ఒక్క కారుతో టయోటాకు లాభాల పంట.. రూ.1.2కోట్ల కారును ఎన్ని వేల మంది కొన్నారో తెలుసా ?

టయోటా కంపెనీ 2025 మార్చి నెలను మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. నిజంగా ఈ నెల కంపెనీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నెలలో టయోటా రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. అందులో ఇన్నోవా హైక్రాస్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది టయోటా సాధించిన గొప్ప విజయం. ఇన్నోవా హైక్రాస్ మొత్తం 9,856 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇది కేవలం మార్చి నెలలోనే కాకుండా గత ఐదు నెలల్లో కూడా ఊహించని అత్యధిక అమ్మకాలు. అంటే దీనిని బట్టి ఈ కారుకు వినియోగదారుల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉంది. టయోటా మరో లగ్జరీ కారు ఏకంగా 1721శాతం వృద్ధిని నమోదు చేసింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Toyota Vellfire Two

టయోటా ప్రీమియం ఎంపీవీ కారు వెల్‌ఫైర్ అమ్మకాల్లో ఊహించని పెరుగుదల కనిపించింది. ఫిబ్రవరి నెలలో కేవలం 19 కార్లు మాత్రమే అమ్ముడుపోగా, మార్చి నెలలో ఏకంగా 346 కార్లు అమ్ముడయ్యాయి. ఇది నెలవారీగా 1721శాతం వృద్ధిని సూచిస్తుంది. వెల్‌ఫైర్ ప్రజాదరణ పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దీని ఎక్స్-షోరూమ్ ధర అక్షరాలా రూ. 1.20 కోట్లు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే కాలంలో 203 యూనిట్లు అమ్ముడైన టయోటా క్యామ్రీ కంటే వెల్‌ఫైర్ అమ్మకాలు ఎక్కువగా ఉండడం. వెల్‌ఫైర్ తన అద్భుతమైన ఫీచర్లు, ప్రత్యేకతల ద్వారా ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Toyota Vellfire Price

ఇది 2.5 లీటర్ ఇన్-లైన్ 4 సిలిండర్ డీఓహెచ్‌సి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్, హైబ్రిడ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో తక్కువ ఉద్గారాలతో అధిక శక్తిని అందిస్తుంది. వెల్‌ఫైర్ లీటరుకు 19.28 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఇది టయోటా పర్యావరణ అనుకూలత, స్టెబిలిటీకి నిదర్శనం.

వెల్‌ఫైర్ డిజైన్, సౌకర్యవంతమైన ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ వీల్‌బేస్ కారణంగా విశాలమైన ఇంటీరియర్ ప్రయాణికులకు అత్యంత సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్రీమియం ఎంపీవీ మూడు బాహ్య రంగులు, మూడు ఇంటీరియర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Toyota Vellfire Front

ఈ కారు అందరి అభిరుచులకు అనుగుణంగా రూపొందించారు. ఇది అధునాతన కనెక్టివిటీ ఆప్షన్‌లతో కూడిన 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన ప్రత్యేకమైన వెనుక సీట్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో సహా అనేక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

టయోటా 2025 మార్చి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో ఇన్నోవా హైక్రాస్ ఎప్పటిలాగే కంపెనీ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. గత నెలలో 9,856 కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత 5 నెలల్లో అత్యధిక అమ్మకాలు. మరోవైపు, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన, ప్రీమియం ఎంపీవీ అయిన వెల్‌ఫైర్ అమ్మకాల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది.

Toyota Vellfire Style

గత నెలలో 346కార్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి నెలలో ఇది కేవలం 19కార్లు మాత్రమే. అంటే నెలవారీగా 1721శాతం వృద్ధి నమోదైంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 కోట్లు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనికి ఉన్న డిమాండ్ క్యామ్రీ (203 కార్లు) కంటే ఎక్కువ. గత మార్చి నెలలో వెల్‌ఫైర్ కార్లను విక్రయించడం ద్వారా కంపెనీ దాదాపు రూ. 415 కోట్ల ఆదాయం పొందింది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 17, 2025, 7:01 [IST]
English summary
Car company earns huge profit with single car so many people bought this 1 2 crore car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+