చూడటానికి ఎంత ముద్దుగా ఉంది.. చిన్నదే కానీ పవర్‌ఫుల్.. చిన్న ఫ్యామిలీ కోసం BYD కారు

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి దారితీసిన సంస్థల్లో ముందంజలో ఉన్నది బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD). ఈ చైనీస్ ఆటోమోటివ్ దిగ్గజం తక్కువ ధరలో అధునాతన సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ కార్లను అందించడం ద్వారా ప్రజల్లో EV అంటే ఖరీదైనది అనే భావనను పూర్తిగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా BYD తన స్థాయిని అద్భుతంగా పెంచుకుంది. ఇంతవరకు EV రంగంలో ఆధిపత్యం చూపిన టెస్లాను వెనక్కి నెట్టి మరి ప్రపంచంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీగా నిలిచింది. BYD విజయానికి కారణం కేవలం శక్తివంతమైన మార్కెటింగ్ కాదు, దాని వెనుక ఉన్న ఇంజినీరింగ్ సామర్థ్యం. బ్యాటరీ టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యం, వివిధ సెగ్మెంట్లలో అనువైన మోడళ్ల తయారీ అనే మూడు రంగాల్లో ఈ కంపెనీకి ఉన్న పట్టు అసాధారణం.

ఇప్పుడు, ఈ బ్రాండ్ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటింది. 2025 జపాన్ మొబిలిటీ షోలో BYD ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ తన తొలి కై కార్(Kei Car) మోడల్‌ను ఆవిష్కరించింది, దానికి పేరు BYD RAKO (రాకో). జపాన్ మార్కెట్‌లో కై కార్లు అంటే చిన్న, స్మార్ట్, ఇంధన-సమర్థవంతమైన, నగర ప్రయాణాలకు అనువైన వాహనాలు. అలాంటి విభాగంలోకి అడుగుపెట్టడం BYD ముందడుగు అని చెప్పవచ్చు.

Byd Raco Electric Kei Car Debuts At 2025 Japan Mobility Show More Details

రాకోను ఒకసారి చూసినవారికి ఇది సాధారణ కారు కాదు అని వెంటనే అర్థమవుతుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ, దాని డిజైన్‌లో ప్రీమియం ఫినిషింగ్, సొగసైన బాక్సీ ఆకారం, సున్నితమైన లైన్లు కలిపి దానికి ఆధునిక ఆకర్షణను ఇస్తున్నాయి. BYD జపాన్ ప్రజల అభిరుచిని, అక్కడి నగర జీవనశైలిని పరిగణనలోకి తీసుకొని ఈ కై కారును రూపొందించింది. కాంపాక్ట్ బాడీ అయినప్పటికీ, ఇది అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్‌ను, సౌకర్యాన్ని, ఫీచర్లను అందిస్తుంది.

ఇంకా అధికారిక వివరాలు వెల్లడి కాలేదు కానీ, బ్యాటరీ, పనితీరు గురించి కొన్ని ఆసక్తికర సమాచారం లభించింది. BYD Racoలో 20 kWh LFP (Lithium Iron Phosphate) బ్యాటరీ ప్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. WLTC ప్రమాణాల ప్రకారం ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 180 కిలోమీటర్ల రేంజ్ అందించగలదని అంచనా. ఇది నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు చాలు అనే విధంగా రూపొందించబడింది.

Byd Raco Electric Kei Car Debuts At 2025 Japan Mobility Show More Details

BYD Raco 100 kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అంటే, సాధారణంగా దీన్ని 20-30 నిమిషాల్లోనే ఎక్కువ శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. చిన్న పరిమాణం ఉన్న కారుకి ఇంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం ఉండటం, ఈ సెగ్మెంట్‌లో నిజంగా గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. సైజ్ చిన్నదైనా, టెక్నాలజీ మాత్రం పెద్దది. ప్రపంచవ్యాప్తంగా కై కార్ కేటగిరీలో ప్రీమియం ఎలక్ట్రిక్ మినీ వెహికల్గా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి.

కొలతల పరంగా, BYD రాకో తన కేటగిరీలో కాంపాక్ట్ అయినా, డిజైన్, స్పేస్ వినియోగం పరంగా అత్యుత్తమంగా నిలుస్తుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు పొడవు 3,395 mm, వెడల్పు 1,475 mm, ఎత్తు 1,800 mmగా ఉంది. ఈ పరిమాణాలు దాన్ని నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపోయే సిటీ-ఫ్రెండ్లీ కారుగా మారుస్తాయి. చిన్న వీధులు, ట్రాఫిక్‌తో నిండిన రహదారులు .. ఎక్కడైనా రాకోను సులభంగా నడపగలగడం దీని ప్రత్యేకత.

Byd Raco Electric Kei Car Debuts At 2025 Japan Mobility Show More Details

బయట రూపం ఎంత ఆకర్షణీయంగా ఉందో, ఇంటీరియర్ కూడా అంతే క్లాస్‌గా, ఆధునికంగా ఉంటుంది. క్యాబిన్‌లో అడుగుపెడితే, ఒక చిన్న కారు లోపల ఇంత ఆధునికత ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ముందుగా కనిపించే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే వాహనానికి ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది. దీనితో పాటు ఉన్న త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ స్పోర్టీ లుక్‌ను పెంచుతూ, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 30, 2025, 16:26 [IST]
English summary
Byd raco electric kei car debuts at 2025 japan mobility show more details
Read more on: #byd #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+