ఈ కారును కేవలం ఒక్కరే కొన్నారు.. మహేంద్ర సింగ్ ధోని ప్రమోషన్ చేసిన నమ్మని జనాలు? సిట్రోయెన్‌కు టఫ్ టైమ్

ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (citroen) ఇండియాలో చాలా కాలంగా తన వాహనాలను విక్రయిస్తుంది. గతంలో మెరుగైన అమ్మకాలను సాధించిన కంపెనీ ఇటీవల కాలంలో తీవ్రంగా ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. గత కొద్ది నెలలుగా సిట్రోయెన్ కార్ల సేల్స్ భారీగా తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో ఇతర తయారీదారులు తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్న తరుణంలో ఈ కంపెనీ సేల్స్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కార్ల తయారీదారులు ఫిబ్రవరి నెల ముగిసిన నేపథ్యంలో తమ మొత్తం సేల్స్ డేటాను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ కంపెనీ సైతం తన వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం, ఫిబ్రవరి 2025లో కంపెనీ అమ్మకాల ఏకంగా ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇది దాని గత సేల్స్‌తో పోల్చినట్లయితే ఇది భారీ క్షీణతగా పేర్కొనవచ్చు.

ఫిబ్రవరిలో సిట్రోయెన్ దేశవ్యాప్తంగా 268 కార్లను మాత్రమే విక్రయించడం గమనార్హం. భారతీయ వాహన మార్కెట్లో ప్రస్తుతం పోటీ ఎక్కువ అయింది. ఆటోమొబైల్ తయారీదారులు పోటా పోటీగా వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, వీలైనంత వేగంగా ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో సిట్రోయెన్ అమ్మకాలు తగ్గిపోవడం అంటే కంపెనీకి ఇది ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. పోటీతత్వ మార్కెట్లో ఇది గట్టి సవాళ్లు ఎదుర్కొంటుంది.

Citroen India February 2025 Sales

సిట్రోయెన్ ఇండియాలో పలు మోడళ్లను విక్రయిస్తుంది. వాటిలో C3, బసాల్ట్ కూపే, ఎయిర్‌క్రాస్, eC3,C5 ఎయిర్‌క్రాస్ వంటివి ఉన్నాయి. అన్ని మోడళ్లు అమ్మకాలు కలిపిన అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా C5 ఎయిర్‌క్రాస్‌(Aircross)ను అయితే ఫిబ్రవరి నెలలో ఏకంగా ఒక కస్టమర్ మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ఇది సిట్రోయెన్ కార్లలో దేశీయ ప్రజల్లో ఆదరణ లేని మోడల్‌గా నిలిచింది. జనవరిలో కూడా ఇదే విధంగా సేల్స్‌ను నమోదు చేసింది.

ఈ ఏడాది ప్రారంభంలో C5 ఎయిర్‌క్రాస్‌ కార్లు ఒక్కటి కూడా అమ్ముడుకాలేదు. గత కొంత కాలంగా ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. నెలల తరబడి ఒక్క కారు కూడా అమ్ముడుపోకుండా C5 ఎయిర్‌క్రాస్‌ ఇబ్బంది పడింది. అయితే ఫిబ్రవరిలో దీనికి విరుద్ధంగా, C3 110 కార్లు మెరుగైన విక్రయాలను నమోదు చేసి బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

Citroen India

కానీ గత కొన్ని నెలలుగా అమ్మకాలను పరిశీలించినట్లయితే ఈ కారుకు కూడా ఆదరణ తగ్గుతుంది. గత ఆరు నెలల అమ్మకాల డేటాను చూస్తే, C3 మోడల్ తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటుంది. మార్కెట్లో పోటీ ఎక్కువ కారణంగా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. 2024 సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ మోడల్ సేల్స్ 300 యూనిట్లు కాగా, ఇది ఫిబ్రవరి 2025 నాటికి 110 కార్లకు తగ్గిపోవడం గమనార్హం.

ఈ రెండు కార్లు మాత్రమే కాకుండా బసాల్ట్ కూపే కారు అమ్మకాలు వరుసగా క్షీణిస్తూ వస్తున్నాయి. సెప్టెంబర్ 2024లో బసాల్ట్ కూపే మొత్తం 341 కార్లు అమ్ముడుపోగా, ఆ తర్వాత నెలా నెలా తగ్గుతూ వస్తూ ఫిబ్రవరి నెలలో మొత్తంగా కేవలం 37 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అలాగే, ఎయిర్‌క్రాస్, eC3 మోడళ్ల అమ్మకాలు కూడా ఇదే కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

Citroen India February 2025 Sales Performance Report

సిట్రోయెన్ కార్ల మొత్తం అమ్మకాలు సెప్టెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం సేల్స్ 711 కార్ల నుండి 268 కార్లకు తగ్గిపోయాయి. మహేంద్రసింగ్ ధోని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్ల సేల్స్ పెంచడానికి యాడ్స్ చేసినప్పటికీ కూడా భారతీయ కస్టమర్ల నుంచి ఆశించిన మేరకు ఆదరణ లేక మొత్తం అమ్మకాలు తగ్గిపోయాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 13:26 [IST]
English summary
Citroen india february 2025 sales decline compared to previous months
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+