భారత ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మరింత పెరుగుతాయా? చైనా ఒక్క నిర్ణయంతో EV రంగానికి షాక్!
ప్రపంచ అభివృద్ధికి బీజాలు వేసే లేటెస్ట్ టెక్నాలజీలకు మూలమైన అరుదైన భూమి ఖనిజాల (రేర్ ఎర్త్ మాగ్నెట్స్)పై చైనా ఎగుమతులు నిషేధం విధించడం కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. చైనా ప్రభుత్వం నిర్ణయంతో గ్లోబల్ ఆటోమొబైల్ రంగంతోపాటు అనేక కీలక పరిశ్రమల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, క్లీన్ ఎనర్జీ పరికరాలు వంటి మొదలగు వాటిలో ఎక్కువగా ఉపయోగపతాయి. ఒక్కసారి వీటి సరఫరా ఆగిపోతే, ప్రపంచ వ్యాప్తంగా ఆటో పరిశ్రమ గాడిలో పడిపోవడం ఖాయం. హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు.. ఇవన్నీ రేర్ ఎర్త్ మేటీరియల్స్ (REMలు) పై ఆధారపడి ఉంటాయి. చైనా నుంచి ఎగుమతులు నిలిచిపోవడం వల్ల, ఈ విభాగాల్లో ఉత్పత్తి వ్యాప్తికి పెద్ద అడ్డంకిగా మారనుంది.
ఇప్పటికే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలు, ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన కీలక భాగాలు, ముఖ్యంగా మోటార్లలో వాడే అయస్కాంతాలు అందకపోవడం వల్ల, మరికొన్ని నెలల్లోనే ఈ వాహనాల డిమాండ్-సప్లై వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది. మోటారు కంపెనీలు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతుండగా, ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్ల కొరత మరింత ఉత్పత్తి ఖర్చులను పెంచేలా మారుతుంది. సాంప్రదాయ ICE వాహనాలపై అతి తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

చైనా ప్రస్తుతం ప్రపంచ అరుదైన భూమి మూలకాలలో 61% మైనింగ్ నిర్వహించడమే కాక, వాటిలో 91% శుద్ధి (ప్రాసెసింగ్) కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. అంటే ప్రపంచ REM సరఫరా గొలుసును అది గట్టిగా తన చేతుల్లో ఉంచుకుంది. దీనివల్ల ఇతర దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద అరుదైన భూమి ఖనిజ నిల్వలను కలిగి ఉంది.
అయినప్పటికి, పెట్టుబడుల కొరత, ప్రైవేట్ రంగంలో వేగవంతం లేకపోవడం వల్ల ఇప్పటికీ సరైన సరఫరా గొలుసును అభివృద్ధి చేయలేకపోయింది. చైనా 2025 ఏప్రిల్‌లోనే, ఏడు ముఖ్యమైన అరుదైన మూలకాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. అవి, సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యట్రియం. ఈ మూలకాలు, ముఖ్యంగా నియోడైమియం ఐరన్ బోరాన్ (NdFeB), సమారియం-కోబాల్ట్ (SmCo) అయస్కాంతాల తయారీలో ఉపయోగిస్తారు.

వీటి వినియోగం ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), హైబ్రిడ్ కార్లలో ఎక్కువగా ఉంటుంది. ఒక్క ఎలక్ట్రిక్ వాహనానికి సగటుగా 0.8 కిలోలు అరుదైన భూమి మూలకాలు ఉపయోగిస్తారు. అదే, హైబ్రిడ్ వాహనాలకు 0.5 కిలోలు, సాంప్రదాయ ICE వాహనాలకు కేవలం 0.1 కిలోలు మాత్రమే అవసరం. దీని అర్థం ఏమిటంటే? చైనా విధించిన తాజా ఆంక్షల ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధికంగా ఉంటుంది.
అనంతరం హైబ్రిడ్ వాహనాలు, ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలపై కూడా నేరుగా పడనుంది. ICE వాహనాలు అత్యల్పంగా ప్రభావితమవుతాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం, ఈ ప్రభావం తక్కువలో తక్కువ రెండు నుండి ఆరు నెలల వరకు తయారీపై పడినట్లయితే, 5-8 శాతం ధర పెరుగుదలకు దారి తీసే అవకాశముంది. అంటే రూ.1.5 లక్షల ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, పరిస్థితిని బట్టి రూ.7,000 నుండి రూ.13,000 వరకూ పెరిగే అవకాశం ఉంది.

ఇది మధ్య తరగతి వినియోగదారులపై ప్రత్యక్ష భారం వేసే అంశంగా మారుతుంది. భారతదేశం రేర్ ఎర్త్ ఎలిమెంట్లకు 90% పైగా ఆధారపడేది చైనాపై. ఇప్పుడు చైనా నుంచి సరఫరా ఆగిపోతే, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఇలక్ట్రిక్ వాహన విప్లవం కాస్త గాడిలో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా EV స్టార్టప్‌ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. బ్యాటరీ మోటార్ ధరలు పెరిగే అవకాశముంది. ఉత్పత్తి ఆలస్యం, వినియోగదారులకు డెలివరీ లేట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








