17 కి.మీ మైలేజ్ ఇచ్చే పెద్ద కారు! కానీ ఎవరూ దీన్ని కొనడానికి ముందుకు రావట్లేదు! ఎందుకో మీకు తెలుసా?

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ ఇండియా గత కొంత కాలంగా అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. తాజాగా మార్చి నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన సేల్స్ వివరాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కార్ల విక్రయాలు మార్చి 2025లో గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తుంది. ఫిబ్రవరిలో కార్ల అమ్మకాలతో పోలిస్తే మార్చిలో సేల్స్ పెరిగాయి. ఇది కంపెనీకి ఒక సానుకూల సంకేతం. ముఖ్యంగా C3, eC3, ఎయిర్‌క్రాస్, బసాల్ట్ కూపే SUV మోడళ్ల అమ్మకాల వృద్ధి ద్వారా మొత్తం సిట్రోయెన్ ఇండియా అమ్మకాలు భారీగా పెరిగాయి. బసాల్ట్ మోడల్ గత ఐదు నెలల్లో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. సిట్రోయెన్ ఇండియా ఫిబ్రవరిలో 268 కార్లను విక్రయించింది, ఇది మార్చిలో 407 కార్లకు పెరగడం విశేషం.

ఇది కేవలం గణాంకాల పెరుగుదల కాదు, భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ బ్రాండ్ పట్ల వినియోగదారుల విశ్వాసం పెరుగుతోందనే సంకేతాన్ని చూపెడుతుంది. మొత్తం అమ్మకాల్లో సిట్రోయెన్ మంచి పురోగతిని నమోదు చేసినా, ఒక మోడల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అదే C5 ఎయిర్‌క్రాస్. లగ్జరీ SUV సెగ్మెంట్‌లో ఉన్న ఇది, మార్చి 2025లో ఒక్క కారు కూడా అమ్మలేకపోయింది. ఇది ఇలా ఒక్కసారిగా కాకుండా చాలా కాలంగా అమ్మకాలను సాధించడం లేదు.

Citroen C5 Aircross Car Sales Report In March 2025

వాస్తవానికి, గత ఐదు నెలల్లో అనగా, నవంబర్ 2024 నుండి మార్చి 2025 మధ్య C5 ఎయిర్‌క్రాస్ కేవలం రెండు యూనిట్లే అమ్మకాలు జరిగాయి. ఇందులో మూడు నెలలపాటు పూర్తిగా ఎవరు కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఈ గణాంకాలు చూస్తే, C5 ఎయిర్‌క్రాస్ ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోంది. కస్టమర్ అభిరుచులు వేగంగా మారుతున్న ఈ కాలంలో, ఈ మోడల్‌ను చాలా మంది పట్టించుకోవడం లేదు.

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ గురించి చూసినట్లయితే, ఒక శక్తివంతమైన లగ్జరీ SUV. ఇందులో 1997cc కెపాసిటఅ కలిగిన DW10FC 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 177 PS పవర్, అలాగే 400 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయడం ద్వారా, డ్రైవింగ్ అనుభవాన్ని సాఫీగా, శక్తివంతంగా అందిస్తుంది. C5 ఎయిర్‌క్రాస్ లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజ్ అందించగలదు.

Citroen C5 Aircross Car Sales Report

ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, అనుకూలీకరించదగిన TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు దీన్ని ఒక ప్రీమియం SUV గా మార్చుతున్నాయి. ఇటువంటి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో ఉన్నప్పటికీ, C5 ఎయిర్‌క్రాస్ మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకునే విషయంలో స్పష్టంగా వెనుకబడుతోందని తెలుస్తుంది.

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ లోపలి డిజైన్, విలాసవంతంగా ఉంటుంది. క్లాడియా లెదర్, లెదర్-ఎఫెక్ట్ ఫాబ్రిక్ మెత్తటి, నాణ్యమైన సీటింగ్‌తో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. కంఫర్ట్ విషయంలో, ఇది సిట్రోయెన్ అడ్వాన్స్‌డ్ కంఫర్ట్ ఫిలాసఫీ‌తో రూపొందించబడింది, ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్ సస్పెన్షన్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోడ్డులో ఉండే గుంతలపై కూడా ప్రయాణాన్ని సాఫీగా మారుస్తుంది.

Citroen C5 Aircross

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 7:30 [IST]
English summary
Citroen c5 aircross car sales report in march 2025 more details inside
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+