కేవలం రూ.11 వేల టోకెన్‌తో కారు సొంతం.. డిమాండ్ పెరగకముందే బుక్ చేసుకోవడం బెస్ట్

ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroën) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్రత్యేకమైన యూరోపియన్ స్టైల్ డిజైన్లతో ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకుంది. స్టైలిష్ డిజైన్, యూరోపియన్ ఫీల్, ప్రీమియం లుక్ అనే ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే ఈ కంపెనీకి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. సాధారణంగా భారతీయ కస్టమర్లు ఎక్కువగా మైలేజ్, బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, సిట్రోయెన్ మాత్రం తన కార్లలో అందించే సొగసుతో, క్లాసీ లుక్‌తో, కొత్త డిజైన్ భాషతో ఒక వేరే రేంజ్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు అదే ఇమేజ్‌ని మరింత బలోపేతం చేస్తూ, కంపెనీ తాజాగా సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X (Citroën Aircross X) అనే మోడల్‌ను పరిచయం చేసింది.

ఈ కారు లుక్‌లోనే కాకుండా ఫీచర్లలో కూడా కొత్తదనం తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా, కొత్త ముదురు ఆకుపచ్చ (డార్క్ గ్రీన్) రంగులో విడుదల చేసిన టీజర్ ఆటో లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కారు రియర్ డిజైన్‌లో కనిపించే కొత్త X బ్యాడ్జింగ్ దాని ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తోంది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X లో కంపెనీ అత్యాధునిక సౌకర్యాలను జోడించింది.

Citroen Aircross X Teased And Pre Booking Opened It Will Be Launch Soon

టెక్నాలజీ పరంగా కొత్త లెవెల్‌లో ఉన్న ఈ కారు, ఫీచర్లతో పాటు స్టైలిష్ SUV లుక్‌ను కలిపి అందిస్తోంది. అంతేకాకుండా, ప్రీమియం ఫినిషింగ్, మోడర్న్ ఇంటీరియర్స్, సేఫ్టీ ఫీచర్స్ ఈ వాహనం ఫ్యామిలీ కస్టమర్లు, యువత, మరియు స్టైలిష్ రైడ్‌ను కోరుకునే వారిని ఆకట్టుకునేలా ఉంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే, కంపెనీ రూ. 11,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభించింది.

కారు కావాలనుకునేవారు తక్కువ మొత్తంతోనే తమ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వ్యూహం వల్ల మార్కెట్లో ముందుగానే బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X భారత ఆటో మార్కెట్లో ఒక కొత్త కలర్, కొత్త లుక్, కొత్త ఫీల్‌ని తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్‌పై వస్తున్న రిప్లైలు చూస్తుంటే, ఈ SUV మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున చర్చనీయాంశమవ్వడం ఖాయం.

Citroen Aircross X Teased And Pre Booking Opened It Will Be Launch Soon

కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X ఇంజిన్ ఎంపికలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఇది కేవలం లుక్ లేదా ఫీచర్స్‌కే కాకుండా, శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో కూడిన SUVగా మార్కెట్లోకి రానుంది. బేస్ వేరియంట్‌లో 1.2 లీటర్, మూడు సిలిండర్ల సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. సాధారణ సిటీ డ్రైవింగ్, మైలేజ్‌పై దృష్టి పెట్టే వినియోగదారులకు సరిపోతుంది.

అంతేకాకుండా, మరింత పవర్ కోరుకునే కస్టమర్ల కోసం 1.2 లీటర్, మూడు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా కంపెనీ అందించనుంది. ఈ ఇంజిన్ 110 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయనున్నారు. దీని వలన హైవే డ్రైవింగ్, లాంగ్ ట్రిప్స్ లేదా ఫాస్ట్-పేస్డ్ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఇది సరైన SUVగా నిలుస్తుంది.

Citroen Aircross X Teased And Pre Booking Opened It Will Be Launch Soon

ఈ కారులో అన్నీ అధానాతన ఫీచర్స్ ఉంటాయి. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, LED ఫాగ్ లాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్, ఆటో-డిమ్మింగ్ IRVM, కారా స్మార్ట్ AI అసిస్టెంట్‌, క్రూయిజ్ కంట్రోల్, క్యాబిన్‌లో కొత్త అప్హోల్స్టరీ ఉంటాయి. సేఫ్టీ పరంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP),ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో యాంటీ-లాక్ బ్రేక్‌లు వంటి పలు ఆప్షన్లు ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 16, 2025, 17:02 [IST]
English summary
Citroen aircross x teased and pre booking opened it will be launch soon
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+