డీజిల్ కార్ల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. మీ కలల కారు ఈ లిస్టులో ఉందేమో చెక్ చేయండి

సామాన్యుల బాధలను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జాలి చూపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సమావేశంలో పన్నుల్లో భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతుంది. పాత 12శాతం, 28శాతం పన్ను రేట్లను తొలగించి వాటి స్థానంలో 5శాతం, 18శాతం శ్లాబులను మాత్రమే ఉంచారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి పన్నుల తగ్గింపు వల్ల ఏయే కార్ల ధరలు తగ్గబోతున్నాయో తెలుసుకుందాం.

కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటులో ఉండేలా చిన్న కార్ల మీద జీఎస్టీ(GST)ని భారీగా తగ్గించింది. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

Car Prices to Drop from September 22 Check if Your Car is on the List

దీనితో ఈ లిస్టులో ఉన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇక మీదట 1200 సీసీ ఇంజన్ కెపాసిటీ ఉన్న పెట్రోల్ కార్లు, 1500 ఇంజన్ కెపాసిటీ ఉన్న డీజిల్ కార్ల మీద పన్ను 18 శాతానికి తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల ఏయే కార్లు చౌకగా మారాయో చూద్దాం.

దేశంలో కార్ల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 శాతం, 28 శాతం ఉన్న పన్ను రేట్లను తొలగించి, కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్‌లను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మార్పుల వల్ల నాలుగు మీటర్ల లోపు పొడవు, 1200 సీసీ లోపు పెట్రోల్ ఇంజిన్, 1500 సీసీ లోపు డీజిల్ ఇంజిన్ ఉన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.

Car Prices to Drop from September 22 Check if Your Car is on the List

దీంతో కార్ల ధరలు సుమారు 10శాతం వరకు తగ్గుతాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఈ తగ్గింపు రాబోయే పండుగ సీజన్‌కు ముందు కొనుగోలుదారులకు గొప్ప ఊరటనిస్తుంది. అంతేకాదు 1500 సీసీ వరకు ఉన్న డీజిల్ కార్లకు కూడా ఈ పన్ను తగ్గింపు వర్తిస్తుంది.

ప్రభుత్వ కొత్త జీఎస్టీ విధానం వల్ల భారత మార్కెట్‌లో ఎక్కువ అమ్ముడవుతున్న చాలా కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా, మారుతి, టాటా, హ్యుందాయ్, కియా వంటి కంపెనీల కార్లు ఈ లిస్టులో ఉన్నాయి.

Car Prices to Drop from September 22 Check if Your Car is on the List

1200 సీసీ ఇంజిన్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల వరకు ఉంది. దీని ధర సుమారు రూ.60,000 వరకు తగ్గుతుందని అంచనా. అలాగే మారుతి నుంచి వచ్చిన ఫ్రాంక్స్ ఎస్ యూవీ ధర రూ.7.58 లక్షల నుంచి రూ.13.04 లక్షల వరకు ఉంది. దీని ధర కూడా తగ్గుతుంది.

టాటా కంపెనీ వారి టాటా పంచ్ చిన్న ఎస్‌యూవీ ధర రూ.6 లక్షల నుంచి రూ.10.32 లక్షల వరకు ఉంది. ఇది స్ట్రాంగ్ బాడీ కారణంగా ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ మోడల్‌లలో ఒకటిగా నిలిచిన టాటా టియాగో బేస్ మోడల్ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని సీఎన్‌జీ, ఆటోమేటిక్ వేరియంట్ల మైలేజ్ లీటర్‌కు 28.06 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Car Prices to Drop from September 22 Check if Your Car is on the List

పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారు డీజిల్ మోడల్‌పై ట్యాక్స్ తగ్గింపు ఉంటుంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.15.89 లక్షల వరకు ఉంటుంది. కియా సోనెట్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కూడా పన్ను తగ్గింపుతో మరింత చౌకగా మారనుంది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు.

కార్లతో పాటు 350 సీసీ లోపు ఉన్న మోటార్‌సైకిళ్లు, త్రీ వీలర్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లపైనా జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. వాహన విడిభాగాలపై కూడా జీఎస్టీ రేటు 18 శాతానికి తగ్గింది.

అయితే, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న పెద్ద కార్లు, ఎస్‌యూవీలకు జీఎస్టీ రేటు 40 శాతంగా ఉంటుంది. ఇది పాత పన్నుల కన్నా తక్కువ కావడంతో వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త పన్ను విధానం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, వినియోగదారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

Article Published On: Friday, September 5, 2025, 12:26 [IST]
English summary
Car prices to drop from september 22 check if your car is on the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+