మొబైల్‌ కంటే వేగంగా 5 నిమిషాల్లో కారు బ్యాటరీ ఛార్జ్…మార్కెట్లోకి చైనా కంపెనీ కొత్త టెక్నాలజీ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. అయినా చాలా మంది ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. కారణంగా ఆ వాహనాలకు ఛార్జింజ్ పెట్టుకునేందుకు సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఒక వేళ ఉన్నా ఆ వాహనాలు ఛార్జింగ్ అయ్యేందుకు చాలా సమయం తీసుకోవడంతో వాటిని కొనేందుకు కాస్త ఆలోచిస్తున్నారు.

కార్లలో టెక్నాలజీ మారుతున్న ఛార్జింగ్ పరిస్థితులు మాత్రం మారడం లేదు. దీనికి చైనా ఆటోమొబైల్ కంపెనీ ఓ పరిష్కారాన్ని కనుగొంది. ఎలక్ట్రిక్ కార్లు, అద్భుతమైన టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చైనీస్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ BYD.. ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

BYD Launches Super E-Platform

కొత్త టెక్నాలజీతో తమ ఎలక్ట్రిక్ కారు కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని.. దాంతో 400 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ 5 నిమిషాలు అంటే పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి పట్టే సమయానికి సమానంగా ఉంటుంది. BYD..ఈ కొత్త ఈవీ ప్లాట్‌ఫామ్‎ను సూపర్ ఇ-ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. ఇందులో కొత్తగా రూపొందించిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు.

ఈ టెక్నాలజీలో10సీ వరకు ఛార్జింగ్ మల్టిప్లయర్‌ను ఉపయోగించారు. కొత్త ఆర్కిటెక్చర్ 1,000కిలో వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. BYD కొత్త సూపర్ ఇ-ప్లాట్‌ఫారమ్ రాబోయే రోజుల్లో గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో పెద్ద మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కు పట్టే సమయాన్ని బాగా తగ్గిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్‎కు పట్టే అతిపెద్ద సమస్యను తొలగిస్తుంది.

BYD Super E-Platform

అలాగే, ఇది ప్రస్తుతం మార్కెట్లో తోపుగా భావిస్తున్న టెస్లా లాంటి కంపెనీలకు సవాల్ చేయడంలో సాయపడుతుంది. కొత్త ప్లాట్‌ఫారమ్ దాని అనేక ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించబోతున్నట్లు BYD ప్రకటించింది. ఈ ఆవిష్కరణ BYDని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సాయపడింది. ఈ కంపెనీ ప్రారంభ దశలో చైనాలో కొత్త సాంకేతికతతో కూడిన ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇది ఇతర దేశాలకు విస్తరించవచ్చు.

Take a Poll

ఇప్పటికే ఇండియాలో కూడా BYD కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇండియాకు వస్తే అది ఇతర కంపెనీలకు సవాల్ అవుతుంది. ఇండియా లేదా మరే ఇతర విదేశీ కంపెనీలు కూడా త్వరలో ఈ సవాల్ ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. ఇది ఈవీ ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

BYD Launches

ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఎనర్జీ-టెక్ స్టార్టప్ ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ BYDకి పోటీగా ప్రపంచంలోని ఫస్ట్ 1.5 MW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇటువంటి ఆవిష్కరణలు ఇండియా లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను వేగంగా పెంచుతాయి. ఎందుకంటే ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం వల్ల ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు.

BYD ఇప్పటికే విక్రయాల పరంగా టెస్లాను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్లో నిలిచింది. ఫిబ్రవరి 2025లో అమెరికన్ ఈవీ తయారీదారు టెస్లా చైనా షిప్‌మెంట్స్ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 49శాతం తగ్గి కేవలం 30,688 వాహనాలకు చేరుకుంది. ఇది జూలై 2022 నుంచి అతి తక్కువ నెలవారీ సంఖ్య. కొత్త ఈవీ ప్లాట్‌ఫారమ్‌తో BYD మరింత లాభపడే ఛాన్స్ ఉంది. ఇది టెస్లా విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 28, 2025, 13:20 [IST]
English summary
Byd launches super e platform electric cars that charge in 5 minutes
Read more on: #byd #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+