ఇండియాలో చైనా కారుకు యమ క్రేజీ.. 542 కి.మీ రేంజ్, 5 స్టార్ సేఫ్టీ.. అసలు కారేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో దేశీయ కంపెనీలే కాకుంగా అంతర్జాతీయంగా ఉన్న ఈవీ తయారీదారులు పోటా పోటీగా మెరుగైన బ్యాటరీ పనితీరును కనబరిచే వాహనాలను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనా‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యోర్ డ్రీమ్స్) భారతదేశంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. అధునాతన టెక్నాలజీ, డిజైన్, పనితీరు పరంగా భారత వినియోగదారులకు అనుకూలమైన ఈవీ కార్లను తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి గతంలో విడుదల అయిన సీలియన్ 7 కారు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్ గురించిన వివరాలను కింది కథనంలో ఒకసారి చూద్దాం.

BYD సంస్థ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ MPV మోడల్ BYD సీలియన్-7 ను ప్రదర్శించింది. దీని డిజైన్ ఆకట్టుకునేలా ఉండటంతో కస్టమర్లలో దీనికి పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. అయితే ఇది కేవలం ప్రదర్శనకే పరిమితమవకుండా, వెంటనే మార్కెట్లోకి అమ్మకానికి వచ్చింది. కంపెనీ ఫిబ్రవరిలో దీనిని అధికారికంగా భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర వచ్చే సరికి రూ. 48.90 లక్షలుగా నిర్ణయించింది.

Chinese Company Byd Sealion 7

ధర కొంచె ఎక్కువగా ఉనప్పటికీ, సీలియన్-7 కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. విశాలమైన ఇంటీరియర్, ఫ్యూచరిస్టిక్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అధిక రేంజ్ కారణంగా కస్టమర్లకు బాగా నచ్చింది. దీని ప్రీమియం మోడల్ ధర రూ. 48.90 లక్షలు కాగా, పెర్ఫార్మెన్స్ మోడల్ మరింత ఎక్కువగా రూ. 54.90 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. BYD సీలియన్-7 స్టైల్‌, పనితీరు పరంగానూ మిగతా ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ఈ మోడల్ ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) సెటప్‌ను కలిగి ఉంది. 308 bhp పవర్, అలాగే 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అమర్చిన బ్యాటరీని ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, ఇది గరిష్టంగా 567 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటుంది.

Chinese Company Byd Sealion 7 Design Price

అదే పెర్ఫార్మెన్స్ వేరియంట్ అయితే, మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో వస్తుంది. ఇందులో రెండు మోటార్లు ఉండటంతో, ఈ వేరియంట్ 523 bhp పవర్, 690 Nm టార్క్‌ను ఉత్పత్తి చే-స్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సీలియన్-7లో ప్రయాణికుల రక్షణకు సంబంధించి డజన్ల కొద్ది అధునాతన సేఫ్టీ ప్రమాణాలను అందించారు.

ఈ కారులో 11 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్ 2 ADAS సిస్టమ్ ఉన్నాయి. అలాగే, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్టెంట్ వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు అందించారు. ఇవి డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇది స్టైలిష్ అవుట్‌లుక్‌తో పాటు లగ్జరీ ఇంటీరియర్ అనుభూతిని కోరుకునే వారికి పర్‌ఫెక్ట్ ఎంపికగా నిలుస్తోంది. ఇంటీరియర్‌లో ప్రయాణికులకు అవసరమైన పలు ఆప్షన్లు ఉన్నాయి.

Chinese Company Byd Sealion 7 Design Price Range Features
-+

లోపల 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మ్యూజిక్ లవర్స్‌కు 12 స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇంకా ముందు సీట్లు విద్యుత్తుతో సర్దుబాటు చేయగలిగేవి, కొత్త లైటింగ్ డైమెన్షన్ కోసం పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటివి దీనిలో అందించారు. ఇది యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5స్టార్ సాధించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 23, 2025, 15:45 [IST]
English summary
Chinese company byd sealion 7 design price range features and all top things details
Read more on: #byd #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+