బడ్జెట్‌లో వచ్చే ఈ కారు కొంటే మీ పక్కింటివాళ్లు అసూయ పడతారు.. కొత్త కారు లుక్ బిలియనియర్ స్టైల్!
సిట్రోయెన్ ఇండియా (Citroen India) పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావడమే లక్ష్యంగా కంపెనీ తన ప్రాచుర్యం పొందిన కూపే SUV మోడల్‌కు కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. అదే కొత్తగా ఆవిష్కరించిన బసాల్ట్ ఎక్స్ (basalt x). ఈ కొత్త వేరియంట్‌లో X అక్షరం జోడించడం ద్వారా దాని ప్రత్యేకతను హైలైట్ చేసింది సిట్రోయెన్. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, టాప్-స్పెక్ మాక్స్ ట్రిమ్ స్థాయి కంటే మరింత అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది. అంటే, ఇప్పటికే ఉన్న బసాల్ట్ SUV సిరీస్‌లో కస్టమర్లకు అదనపు ఫీచర్లు, కొత్త లుక్, మెరుగైన ఫినిషింగ్ అందించేలా బసాల్ట్ Xను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ధర విషయంలో కూడా సిట్రోయెన్ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుంది. రూ. 9.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతున్న ఈ కొత్త మోడల్, కూపే SUV కోసం ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. కేవలం రూ. 11,000 టోకెన్ అమౌంట్ చెల్లించడం ద్వారా బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు. దీంతో పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి సిట్రోయెన్ బసాల్ట్ X ఒక ప్రత్యేక ఆఫర్‌గా మారనుంది.

సిట్రోయెన్ ఇండియా తనCitroën 2.0 - Shift Into the New వ్యూహంలో భాగంగా కొత్త బసాల్ట్ Xను పరిచయం చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ మోడల్ పూర్తిగా కొత్త ఇంటీరియర్స్‌తో వస్తోంది. అంతేకాదు, ఇందులో భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేస్తున్న CARA అనే ఇంటెలిజెంట్ ఇన్-కార్ కంపానియన్‌ను కూడా అందిస్తోంది. ఈ కాన్సెప్ట్ పూర్తిగా భారత్‌లోనే ఇంజనీరింగ్ చేయబడి, భారతీయ వినియోగదారులకు అనుగుణంగా రూపొందించబడింది.
అయితే దీన్ని గ్లోబల్ మార్కెట్లలోకి కూడా తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. CARA భారతదేశంలోనే మొదటి ఇంటెలిజెంట్, మల్టీలింగ్వల్, ఇన్‌ట్యూయిటివ్, కాంటెక్స్ట్ అవేర్ ఇన్-కార్ కంపానియన్. ఇది పూర్తిగా సిట్రోయెన్ వాహనాలతో సమగ్రమైన అనుసంధానం కలిగేలా డిజైన్ చేయబడింది. ఇది కేవలం వాయిస్ అసిస్టెంట్ మాత్రమే కాదు, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.

ఉదాహరణకు, డ్రైవర్, నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు, దానిని కేవలం వాక్యంగా కాకుండా ఒక పరిస్థితిగా అర్థం చేసుకుని, దగ్గరలోని విశ్రాంతి కేంద్రాలను సూచిస్తుంది. కారు టైర్ ప్రెజర్, ఇంధనం వంటి అంశాలను పర్యవేక్షిస్తూ, డ్రైవర్‌కి సులభంగా అర్థమయ్యే రీతిలో సమాచారం ఇస్తుంది. AC ప్రీ-కండిషనింగ్, డోర్ లాక్స్ వంటి ఫంక్షన్లను రిమోట్ ద్వారా నియంత్రించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
మ్యూజిక్ స్ట్రీమింగ్, కాల్స్, రిమైండర్స్, స్మార్ట్‌వాచ్ నోటిఫికేషన్లు, నావిగేషన్ మ్యాప్స్‌తో సమన్వయం, కేవలం వినోదం లేదా సౌకర్యం కోసం మాత్రమే కాదు, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ను కూడా అందిస్తుంది. విమాన ప్రయాణాల స్థితి, స్టాక్ అప్‌డేట్స్, క్రికెట్ స్కోర్లు లేదా వాతావరణ హెచ్చరికలు, ఇవన్నీ సంభాషణలో భాగంగా పొందవచ్చు. ఇది వాయిస్-ట్రిగ్గర్డ్ SOS మోడ్, ప్రమాదం సమయంలో ఆటోమేటిక్ క్రాష్ రెస్పాన్స్, అత్యవసర సహాయం వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

ముఖ్యంగా, CARA 52 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో మాట్లాడగలదు. కొత్త డిజిటల్ అసిస్టెంట్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి జోడించబడ్డాయి. ఇది 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 110 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిని కస్టమర్లు రెండు రకాల ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పొందవచ్చు.
అంతేకాదు, ఎంట్రీ-లెవల్ బసాల్ట్ X వేరియంట్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో కూడా అదే 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది 82 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, సిట్రోయెన్ ఈ కొత్త వేరియంట్‌తో పర్ఫార్మెన్స్, బడ్జెట్‌కి తగ్గ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్‌ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications