మనదేశంలో రాబోయే రోజుల్లో ఈ కార్ల కంపెనీదే హవా.. ఈసారి మూడు పవర్ ఫుల్ కార్లు వచ్చేస్తున్నాయ్
సిట్రోయెన్ లవర్స్‌కు పండగే! ఒకేసారి మూడు కొత్త కార్లను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఈ కొత్త సిరీస్‌లో మొదటి కారును ఎవరో కాదు.. మనందరి అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని డెలివరీ తీసుకోవడం విశేషం. ఆ వివరాలేంటో చూద్దాం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన పాపులర్ మోడల్స్ అయిన సిట్రోయెన్ C3, ఎయిర్‌క్రాస్, బసాల్ట్ SUV కూపే కార్ల టాప్ వేరియంట్‌లను డార్క్ ఎడిషన్లలో విడుదల చేసింది. ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ డార్క్ ఎడిషన్ కార్ల ధరలు సాధారణ వేరియంట్ల కంటే రూ. 19,500 అదనంగా ఉంటాయి.

సిట్రోయెన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఈ కొత్త డార్క్ ఎడిషన్‌లను ఆవిష్కరించారు. అంతేకాకుండా, బసాల్ట్ డార్క్ ఎడిషన్‌లోని మొదటి కారును ఆయనే డెలివరీ తీసుకోవడం విశేషం. పెర్లా నెరా బ్లాక్ రంగులో వస్తున్న ఈ డార్క్ ఎడిషన్ కార్లు స్పోర్టీ లుక్ కలిగి ఉన్నాయి.
కారు లోగో, ముందు గ్రిల్, బాడీ సైడ్ మోల్డింగ్‌లపై డార్క్ క్రోమ్ అంశాలు, బంపర్‌లు, డోర్ హ్యాండిల్‌లపై గ్లాస్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఈ కార్లకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తున్నాయి. ఇంటీరియర్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్ ఒక ప్రత్యేకమైన ప్రీమియం అనుభూతినిస్తుంది. క్యాబిన్‌ను మెట్రోపాలిటన్ బ్లాక్ లెథెరెట్ సీట్లు, కస్టమ్ లెథెరెట్ ప్యానెల్‌తో డిజైన్ చేశారు.

కార్బన్ బ్లాక్ ఇంటీరియర్‌ను లావా రెడ్ డీటైలింగ్, ముఖ్యమైన టచ్‌పాయింట్‌ల వద్ద హై-గ్లోస్ బ్లాక్ రంగుతో మరింత మెరుగుపరిచారు. ఈ డార్క్ ఎడిషన్ కార్లలో కస్టమ్ సీట్ కవర్లు, డార్క్ క్రోమ్ మోల్డింగ్‌లు, గ్రిల్ ఎంపెల్లైజర్ వంటి ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఇవి కారు లోపల మరింత కస్టమైజ్డ్, ఖరీదైన అనుభూతినిస్తాయి.
ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు కేవలం టాప్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 10, 2025 నుండి సిట్రోయెన్ దేశవ్యాప్త డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ C3 ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 8,38,300 నుండి ప్రారంభమవుతుంది.

సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ ఎయిర్‌క్రాస్ SUV ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 13,13,300 నుండి ప్రారంభమవుతుంది. ఇక డార్క్ ఎడిషన్ బసాల్ట్ ధర రూ. 12,80,000. ఈ కార్ల గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని డీలర్‌లను సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ కార్లు వినియోగదారులకు ప్రత్యేకమైన, ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి.
ఆకర్షణీయమైన డిజైన్, హై లెవల్ ఇంటీరియర్‌తో ఈ కార్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. "డార్క్ ఎడిషన్ కొత్త డిజైన్‌తో భారతీయ వినియోగదారుల అభిరుచులకు తగిన విభిన్న వాహనాలను అందించాలనే మా నిబద్ధతను తెలియజేస్తుంది" అని సిట్రోయెన్ ఇండియా డైరెక్టర్ శిశిర్ మిశ్రా అన్నారు.

"అద్భుతమైన ఆల్-బ్లాక్ అందం, పరిమిత లభ్యత, ప్రీమియం అప్‌గ్రేడ్‌లతో, ఈ సిరీస్‌లోని ప్రతి సిట్రోయెన్‌ను స్పెషల్ గా మేము అందిస్తున్నాము. డార్క్ ఎడిషన్‌ను ఆవిష్కరిస్తున్న సందర్భంలో సిట్రోయెన్ యజమానుల క్లబ్‌లో అధికారికంగా చేరిన మొదటి కస్టమర్‌గా ఎంఎస్ ధోనీని స్వాగతిస్తున్నాం." అని ఆయన తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








