ఈ కారును 60 మంది మాత్రమే కొన్నారు.. అందరికి నచ్చే ఫీచర్లు.. తక్కువ ధర.. కానీ డిమాండ్ తగ్గింది
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ఆటోమోబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) ఇండియాలో కూడా తన కార్లను విక్రయిస్తుంది. దేశీయ వాహన తయారీదారులకు పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను లాంచ్ చేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీలను కూడా అమ్మకానికి తీసుకొస్తుంది. కంపెనీ దేశంలో eC3 EV అనే ఈవీ కారును విక్రయిస్తుంది. తాజాగా సిట్రోయెన్ ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. డేటా ప్రకారం, ఈ కారును జనాలు ఎక్కువగా ఆదరించడం లేదని తెలుస్తుంది. జనవరి 2025లో, eC3 EVని కేవలం 60 మంది మాత్రమే కొనుగోలు చేశారు. అధునాతన ఫీచర్స్, అదిరిపోయే డిజైన్‌ను కలిగిన ఈ కారు ఇంత తక్కువగా సేల్స్ నమోదు చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 67.39 శాతం తగ్గడం గమనార్హం.
గత ఏడాది 2024 జనవరి నెలలో మొత్తం అమ్మకాలు 184 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే అమ్మకాలు భారీగా తగ్గడంపై కంపెనీ సైతం ఆలోచనలో పడింది. సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారు వినియోగదారులకు మూడు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులొ ఉంది. ఇది 29.2kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. దీనిలో అమర్చిన మోటార్ 57 bhp పవర్, 143 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే ARAI-సర్టిఫైడ్ ప్రకారం, 320 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి అనువైన మోడల్. అయితే దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి దాదాపు 10 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. కారును రోజువారి అవసరాల కోసం వాడేవారు రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ తీయాల్సి ఉంటుంది.
బ్యాటరీని ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం వంటి కారణాల వల్ల కూడా ఈ కారును జనాలు తక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కార్స్ చాలా ఉన్నాయి. పైగా రేంజ్ కూడా దాదాపు 500 కి.మీల కంటే ఎక్కువగానే అందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిట్రోయెన్ eC3 తన మనుగడను సాధించలేకపోతుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీల ఈవీ కార్లు తమ హవాను చూపిస్తున్నాయి.

భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ eC3 ప్రారంభ ధర రూ. 12.76 లక్షల నుండి మొదలై టాప్ వేరియంట్ ధర రూ.13.41 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. కారు ధర కూడా అందుబాటులోనే ఉన్నప్పటికి అమ్మకాలు మాత్రం పెరగడం లేదు. సిట్రోయెన్ eC3 ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే పలు కీలక ఆప్షన్స్ దీనిలో అందించారు.
కారు లోపల సిట్రోయెన్ eC3 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ AC, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం వంటివి ఈ కారులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








