కేవలం రూ.11,000కే ఈ కారును బుక్ చేసుకోవచ్చు.. సిట్రోయెన్ అందిస్తున్న బంపర్ ఆఫర్ అస్సలు మిస్సవద్దు

భారత మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి సిట్రోయెన్ కంపెనీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తమ సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ (Citroen Basalt X) కారు టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది. కేవలం రూ.11,000 చెల్లించి ఈ సరికొత్త ఎస్‌యూవీ కూపే కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు విశేషాలు, దాని డిజైన్, ఇంజిన్ వివరాలు, మార్కెట్‌లో దాని స్థానం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ అనేది ఒక కూపే స్టైల్ కారు. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న బసాల్ట్ కారుకు కొత్త వెర్షన్. ఈ కారు టీజర్‌లో చూపిన దాని ప్రకారం, దీని ఇంటీరియర్ డ్యూయల్ టోన్ కలర్‌లో ఉండనుంది. ఈ డిజైన్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. సిట్రోయెన్ సంస్థ తమ కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి సిట్రోయెన్ 2.0 అనే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగానే తమ కార్లను అప్‌డేట్ చేస్తోంది. బసాల్ట్ ఎక్స్ కూడా ఆ వ్యూహంలో భాగమే.

Citroen Basalt X SUV Coupe Bookings Open for Just Rs 11 000

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఒకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మరొకటి 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్లు కారుకు 108 బీహెచ్‌పీ పవర్‌ను, 190 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి. ఈ కారులో అధునాతన సాంకేతికతతో కూడిన ఫీచర్లు, సౌకర్యాలు అదనంగా జోడించబడ్డాయి.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బసాల్ట్ కారు కంటే ఇది మరింత మెరుగైన సౌకర్యాలు, లగ్జరీ అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు వేరియంట్లు, వాటికి సంబంధించిన పూర్తి ఫీచర్స్ వివరాలు లాంచ్ సమయంలో వెల్లడించనున్నారు.

Citroen Basalt X SUV Coupe Bookings Open for Just Rs 11 000

సిట్రోయెన్ సంస్థ ఇప్పటికే తమ బసాల్ట్ కారుతో గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టులో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. బసాల్ట్ ఎక్స్ కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించినందున, ఇది కూడా అదే స్థాయిలో సేఫ్టీ రేటింగ్ పొందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో కూపే స్టైల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. యువతరం ఇలాంటి ప్రత్యేకమైన డిజైన్ ఉన్న కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సిట్రోయెన్ ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఈ కారును అప్‌డేట్ చేసి విడుదల చేస్తోంది. అయితే, సిట్రోయెన్ అమ్మకాలు తక్కువగా ఉండటానికి షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు తగినంతగా లేకపోవడం ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త కారు ద్వారా ఆ అమ్మకాలు పెరుగుతాయేమో చూడాలి.

Citroen Basalt X SUV Coupe Bookings Open for Just Rs 11 000

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 23, 2025, 16:54 [IST]
English summary
Citroen basalt x suv coupe bookings open for just rs 11 000
Read more on: #citroen #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+