మేము ముందే చెప్పాం ఈ కారు ధర పెరుగుతుందని.. ఇప్పుడు భారీగా పెంచేశారు భయ్యా!
భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో నంబర్ వన్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఎంట్రీ ఇచ్చింది ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్. అమ్మకాలతో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని భావించింది. అయితే.. ఈ సంస్థ ఆశలు అనుకున్నంత మేర నెరవేరలేదనే చెప్పాలి. అమ్మకాల పరంగా పోటీలో టాప్ కంపెనీలతో పోలిస్తే వెనుకంజలోనే ఉంది. బసాల్ట్ కూప్ ఎస్‌యూవీతో సేల్స్ పరంగా కాస్తో కూస్తో మంచి ఫలితాలు రాబట్టిన ఈ కంపెనీ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలినట్లు అయింది. మంచి డిమాండ్ ఉన్నప్పుడు దీని ధర తగ్గించడానికి గల కారణమేంటి? ఇప్పుడు దీని రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ స్టొరీలో తెలుసుకుందాం.
న్యూ ఇయర్ నుంచే ధరలు పెంచుతామని గత డిసెంబరులోనే సిట్రోయిన్ సంస్థ ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పుడు బసాల్ట్ మోడల్ ధరలను పెంచేసింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుతుండడం, ద్రవ్యోల్బణం కారణంగా ఈ మోడళ్ల రేటు పెంచినట్లు తెలిపింది. ఈ కారు లాంచ్ అయినప్పుడు దీని ఎక్స్- షో రూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.83 లక్షలుగా ఉండేది. ఇదే ధరలో ఇప్పుడిక బసాల్ట్ దొరకదు.

బసాల్ట్ కారు దాని వేరియంట్‌ను బట్టి రూ.17,000 నుంచి రూ. 28,000 వరకు పెంచింది సిట్రోయిన్ సంస్థ. వేరియంట్ వారీగా పెరిగిన ధరలను పరిశీలిస్తే.. 1.2 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ ప్లస్ అలాగే 1.2 టర్బో- పెట్రోల్ ఆటోమేటిక్ ప్లస్ వేరియంట్లపై రూ.28,000 వరకు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది.
ఇక ఎంట్రీ లెవెల్ 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ You వేరియంట్ ధర రూ.26,000 వరకు పెరిగింది. దీంట్లో 1.2 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ మ్యాక్స్, 1.2 టర్బో పెట్రోల్ మ్యాన్యూవల్ మ్యాక్స్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. 1.2 టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ మ్యాక్స్, 1.2 టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ మ్యాక్స్ డ్యూయల్ టోన్ వేరియంట్స్ ధరలు రూ.17,000 వరకు పెరిగాయి.

అయితే 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ ప్లస్ ధరలు మాత్రం పెరగలేదు. దీని ధర రూ.9.99 లక్షలుగానే ఉంది. ఈ సవరించిన ధరల ఆధారంగా చూస్తే.. బసాల్ట్ ప్రస్తుతం రూ.8.25 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య లభిస్తోంది. ధరలను పెంచడం తప్ప తమ ఎస్‌యూవీలకు సంబంధించి మరే ఇతర అప్‌గ్రేడ్స్ చేయలేదు.
బసాల్ట్ కారు 4,252 మి.మీ.ల పొడవుతో, 1,765 మి.మీ.ల వెడల్పుతో, 1,593 మి.మీ.ల ఎత్తుతో ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,651 మి.మీలలో ఉంటుంది. సిట్రోయిన్ కూప్ ఎస్‌యూవీ 470 లీటర్ల బూట్ స్పేస్‌తో, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

ఇందులో ఒకటి 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెండ్ పెట్రోల్ కాగా, మరొకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్‌తో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్లో 1.2 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్ 80bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సెమీ లెథెరెట్ సీట్ల వంటి ఫీచర్లతో సిట్రోయెన్ బసాల్ట్ అందుబాటులో ఉంది.
ఇందులో త్రీ- స్పోక్ స్టీరింగ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఫ్లూర్- మౌంటెడ్ రియర్ ఏసీ వెంట్స్, కాంటూర్డ్ హెడ్ రెస్ట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs వంటి ఫీచర్లు కలవు. ఈ సెగ్మెంట్‌లో దీనికి పోటీనిచ్చే ఎస్‌యూవీగా టాటా కర్వ్ ఉంది.


Click it and Unblock the Notifications








