రూ.1.75 లక్షల భారీ తగ్గింపు! డ్రీమ్ కార్‌ను సొంతం చేసుకునే అదృష్టవంతులు మీరేనా? ఇదే గోల్డెన్ ఛాన్స్!
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (citroen) భారతదేశంలో మంచి మార్కెట్ కలిగి ఉంది. సేల్స్ పరంగా గత కొన్నేళ్లుగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. 2024లో విజయవంతంగా తన కార్లను విక్రయించిన కంపెనీ 2025లో అంతకంటే ఎక్కువ మంది కస్టమర్లకు చేరువకావడానికి పండుగల సమయంలో తీసుకొచ్చినట్లు తన కార్లపై మార్చి 2025లో భారీ తగ్గింపులు అందిస్తుంది. సాధారణంగా వాహన తయారీ కంపెనీలు నెలా నెలా ప్రత్యేక తగ్గింపులు ఇస్తుంటాయి. ఇప్పటికే ఇతర సంస్థలు తమ మోడళ్లపై మార్చి ఆఫర్స్ ప్రకటించగా, ఇదే బాటలో సిట్రోయెన్ సైతం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. HT ఆటోలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఎంపిక చేసిన మోడళ్లపై ఈ నెలలో భారీ తగ్గింపు ఇస్తుంది.
కొత్తగా కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారికి ఇదే కరెక్ట్ సమయం. కంపెనీ మార్చిలో దాదాపు రూ. 1.75 లక్షల వరకు ప్రయోజనాలు పొందే అవకాశాన్ని అందిస్తుంది. విదేశీ కంపెనీ కస్టమర్లను తన షోరూమ్‌లక రప్పించడానికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియాలో ఐదు కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా దేశంలో బాగా ఫేమస్ అయినవే.

సిట్రోయెన్ ప్రకటించిన ఈ భారీ తగ్గింపు నెలవారీది, కాబట్టి ఇది లిమిటెడ్ కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ తగ్గింపు ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి సిట్రోయెన్ కార్లను తక్కువ ధరలో కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. మళ్లీ ఇలాంటి ఆఫర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే త్వరపడటం బెస్ట్.
కస్టమర్లకు ముఖ్య గమనిక ఏమిటంటే కంపెనీ అందిస్తున్న తగ్గింపు ప్రయోజనాలు దేశంలో నగరాలు, ప్రాంతాలను బట్టి మారుతాయి. కాబట్టి సిట్రోయెన్ కార్లను కొనుగోలు చేసే ముందు మీ దగ్గరలోని షోరూమ్‌లలో సిబ్బందిని సంప్రదించాలని మా డ్రైవ్‌స్పార్క్ సూచిస్తుంది. తగ్గింపు గురించిన పూర్తి వివరాలను షోరూమ్‌లో ముందుగా తెలుసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం మార్చి నెలలో ఏ ఏ మోడళ్లపై ఏ మేరకు తగ్గింపు ప్రయోజనాలను కంపెనీ అందిస్తుందో కింది కథనంలో తెలుసుకోండి..

Citroen C3: సిట్రోయెన్ C3 లైవ్, ఫీల్, షైన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో 81 bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో 108 bhp పవర్, 205 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మార్చి నెలలో కారుపై రూ. 1 లక్ష ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ టైంలో సిట్రోయెన్ C3 కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు భారీ మొత్తంలో ఆదా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో మెరుగైన అమ్మకాలను సాధిస్తుంది. దీని ధర రూ.6.16 లక్షల నుంచి రూ.10.15 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది.

Citroen eC3: సిట్రోయెన్ eC3 ఇది ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. 2023 మోడళ్లపై రూ. 80,000 వరకు తగ్గింపు ఉంది. ఈ కారు ఫీల్, షైన్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 12.76 లక్షలు. అదే టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి రూ. 13.41 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది ఫ్రంట్ ఆక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చింది. 56 bhp పవర్, 143 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 29.2 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 320 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది ఏడు డ్యూయల్ టోన్, నాలుగు మోనోటోన్ కలర్స్‌లలో లభిస్తుంది.

Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ ఒక ఎస్‌యూవీ కూపే. బేస్ మోడళ్లపై కంపెనీ రూ. 1.70 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది. దీని ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 8.25 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.14 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 1.2-లీటర్ NA పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది.
ఇది భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ని సాధించింది. దీనిలో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), అన్ని సీట్లకు 3 పాయింట్ల సీట్ బెల్ట్స్, పార్కింగ్ సెన్సార్లతో రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఐసోఫిక్స్ యాంకరేజ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.
Citroen Aircross: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్‌పై కంపెనీ రూ. 1.75 లక్షల తగ్గింపు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. ఇది దేశంలో ఒక ప్రసిద్ధ ఎస్‌యూవీ. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. దీని ప్రారంభ ధర వచ్చేసి 8.49 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.14.55 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధరలు.
ఈ కారులో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS,టైర్ ప్రెజర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి. ఇంకా డజన్ల కొద్ది అధునాత ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు.


Click it and Unblock the Notifications








