మండు వేసవిలో జీప్, సిట్రోయెన్ నుండి ప్రత్యేక ఆఫర్లు.. మీ కారుకి కేర్ అవసరం ఉంది!

స్టెల్లాంటిస్ ఆధ్వర్యంలోని ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు జీప్, సిట్రోయెన్ భారతదేశంలోని తమ కస్టమర్ల కోసం ఈ వేసవిలో ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలను ప్రారంభించాయి. 'జీప్ సమ్మర్ స్ప్లాష్ 2025','సిట్రోయెన్ సమ్మర్ క్రూయిజ్ 2025' పేరుతో ఇవి మే 2 నుండి మే 31, 2025 వరకు పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేకమైన క్యాంపెయిన్‌ల ఉద్దేశ్యం వినియోగదారుల వాహనాలకు మెరుగైన సేవలు అందించడానికి వీటిని ప్రత్యేకంగా ప్రారంభించారు. కాలానుగుణంగా సేవల విలువను వినియోగదారులకు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత జీప్, సిట్రోయెన్ డీలర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లలో ఈ సేవలు వినియోగదారులకు లభిస్తాయి.

కార్లకు అవసరమైన చెక్-అప్స్, ఫ్రీ ఇన్‌స్పెక్షన్లు, డిస్కౌంటెడ్ లేబర్ ఛార్జీలు, ప్రత్యేక ఆఫర్లు వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ సీజనల్ క్యాంపెయిన్‌లో భాగంగా అందించబడతాయి. ఈ ప్రయోజనాల వలన, కస్టమర్లు తమ వాహనాలను వేసవికి సిద్ధంగా ఉంచుకోవడమే కాకుండా, బ్రాండ్ ద్వారా ఉన్నత స్థాయి సేవను కూడా పొందగలుగుతారు. ఇది వినియోగదారులకు సేవ పరంగా నమ్మకాన్ని పెంచడమే కాక, బ్రాండ్‌కి మరింత సమీపంగా చేర్చే ప్రయత్నంగా కూడా చెప్పొచ్చు.

Summer 2025 Campaigns Splash Offer

ఈ ప్రత్యేక సమయంలో కస్టమర్లు లేబర్ ఛార్జీలపై ప్రత్యేక తగ్గింపులను పొందే అవకాశం ఉంది. కంపెనీలకు చెందిన విడిభాగాలను తక్కువ ధరలో కొనచ్చు. ఇంతటితో కాకుండా, వినియోగదారులు ఇప్పుడు పొడిగించిన వారంటీ (Extended Warranty) కొనుగోలు చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. దీనివల్ల వాహనంపై మరింత కాలం భద్రతా కవరేజ్ లభిస్తుంది, అలాగే భవిష్యత్తులో జరిగే అనుకోని ఖర్చుల నుంచి రక్షణ కూడా ఉంటుంది.

జీప్ సమ్మర్ స్ప్లాష్ 2025 అనేది జీప్ బ్రాండ్‌కి ప్రత్యేకతగా నిలిచే ఒక ప్రీమియమ్ సేవా ప్రచారం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా జీప్ యాజమానికులు తమ వాహనాలను వేసవి కాలానికి పూర్తిగా సిద్ధంగా ఉంచుకోవచ్చు. జీప్ తన వినియోగదారులకు మెరుగైన సేవా అనుభవాన్ని, ప్రత్యేకమైన ఆఫర్ల రూపంలో అందించడమే ఈ ప్రచారం ఉద్దేశ్యం. ఎండల వేడిని తట్టుకుని తమ వాహాలను నిలబెట్టడానికి అవసరమైన అన్ని సేవలను కంపెనీ ఇస్తుంది.

Citroen And Jeep

సిట్రోయెన్ సమ్మర్ క్రూయిజ్ 2025 కూడా తన వినియోగదారులకు ఈ ఎండల వేడిలో కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం సాగించడానికి చేపట్టిన కార్యక్రమం. ఇది వినియోగదారులకు ఆందోళన లేని, సంతోషం అందించే వేసవి డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. ప్రత్యేక ఆఫర్ల ద్వారా ఈటైంలో కంపెనీ అందించే సేవలను తక్కువ ధరలో పొందచ్చు.

జీప్ సమ్మర్ స్ప్లాష్ 2025, సిట్రోయెన్ సమ్మర్ క్రూయిజ్ 2025 అనే ఈ రెండు ప్రత్యేక సేవా ప్రచారాలు, బ్రాండ్లుగా జీప్, సిట్రోయెన్ తమ వినియోగదారుల పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా చాటిచెప్పుతున్నాయి. కస్టమర్ సంతృప్తి, ముందస్తు జాగ్రత్త, కాలానికి అనుగుణంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా వాహనాలను సిద్ధంగా ఉంచనున్నారు. వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల మధ్యన కూడా వాహనాలు సమర్థవంతంగా నడవాలంటే, ఈ అవకాశాలను వినియోగించుకోవడం చాలా అవసరం.

Take a Poll

కంపెనీ తెలిపిన ప్రకారం, కస్టమర్లు తమ సమీపంలోని అధికారిక జీప్ లేదా సిట్రోయెన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, ఈ పరిమితకాల సేవల ప్రయోజనాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. సిట్రోయెన్ సమ్మర్ క్రూయిజ్ 2025, జీప్ సమ్మర్ స్ప్లాష్ 2025 ప్రచారాల గురించి దగ్గరలోని డీలర్‌షిప్‌లలో తెలుసుకోండి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 10:50 [IST]
English summary
Citroen and jeep announced summer 2025 campaigns splash offer more details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+