చైనా సృష్టించిన మాయ.. ఒక ఛార్జ్‌తో 650 కిలోమీటర్లు.. కొత్తగా ముస్తాబై వచ్చింది!

చైనాకు చెందిన BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రపంచలోనే అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లాకు పోటీగా అంతర్జాతీయంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటుంది. అలాగే ఇండియాలో కూడా చాలా కాలంగా తన కార్లను విక్రయిస్తుంది. టెస్లా కార్లు ఇప్పటి వరకు ఇండియా రోడ్లపై పరుగులు పెట్టడం లేదు. దాని కంటే ముందుగానే ఇక్కడ అడుగుపెట్టి క్రమంగా తన కస్టమర్లను దేశవ్యాప్తంగా పెంచుకుంటుంది. మొదటగా, e6 అనే ఎంపీవీ ద్వారా భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది BYD. ఈ మోడల్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దీని తరువాత BYD భారత మార్కెట్‌ను మరింత ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వరుసగా 6 MPV, స్టైలిష్ Atto 3 SUV మోడళ్లను అందించింది.

వీటి తరువాత మూడో మోడల్ సీల్ సెడాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ అప్‌డేట్ చేసిన కొత్త 2025 మోడల్ సీల్ EVని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును మూడు ప్రత్యేక వేరియంట్లలో డైనమిక్ (RWD), ప్రీమియం (RWD), పెర్ఫార్మెన్స్ (AWD)లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇవి కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా వేరు వేరు ఆకట్టుకునే ఫీచర్స్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

2025 Seal Electric Sedan Detais

ధరల విషయానికి వస్తే, డైనమిక్ వేరియంట్ రూ. 41 లక్షలు, ప్రీమియం వేరియంట్ రూ. 45.70 లక్షలు, పెర్ఫార్మెన్స్ వేరియంట్ అయితే రూ. 53.15 లక్షలకు ఎక్స్-షోరూమ్ లో లభిస్తున్నాయి. ఇక్కడ కస్టమర్లను ఆసక్తి కలిగించే కీలక విషయం ఏమిటంటే, ఆసక్తికరంగా, 2025 మోడల్ ఇయర్ కోసం BYD కొన్ని అప్‌డేట్స్ చేసినప్పటికి కూడా బేస్ మోడల్ ధరపై మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

అయితే, మిగతా రెండు వేరియంట్లపై మాత్రం కంపెనీ రూ. 15,000 పెంపుదలను అమల్లోకి తీసుకొచ్చింది. చైనీస్ ఈవీ కార్ మేకర్ తన మొదటి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 1,300 సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌లను విక్రయించి తన సత్తా చాటింది. ఇక 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్ విషయానికి వస్తే, కొత్తగా పవర్ సన్‌షేడ్, సిల్వర్ డిమ్మింగ్ కానోపీ వంటి ఫీచర్లు జోడించి, డ్రైవింగ్ అనుభూతిని మరింత లగ్జరీ స్థాయికి తీసుకువెళ్లింది.

2025 Seal Electric Sedan In India With Updated Features

2025 మోడల్‌కి చెందిన కొత్త BYD సీల్ మరింత కొత్తగా ముస్తాబై, కస్టమర్లు కోరుకుంటున్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ సారి కారులో పెద్ద సైజులో కంప్రెసర్‌తో కూడిన అప్‌గ్రేడ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాక, గాలి నాణ్యతను మెరుగుపర్చేందుకు అధునాతన ఎయిర్ ప్యూరిఫికేషన్ మాడ్యూల్‌ను కూడా సమకూర్చారు, దీని వల్ల ప్రయాణికులకు శుభ్రమైన, హాయిగా ఉండే ఇంటీరియర్ వాతావరణం లభిస్తుంది.

దీని ప్రీమియర్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ మోడల్‌లో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపర్స్ (FSD) టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇది రైడ్‌ను మరింత మెరుగుపర్చేలా పని చేస్తుంది, అందువల్ల గడ్డకట్టిన రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా ఉంటుంది. ఇదే సమయంలో, పెర్ఫార్మెన్స్ వేరియంట్ మరింత ప్రత్యేకం. ఇందులో DiSus-C ఇంటెలిజెంట్ డంపింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు, ఇది కార్ హ్యాండ్లింగ్‌ను, డ్రైవింగ్ కంఫర్ట్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Chinese Ev Maker Byd Launched New Car

కారు లోపల ప్రయాణికులకు అవసరమైన డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిట్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డ్రైవర్‌కు సులభమైన మ్యూజిక్, నావిగేషన్, కమ్యూనికేషన్ అనుభవాన్ని కల్పించడం కోసం ఈజీ యాక్సెసింగ్ వంటివి ఉన్నాయి. డైనమిక్ రేంజ్ వేరియంట్‌లో 61.44 kWh బ్యాటరీ ప్యాక్, ప్రీమియం రేంజ్, పెర్ఫార్మెన్స్ రెండిట్లో కూడా 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు.

డైనమిక్ వేరియంట్ వెర్షన్ బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 510 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. అదే, టాప్ ఎండ్ వేరియంట్‌లో అందించిన బ్యాటరీ ప్యాక్‌ను పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 650 కి.మీల రేంజ్ అందిస్తుంది. సీల్ EVలో వెనుక-చక్రాల డ్రైవ్, ఆల్-చక్రాల డ్రైవ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌లో సింగిల్, డ్యూయల్ మోటార్ ఆప్షన్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2025, 9:50 [IST]
English summary
Chinese ev maker byd launched 2025 seal electric sedan in india with updated features
Read more on: #byd #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+