బడ్జెట్‌ ధరలో కారు కావాలా? అదిరిపోయే మోడల్ లాంచ్.. 19.3 కి.మీ మైలేజ్‌‌తో టాప్ ఫీచర్స్

సిట్రోయెన్ ఇండియా, తన Citroën 2.0 - షిఫ్ట్ ఇన్‌టు ది న్యూ (Shift Into the New) స్ట్రాటజిక్ ప్లాన్‌లో భాగంగా, ఈ రోజు కొత్త Citroën C3X రేంజ్‌ను ఆవిష్కరించింది. SUV-స్టైల్‌లో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ మోడల్, ఇప్పుడు మరింత కొత్త రూపంలో, అధునాతన మార్పులతో వచ్చింది. 15 కొత్త ఇంటెలిజెంట్ ఫీచర్లతో కూడిన ఈ ఎడిషన్, ప్రతి ప్రయాణంలో మరింత సౌకర్యం, టెక్నాలజీ ఆధారిత సౌలభ్యం, భద్రతను అందించేలా రూపొందించబడింది. ఇది కేవలం ఫీచర్ల పరంగానే కాదు, ధర పరంగా కూడా తన సెగ్మెంట్‌లో అత్యంత సులభంగా అందుబాటులో ఉండే మోడల్‌గా తన స్థాయిని కొనసాగిస్తోంది. మెరుగైన కంఫర్ట్, యూజర్-ఫ్రెండ్లీ టెక్ ఆప్షన్స్, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిపి ఇవ్వడం వలన, ఇది నగర రోడ్ల నుంచి హైవేల వరకు ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేక అనుభవంగా మార్చబోతోంది.

సిట్రోయెన్ C3X రెండు శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటిది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, ఇది 82 bhp శక్తి, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది, ఇది సిటీ డ్రైవింగ్‌కి స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. రెండవది, మరింత శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో పెట్రోల్, ఇది 100 bhp శక్తి, 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Citroen New c3x Launched In India Price desig

ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జోడించబడింది. దీని వల్ల రైడర్ తన అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌మిషన్ ఎంచుకోవచ్చు. పనితీరు పరంగా 10 సెకన్లలోపు 0-100 kmph వేగాన్ని చేరగలదు, ఇది తన సెగ్మెంట్‌లో మంచి యాక్సిలరేషన్‌గా చెప్పవచ్చు. మైలేజ్‌కు సంబంధించి ఇది 19.3 kmpl అందించగలదు. ఈ కాంబినేషన్‌ వల్ల, C3X నగర, హైవే డ్రైవ్స్ వరకు శక్తి అద్బుతంగా ఉంటుంది.

సిట్రోయెన్ కొత్త C3X మోడల్‌కు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు సెప్టెంబర్ మొదటి వారంలోనే మొదలుకానున్నాయి. ఈ SUVను ఐదు మోనోటోన్, రెండు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లతో అందిస్తున్నారు. అదనంగా, మూడు వేరువేరు ఇంటీరియర్ థీమ్‌లను కూడా అందుబాటులో ఉంచారు, దీంతో వినియోగదారులు తమ అభిరుచికి తగ్గట్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ కారులో అత్యాధునిక ఫీచర్స్‌ను అందించారు. సెగ్మెంట్‌లో తొలిసారిగా స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్‌ను అందించడం విశేషం.

Citroen New c3x Launched In India Price desig

డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి 360 డిగ్రీల కెమెరా సిస్టమ్‌ను అమర్చారు. రాత్రి డ్రైవింగ్ కోసం ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, పూర్తి LED లైటింగ్ సెటప్ అందించబడింది, దీని వల్ల స్పష్టమైన లైటింగ్, ఆకర్షణీయమైన లుక్ లభిస్తుంది. క్యాబిన్‌లో మెట్రోపాలిటన్ లెథరెట్‌తో చుట్టబడిన డాష్‌బోర్డ్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

వేరియంట్ల వారీగా ధరలు చూసినట్లయితే, C3 లైవ్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ రూ. 5.25 లక్షలు, C3 ఫీల్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ మాన్యువల్ రూ.6.23 లక్షలు, C3 ఫీల్ (O) నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ రూ.7.27 లక్షలు, C3X షైన్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ రూ.7,90,800, టాప్ ఎండ్ వేరియంట్ C3X షైన్ టర్బో ఆటోమేటిక్ రూ.9,89,800ల ఎక్స్ షోరూమ్ ధర నుంచి లభిస్తుంది.

Citroen New c3x Launched In India Price desig

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2025, 16:25 [IST]
English summary
Citroen new c3x launched in india price design and all details
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+