ప్రపంచ EV చరిత్రలోనే కొత్త అధ్యాయం.. ఎవరు ఊహించని విధంగా చైనా కంపెనీ టెస్లాకే వణుకు పుట్టిస్తుంది!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లా పేరు వినబడుతుంది. అయితే దీనికి ప్రధాన పోటీదారు చైనాకు చెందిన బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్-BYD). ఈ కంపెనీ అంతర్జాతీయంగా ఈవీలను విడుదల చేస్తుంది. భారత్‌లో కూడా తన మార్కెట్ కలిగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా byd కార్లు రోడ్లపై కనిపిస్తుంటాయి. ఇంత పెద్ద వాహన తయారీదారు తాజాగా కొత్త ఘనతను సాధించింది. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా అసాధారణమైన మైలురాయిని చేరుకుంది. టెస్లాను పక్కనబెట్టి, అతి తక్కువ కాలంలో 13 మిలియన్ల (1.3 కోట్ల) కార్లను ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ చైనాలో ప్రారంభమై, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు అదే BYD, ఒక ఘనతను చరిత్రలో నిలిపేలా చేసింది.

13 మిలియన్ల వాహనాల ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతకు ప్రతీకగా నిలిచిన వాహనం.. Yangwang U7, లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారు ఉత్పత్తి షెన్‌జెన్ - షాన్‌వే ఇండస్ట్రియల్ జోన్‌‌లో ఉన్న BYD ప్లాంట్‌లో జరిగింది. ఇది కేవలం ఓ వాహనాన్ని తయారుచేసిన ఘటన మాత్రమే కాదు, EV ఇండస్ట్రీలో చైనాకు BYD తీసుకువచ్చిన స్థానం, కెపాసిటీని ప్రపంచానికి చూపించిన క్షణం.

Byd Crossed 1 3 Crore Vehicles Produced

ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లా పేరు ఎంతగా వినిపించినా, చైనాలో BYD సంస్థ మాత్రం మౌనంగా, కానీ శక్తివంతంగా కొత్త చరిత్రను రాస్తోంది. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే తొలిసారిగా 13 మిలియన్ల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీగా నిలవడం విశేషం. ఈ ఘనత సాధించడంలో BYDకి సాంకేతికత, స్థిరమైన వ్యూహం, ఉత్పత్తి సామర్థ్యం అన్నీ బలంగా తోడయ్యాయి.

ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇతర ఎలక్ట్రిక్ దిగ్గజాలన్నింటినీ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెస్లానీ కూడా BYD ఈ విషయంలో వెనక్కి నెట్టింది. టెస్లా ప్రపంచంలోని అతిపెద్ద EV తయారీ సంస్థగా పేరొందినా, ఇప్పటివరకు 13 మిలియన్ మైలురాయిని తాకలేదు. అయితే, టెస్లా తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2025 ప్రారంభంలో లెక్కల ప్రకారం, టెస్లా గత ఆరు నెలల్లో చైనాలోనే 21.3 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది.

Chinese Company Byd

ఇది గత ఏడాదితో పోల్చితే 31.5 శాతం పెరుగుదల. అంతేకాకుండా, టెస్లా విదేశీ మార్కెట్లలో కూడా తన శక్తిని ప్రదర్శిస్తోంది. ఈ కాలంలో 4.72 లక్షల వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అందులోనూ, టెస్లా మొత్తం అమ్మకాలు 128.5 శాతం వృద్ధి సాధించడమే మరో విశేషం. ఇది గ్లోబల్ EV డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో, అలాగే పోటీ ఏ రేంజ్‌లో ఉందో సూచించే విషయం.

ప్రధానంగా BYD ప్రీమియం సబ్-బ్రాండ్ యంగ్‌వాంగ్ ఉత్పత్తి చేసిన U7 కారుతో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ కారు కేవలం లుక్స్ పరంగానే కాకుండా, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ అద్భుతంగా నిలుస్తోంది. ఈ సంస్థను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేసిన మరో మోడల్ BYD ఆటో 3. 2022 ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV, కేవలం 31 నెలల్లోనే 1 మిలియన్ అమ్మకాల మార్క్‌ను దాటేసింది.

byd atto 3

ప్రారంభించిన మొదటి 14 నెలల్లోనే 3 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, తర్వాతి 6 నెలల్లో మరో 2 లక్షల కార్లు విక్రయమయ్యాయి. ఈ స్పీడే ఈ మోడల్‌ను BYD బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలబెట్టింది. ఆటో 3 కేవలం చైనాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతోంది. BYD ఇప్పటికే భారతదేశంలో కూడా తన ఉనికిని స్థిరపరచుకుంటోంది. కొన్ని వాహన మోడళ్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2025, 10:14 [IST]
English summary
Chinese company byd crossed 1 3 crore vehicles produced details
Read more on: #byd
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+