లీటరుకు 19.5కి.మీ మైలేజ్, 5లగ్జరీ సీట్లు, ధర కూడా 8లక్షల్లోపే ఇస్తుంటే జనాలు కొనకుండా ఎలా ఉంటారు ?
సిట్రోయెన్ బసాల్ట్(Citroen Basalt) ఒక పాపులర్ కూపే SUV. ఇది మార్కెట్లో టాటా కర్వ్(TATA Curvv)కు గట్టి పోటీదారుగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్బుతమైన ఫీచర్లతో పాటు, ఇది మధ్య తరగతి వాళ్లకు కూడా అందుబాటు ధరలో కూడా లభిస్తుంది. అయినా, ఈ కారు అమ్మకాలు ఈ మధ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, మార్చి నెలలో అమ్మకాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
గత నెల (మార్చి-2025)లో సిట్రోయెన్ ఇండియా ఏకంగా 100 యూనిట్ల 'బసాల్ట్' కూపే SUVలను విక్రయించింది. అదే ఫిబ్రవరిలో కేవలం 37 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ గణాంకాలను పోల్చి చూస్తే నెలవారీ (MoM) అమ్మకాల వృద్ధి ఏకంగా 170.27శాతంగా ఉంది. జనవరిలో కూడా అమ్మకాల సంఖ్య రెండంకెల సంఖ్యను దాటలేదు. బసాల్ట్ కేవలం 61 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది.

పోయిన ఏడాది కూడా 'సిట్రోయెన్ బసాల్ట్' అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. డిసెంబర్‌లో 79 యూనిట్లు, నవంబర్‌లో 47 యూనిట్లు, అక్టోబర్‌లో 221 యూనిట్లు విక్రయించారు. ప్రస్తుతం అమ్మకాల సంఖ్య నెమ్మదిగా పుంజుకునే దిశలో ఉంది.
సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV ప్రత్యేకతలు: ఈ కారు ప్రారంభ ధర రూ. 8.32 లక్షలు, గరిష్ట ధర రూ. 14.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 5 సీటర్ కెపాసిటీని కలిగి ఉంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేస్తుంది. ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి 470 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉండి మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ SUV ఎక్సటర్నల్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూతో సహా అనేక రంగుల్లో అందుబాటులో ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది.
ఈ బసాల్ట్ కారు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది. ఇది 18 నుండి 19.5 కిమీ/లీటర్ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ SUV ప్రయాణికులకు మంచి సేఫ్టీని అందజేస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్‌సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రియర్ పార్కింగ్ సెన్సార్లతో సహా అనేక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
మొత్తంమీద సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUV కంపెనీకి ఒక కామధేనువుగా మారింది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బసాల్ట్ SUVకి దేశీయ వినియోగదారుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








