పెట్రోల్ ఖర్చులు తగ్గాలా? మంచి మైలేజ్ ఇచ్చే కొత్త కారు వచ్చేసింది! మీ డబ్బులు ఆదా చేసుకోవచ్చు

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో వినియోగదారుల దృష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్‌జీ (CNG)లపై కూడా పడింది. ఇది కేవలం అవసరం కాదు, ఇప్పుడు అది ఒక శక్తిమంతమైన ట్రెండ్‌గా మారింది. వినియోగదారుల్లో పెరిగిన ఈ డిమాండ్‌ను గమనించిన కార్ల తయారీ సంస్థలు కూడా క్రమంగా సీఎన‌్‌జీ ఆధారిత వాహనాలను విడుదల చేయడానికి అడుగులు వేస్తున్నారు. మారుతీ సుజుకీ, టాటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ బ్రాండ్లు ఇప్పటికే ఫ్యాక్టరీలోనే అమర్చిన CNG కిట్‌లతో కార్లను అందించడం ప్రారంభించాయి. ఇవి కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి ఆదరణ మేరకు ఈ విభాగంలో సత్తా చాటడానికి ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ కూడా ఈ దిశగా అడుగులు వేసింది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న CNG మౌలిక సదుపాయాల విస్తరణ, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ కారణంగా సిట్రోయెన్‌ ప్రత్యేకంగా డీలర్ అమర్చిన CNG కిట్ ఎంపికను అందిస్తోంది. తమ ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన C3 హ్యాచ్‌బ్యాక్‌ను CNG వేరియంట్ రూపంలో పరిచయం చేసింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇది ఎంతో మంది కొనుగోలుదారులకు కొత్త ఆప్షన్‌గా మారుతోంది. వినియోగదారుల అభిరుచులు మారుతున్న సమయంలో ఈ కారు మరో ఎంపిక అవుతుంది.

Citroen C3 Retrofitted Cng

సిట్రోయెన్ C3 లో CNG కిట్‌ను అమర్చించుకోవాలంటే అదనంగా దాదాపు రూ. 93,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితే, కొత్త సిట్రోయెన్ C3 CNG వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.16 లక్షలు అవుతుంది. అంటే, ఇది సిట్రోయెన్ కస్టమర్లకు అందుబాటులో ఉండే ధర వద్ద మంచి మైలేజీతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధన కారుగా నిలుస్తోంది. దీని ఇంజిన్ శక్తివంతమైన మంచి పనితీరును కనబరుస్తుంది.

CNG వేరియంట్‌లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. సిట్రోయెన్ ఇండియా తమ డీలర్‌షిప్‌ల‌తో C3 హ్యాచ్‌బ్యాక్‌లో CNG కిట్‌లను సరఫరా చేయడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కారులో అమర్చిన ఇంజిన్ కిట్ 82 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది, అందువల్ల డ్రైవింగ్ అనుభవం సాఫీగా ఉంటుంది.

Citroen C3 Cng Car

ఇక మైలేజ్ విషయానికి వస్తే ARAI ప్రకారం, ఈ వేరియంట్ ప్రతి కిలో CNGకి దాదాపు 28.1 కి.మీ మైలేజీ ఇస్తుందని ధృవీకరించింది. ఇది రోజువారీ ప్రయాణాల్లో ఎక్కువ కాలం సేవలందించేలా చేస్తుంది. అంతేకాదు, C3 అనేది ఒక ఫంక్షనల్ హ్యాచ్‌బ్యాక్ కాబట్టి 5 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించగలిగే విధంగా డిజైన్ చేయబడింది. కొత్త CNG వేరియంట్‌లో టెక్నాలజీ పరంగా కూడా చాలా మార్పులు కనిపిస్తాయి.

ప్రత్యేకించి, కారు మరింత స్థిరంగా నడవడానికి వెనుక సస్పెన్షన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. CNG కిట్ కారణంగా పెరిగిన బరువును సాఫీగా నెమ్మదిగా ఉండేందుకు ఈ సస్పెన్షన్ ట్యూనింగ్ మార్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, సిట్రోయెన్ ఇండియా ఈ మార్పుల్లో కేవలం తన సామర్థ్యంపైనే ఆధారపడకుండా, CNG పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉన్న లోవాటో (Lovato) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Citroen C3 Retrofitted Cng Launched In India

ఈ భాగస్వామ్యం వల్ల, సిట్రోయెన్ కస్టమర్లు సేఫ్టీ, పనితీరు వంటి అంశాల్లో ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేకుండా, సులభంగా తమ వాహనాన్ని CNG వేరియంట్‌గా మార్చుకునే అవకాశాన్ని పొందుతున్నారు. కిట్‌లో 55 లీటర్ల సామర్థ్యం కలిగిన సిలిండర్ ఉంటుంది. పూర్తి ట్యాంక్ CNGతో ఇది 170 నుండి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది లైవ్, ఫీల్, ఫీల్(0), షైన్ అనే ట్రిమ్‌లలో లభిస్తుంది.

Take a Poll

More from DriveSpark

Article Published On: Friday, May 16, 2025, 10:53 [IST]
English summary
Citroen c3 retrofitted cng launched in india check price and mileage details
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+