స్టైలిష్ లుక్.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్..10లక్షల బడ్జెట్‌లో 30 కి.మీ. మైలేజ్‌తో 2025లో రాబోతున్న కార్లు ఇవే!

మన దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. దీంతో లో బడ్జెట్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఎంట్రీ లెవెల్ కాకపోయినా, 10 లక్షల రూపాయల లోపు ధర ఉండే కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా కంపెనీలు ఈ ధరలో రకరకాల బాడీ టైపుల్లో కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

తక్కువ ధర వాహనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కార్ల తయారీదారులు 10 లక్షల రూపాయల లోపు ధరలో అనేక కొత్త మోడళ్లను ఈ ఏడాది విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫీచర్లలో కానీ, స్టైల్‌లో కానీ రాజీ పడకుండా అందుబాటు ధరలో కార్లను కోరుకునే కస్టమర్ల కోసం కొత్త ఆప్షన్లను తీసుకురావడమే ఈ ప్రయత్నం ముఖ్య ఉద్దేశం.

Nissan

టాటా, నిస్సాన్, రెనో, హ్యుందాయ్, మారుతి సుజుకి వంటి కంపెనీల నుంచి ఆఫర్లు రాబోయే కార్ లాంచ్‎ల లిస్ట్‌లో ఉన్నాయి. ఈ మోడళ్లు కస్టమర్ల వివిధ ప్రాధాన్యతలు, అవసరాలను తీర్చే విధంగా ఉంటాయి. త్వరలో ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతున్న 10 లక్షల రూపాయల లోపు ధర ఉండే కార్లను ఈ కథనంలో చూద్దాం.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్: భారతదేశపు ప్రముఖ కార్ల తయారీదారు టాటా తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను త్వరలో కొత్త హంగులతో విడుదల చేయబోతోంది. దీని టెస్టింగ్ ఇప్పటికే రోడ్లపై చురుగ్గా జరుగుతోంది. త్వరలో మార్కెట్‌లోకి వస్తుందని అనుకుంటున్న ఈ కొత్త వెర్షన్‌లో కొత్త బంపర్‌లు, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లు ఉంటాయి.

Tata

ఇంటీరియర్‌లో కొత్తగా డిజైన్ చేసిన డాష్‌బోర్డ్, మరిన్ని ఫీచర్లతో రాబోతుంది. ఆల్ట్రోజ్ పవర్‌ట్రెయిన్‌లో మార్పులు ఉండకపోవచ్చు. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్‌లలో ఆల్ట్రోజ్ అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ సీఎన్‌జీ కూడా ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్: రెనాల్ట్ ఇండియా లైనప్‌లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ట్రైబర్. మనదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన 7 సీటర్ కారుకు ఈ సంవత్సరం మిడ్-సైకిల్ అప్‌డేట్ లభిస్తుంది. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా డిజైన్ చేసిన ఎక్స్‌టీరియర్ ఉంటుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే చాలా షార్ప్‌గా కనిపిస్తుంది.

Renault Triber

ట్వీక్ చేసిన డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త అప్‌హోల్‌స్టరీ, మరిన్ని ఫీచర్‌లు వంటి ఇంటీరియర్ మార్పులు ఈ కాంపాక్ట్ MPVకి ఎక్స్ ట్రా ప్రయోజనాలను చేకూరుస్తాయి. మెకానికల్‎గా ఎలాంటి మార్పులు లేకుండా, ట్రైబర్ ఇంతకు ముందున్న 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి.

నిస్సాన్ 7 సీటర్ కాంపాక్ట్ MPV: రెనాల్ట్ ట్రైబర్‌ను ఆధారంగా చేసుకుని ఇండియన్ మార్కెట్‌లో ఒక కొత్త 7 సీటర్ MPVని విడుదల చేయనున్నట్లు నిస్సాన్ ఇటీవల కన్ఫాం చేసింది. ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని నిర్ణయించిన ఈ MPV టీజర్‌ను కూడా నిస్సాన్ విడుదల చేసింది. CMF-A ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడిన ఈ కారు లేటెస్ట్, స్పెషల్ స్టైలింగుతో వస్తుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

రాబోయే MPV ఇంటీరియర్ లేఅవుట్‌లో కూడా కొన్ని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. 72 bhp పవర్, 96 Nm పీక్ టార్క్‌ను అందించగల 1.0 లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఈ MPVకి పవర్ ఇస్తుంది.5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. రెనాల్ట్ ట్రైబర్ లాగానే ఈ కారు ధర కూడా దాదాపు 6 నుండి 7 లక్షల రూపాయల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

Renault Kiger

రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్: సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో రెనాల్ట్ విక్రయిస్తున్న మోడల్ కైగర్. ఈ మోడల్‌ను 2025 చివరి నాటికి కొత్త హంగులతో మార్కెట్‌లోకి తీసుకురావాలని ఫ్రెంచ్ కార్ల తయారీదారు యోచిస్తోంది. డిజైన్ పరంగా కొత్త కైగర్‌లో మార్పులు ఉంటాయి. క్విడ్‌తో పోలిక కలిగిన కైగర్ ఫ్రంట్ ఫాసియాను పూర్తిగా మార్చడం, కొత్త రెనాల్ట్ లోగోను చేర్చడం వంటివి డిజైన్ అప్‌గ్రేడ్‌లలో ఉంటాయి.

క్యాబిన్‌లో డాష్‌బోర్డ్ లేఅవుట్‌లో కొన్ని చిన్న మార్పులు చేస్తారు. ఇది మాత్రమే కాకుండా, పోటీదారులతో పోటీ పడటానికి కైగర్ SUVలో కంపెనీ మరిన్ని ఫీచర్‌లను జోడిస్తుంది. అయితే కారు పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. హుడ్ కింద, తెలిసిన 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లు కొనసాగుతాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి.

Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ: భారతీయుల అభిమాన సబ్ కాంపాక్ట్ SUVలలో హ్యుందాయ్ వెన్యూ ఒకటి. తర్వాతి తరం వెన్యూ రోడ్ టెస్టింగ్ ఇప్పటికే జరుగుతోంది. ఇటీవల విదేశాలలో టెస్టింగ్ చేస్తున్నప్పుడు వెన్యూ N-లైన్ కెమెరా కంటికి చిక్కింది. 2025 క్యాలెండర్ సంవత్సరం ద్వితియార్థంలో ఈ కారు అమ్మకానికి వస్తుందని భావిస్తున్నారు.

కాంపాక్ట్ SUV రెండవ తరం వెర్షన్ తాజా క్రెటా, అల్కాజార్‌తో సహా ఇతర హ్యుందాయ్ SUVల మాదిరిగానే కొత్త డిజైన్‌తో సహా కొన్ని అప్‌డేట్‌లను పొందుతుంది. అప్‌డేట్ చేసిన ఇంటీరియర్ లేఅవుట్, మెరుగైన ఫీచర్ సెట్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ప్రస్తుత డీజిల్, పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లే కొనసాగుతాయి.

Maruti Fronx

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్: మార్కెట్‌లోకి వచ్చిన రెండేళ్లలో మూడు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై భారీ విజయాన్ని సాధించిన మారుతి SUV ఫ్రాంక్స్. ఈ సంవత్సరం జనవరిలో కొత్త 'హైబ్రిడ్' బ్యాడ్జ్‌తో ఫ్రాంక్స్ హైబ్రిడ్ ఇండియాలో టెస్టింగ్ చేస్తున్న స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఇంటర్నల్‎గా YTB అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఈ హైబ్రిడ్ క్రాస్‌ఓవర్ 2025 చివరి నాటికి విడుదల అవుతుందని భావిస్తున్నారు.

ఇది బ్రాండ్ సొంతంగా అభివృద్ధి చేసిన HEV సీరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే మొదటి కారుగా భావిస్తున్నారు. ఈ సెటప్‌లో తెలిసిన 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తారు. నివేదికల ప్రకారం.. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పాటు, మారుతి ఈ కారుకు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను కూడా అందిస్తుంది. దాదాపు 30 కిలోమీటర్ల మైలేజ్‌తో వస్తుందని భావిస్తున్న ఈ కారు ఫీచర్ లిస్ట్‌ను కూడా మార్చనున్నారు.

10 లక్షల రూపాయల లోపు ధరలో రాబోతున్న ఈ కార్లు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌కు కొత్తదనాన్ని తీసుకువస్తాయి. క్వాలిటీ, పర్ఫామెన్స్, ఫీచర్‌లలో రాజీ పడకుండా బడ్జెట్ ధరలో వాహనాలను కోరుకునే కస్టమర్లను ఈ కార్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటాయి. వాల్యూ, కెపాసిటీ, స్టైల్ అందించే ఈ కార్లు కస్టమర్లకు 10 లక్షల రూపాయల బడ్జెట్‌లో మంచి ఆప్షన్లుగా మారనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 10:15 [IST]
English summary
Cars with up to 30km mileage more in the list upcoming cars under 10 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+