వావ్ అనిపించేలా స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి సరికొత్త మోడల్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇతర వివరాలు ఇవే!

సిట్రోయెన్ ఇండియా ఇటీవల తన ప్రసిద్ధ మోడల్ C3 హ్యాచ్‌బ్యాక్ కోసం ఒక ప్రత్యేకమైన స్పోర్ట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం మరో వేరియంట్ మాత్రమే కాక, స్పోర్టీ యాటిట్యూడ్‌ను సరికొత్త స్టైల్‌తో మిళితం చేసిన స్పెషల్ ఆఫరింగ్. ఈ ఎడిషన్ డిజైన్, ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ శైలితో సిట్రోయెన్ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ స్పోర్ట్ ఎడిషన్‌కి ప్రత్యేకతను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినది కొత్తగా పరిచయమైన గార్నెట్ రెడ్ బాడీ షేడ్. ఇది సాధారణ రంగులతో పోల్చితే చాలా స్పెషల్ లుక్‌ను ఇస్తుంది. ఎక్స్‌టీరియర్ చూస్తే, డోర్లు, బాడీ ప్యానెల్స్‌పై "స్పోర్ట్" డెకల్స్‌ను ఎంచుకున్న డిజైన్ టీం కారుకు ఒక కొత్త స్పోర్టీ టచ్‌ను తీసుకొచ్చింది. కేవలం ఎక్స్‌టీరియర్ మాత్రమే కాదు, లోపలికి అడుగుపెట్టగానే స్పోర్ట్ ఎడిషన్‌ ప్రత్యేకత మరింత స్పష్టంగా తెలుస్తుంది.

ఇంటీరియర్‌లో బ్రష్డ్ మెటల్ పెడల్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్ వంటివి కారులో ప్రీమియం ఫీల్‌ను కలిగిస్తాయి. స్పోర్ట్స్ థీమ్‌కు తగ్గట్టుగా రూపొందించిన సీట్ కవర్లు, సీట్‌బెల్ట్ కుషన్లు, మ్యాచింగ్ కార్పెట్ మ్యాట్స్ కారులో ప్రయాణాన్ని మరింత స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మార్చుతాయి. ఇన్ని అప్‌డేట్‌లతోతోపాటు, ఈ స్పోర్ట్ ఎడిషన్ C3 శ్రేణిలో అత్యధిక శక్తిని విడుదల చేసే మోడల్‌గా నిలిచింది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ విషయంలో ఇది మిగతా వేరియంట్‌లను మించిపోయేలా ఉంది.

C3 Sport Edition Launched

ఇది మూడు ట్రిమ్‌లలో వినియోగదారులకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. బేస్ లైవ్ వేరియంట్‌కు రూ. 6.44 లక్షలు, ఫీల్‌కు రూ. 7.73 లక్షలు, టాప్-స్పెక్ షైన్‌కు రూ. 8.37 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. సిట్రోయెన్ C3 లిమిటెడ్ స్పోర్ట్ ఎడిషన్ ప్రస్తుతం భారతదేశంలోని అన్ని సిట్రోయెన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ ఎడిషన్‌ల కంటే రూ.21,000 అదనపు ధరకు లభిస్తుంది.

అలాగే, డాష్‌క్యామ్, వైర్‌లెస్ చార్జర్‌లతో కూడిన టెక్ కిట్ ను రూ.15,000 చెల్లించి పొందవచ్చు. సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్‌లో అందించబడుతున్న అనేక ప్రత్యేక అంశాల్లో, యాంబియంట్ లైటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ లైటింగ్ కేవలం స్టైల్ కోసమే కాదు, కారులో ఓ ప్రీమియం అనుభూతిని కూడా కలిగిస్తుంది. ఇది రాత్రి ప్రయాణాల్లో క్యాబిన్‌కి సాఫ్ట్, శాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

C3 Sport Edition Interior

ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్ల విషయానికొస్తే, C3 స్పోర్ట్ ఎడిషన్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి తోడు నాలుగు స్పీకర్లు సరైన ఆడియో అనుభూతిని అందిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం, ఈ మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే ABS (యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టం)తో EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ముఖ్యమైన భద్రతా వ్యవస్థలు కూడా ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు విషయాల్లో, స్పోర్ట్ ఎడిషన్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 82hp పవర్, 115Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌‌తో జత చేయబడింది. ఎక్కువ శక్తిని కోరుకునే వారికి, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 110hp పవర్, 190Nm టార్క్‌‌ను అందిస్తుంది, అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 205Nm టార్క్‌‌ను విడుదల చేస్తుంది.

C3 Sport Edition Design

సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్‌కి భారత మార్కెట్లో మారుతి వ్యాగన్ ఆర్, టాటా టియాగో, మారుతీ సెలెరియో వంటి హ్యాచ్‌బ్యాక్‌లతో గట్టి పోటీ ఎదురవుతోంది. డైనమిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ప్రత్యేకమైన ఫీచర్లతో C3 స్పోర్ట్ ఎడిషన్ ఈ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని సిట్రోయెన్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2025, 17:25 [IST]
English summary
Citroen new c3 sport edition launched in india price and design details inside
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+