కోట్ల విలువైన డిఫెండర్ కారు కేవలం రూ.3.5 లక్షలకే.. అసలును మించిపోయే డూప్.. అంతా చైనా మాయాజాలం!
ప్రఖ్యాత బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ (land rover) అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలో కూడా బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాటిలో డిఫెండర్ (defender) అంటే అందరికి యమ క్రేజ్. డిఫెండర్ కార్లు ఎవరినైనా ఆకట్టుకునేలా గంభీరమైన రూపంతో చాలా స్టైలిష్‌గా ఉంటాయి. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా ధనవంతులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు లాంటి మొదలగు వారు ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది, అది ఏంటంటే కోట్ల రూపాయలు ధర కలిగిన డిఫెండర్ కారును చైనాలో కాపీ చేస్తూ ఒక కారును సృష్టించి కేవలం రూ. 3.50 లక్షలకు అమ్ముతున్నారు.
సాధారణంగానే ఇతరును కాపీ కొట్టడంలో చైనా ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ప్రధానంగా ఇతర దేశాలకు చెందిన కార్ల డిజైన్లను కాపీ తక్కువ ధరలో లాంచ్ చేయడంలో చైనా తరువాతే ఎవరైనా. అలాంటిది ఇప్పుడు ప్రఖ్యాత బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు రూపంతో తక్కువ ధరలో కారును తయారు చేసి అమ్ముతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది అసలు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కాకుండా, దాని కాపీ మోడల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండియాలో బాగా ఫేమస్ అయిన మోడళ్లను కూడా చైనాలో కాపీ చేసి అక్కడి వారికి విక్రయించారు. టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్ల నుండి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వంటి బైక్‌ల వరకు చాలా మోడళ్లను కాపీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వాటిని కాపీ చేసి చేయడం చైనాకు అలవాటు.
ఇటీవలి కాలంలో అమెరికా, యూరోపియన్ దేశాల నుండి విడుదల అయిన వాహనాలను కూడా కాపీ కొట్టి చైనాలో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీ రోల్స్ రాయిస్‌కు చెందిన కోట్లు ఖరీదు చేసే కల్లినన్ కారును కాపీ చేసి ఒక కారును సృష్టించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అయింది.

ఈ క్రమంలో ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కాపీ చేస్తూ చైనాలో ఒక కారు సృష్టించి అమ్ముతుండటం గమనార్హం. ఫేక్ డిఫెండర్‌ను అన్‌బాక్సింగ్ వీడియోను ఒకరు తన యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేశారు. ఒక పెద్ద చెక్క పెట్టె లోపల డెలివరీ చేయబడిన నకిలీ డిఫెండర్ కారును బయటకు తీసుకువస్తున్నట్లు వీడియోలో కనిపించింది. బాక్సీ ఆకారంతో, ఈ కారు చూడటానికి డిఫెండర్ లాగా కనిపిస్తుంది.
ఇది చూడటానికి డిఫెండర్ కారును పోలి ఉన్నట్టుంది కానీ, అసలైన మెడల్‌లో ఉన్న ఫీచర్స్ దీనిలో అందించలేదు. దీని సైజు కూడా చాలా తక్కువగా ఉంది. అసలైన డిఫెండర్‌కు దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ చైనీస్ కారు ధర భారత రూపాయలలో కేవలం రూ. 3.5 లక్షలు. ముందు డిఫెండర్ లాగా కనిపించినప్పటికి వెనుక నుంచి మాత్రం డిజైన్ వేరుగా ఉంది.

ఈ ఫేక్ ఢిఫెండర్ కారులో లోపలి భాగంలో మడతపెట్టగల వెనుక సీట్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ AC, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా EV మోడల్‌గా రూపుదిద్దుకుంది.


Click it and Unblock the Notifications








