లెదర్ సీట్లు, 15.6-అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, టూ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ముందు LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలు, సేఫ్టీ కోసం 11 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








