టాటా టాప్ మోడల్ నెక్సాన్ ధరకే సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఆల్ట్రా స్టైలిష్ మోడల్.. దీని ఫీచర్స్ ఇవే!
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్(citroen) భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కంపెనీ విడుదల చేసిన మోడళ్లలో ఏవీ పెద్దగా ఇక్కడి కస్టమర్ల దృష్టిని ఆకర్షించకపోయినా కంపెనీ మాత్రం అవిశ్రాంతంగా పోరాడుతోంది. టాటా కర్వ్‌కి పోటీగా ఇటీవల విడుదల చేసిన బసాల్ట్ కూపే SUV పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా ఆదరణ పొందలేదనే చెప్పాలి.
సిట్రోయెన్ బసాల్ట్‌ను భారతీయులు కోరుకునే అన్ని ఫీచర్లతో పాటు, ఎక్స్ ట్రా ఫెసిలిటీలతో రూపొందించారు. వాస్తవానికి ఇండియాలో ఈ కంపెనీకి మంచి మార్కెట్ కలిగి ఉంది. సేల్స్ పరంగా గతంలో పోల్చుకుంటే కాస్త మెరుగైన గణాంకాలను నమోదు చేస్తోంది. 2024లో విజయవంతంగా తన కార్లను విక్రయించిన కంపెనీ 2025లో అంతకంటే ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కొత్త మోడల్స్, డిస్కౌంట్లను తీసుకొస్తుంది.

ఇటీవల విడుదల చేసిన బసాల్ట్ కూపే SUV లంబోర్గిని ఉరుస్ మాదిరిగా స్టైలిష్ గా ఉండడంతో దీనిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎగబడతారని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పాత మోడల్ ఫెయిల్ కావడంతో సిట్రోయెన్ కొత్త ప్లాన్ తో మళ్లీ రంగంలోకి దిగుతుంది. ఫ్రెంచ్ బ్రాండ్ ఇతర విషయాలతోపాటు వెహికల్ కొత్త బ్లాక్ ఎడిషన్ మోడల్ కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది.
ఇందులో భాగంగా వెహికల్ టీజర్ ఇమేజ్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ బ్లాక్ కలర్ ఆఫ్షన్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న అన్ని క్రోమ్ పార్టులను బ్లాక్ చేసి ఎక్సటర్నల్ లుక్ ను స్పోర్టినెస్ గా మార్చనుంది. ఇందులో ముందు గ్రిల్‌పై ఉన్న క్రోమ్ స్లాట్‌లు, సిట్రోయెన్ బసాల్ట్ బ్యాడ్జ్ లు అన్నీ బ్లాక్ కలర్లో పూర్తి చేయనున్నారు.

దీనికి తోడు వినియోగదారులు డ్యూయల్-టోన్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ యాడ్ చేయనుంది కంపెనీ. ఇకపోతే ఈ మోడల్ ఇంటీరియర్లో కూడా మార్పులు చేయనుంది కంపెనీ. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్‌లో బ్లాక్ అప్హోల్స్టరీతో కూడిన ఇంటీరియర్ ఉంటుంది. కంపెనీ అన్ని ఫీచర్లను కొనసాగిస్తూ బ్లాక్ పెయింట్ చేయడం ద్వారా ప్రజలను త్వరగా ఆకర్షిస్తుంది.
కూపే స్టైలింగ్‌తో పాటు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16-ఇంచుల అల్లాయ్ వీల్స్, టెయిల్ లైట్స్ ఈ మోడల్ కు కూల్ ఎక్సటర్నల్ లుక్ అందిస్తాయి. అంతేకాకుండా సెమీ-లెథరెట్ సీట్లు, అడ్జస్టబుల్ థై సపోర్ట్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించింది.

అలాగే ఫ్లోర్-మౌంటెడ్ రియర్ ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కాంటూర్డ్ హెడ్‌రెస్ట్‌లు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVMలు అన్నీ రాబోయే సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంటాయి. సిట్రోయెన్ బసాల్ట్ రెండు ఇంజన్ ఆఫ్షన్లలో వస్తుంది. అవి1.2 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 టర్బో పెట్రోల్. అయితే, డార్క్ ఎడిషన్ టాప్-ఎండ్ వేరియంట్లలో అందించే అవకాశం ఉంది.
ఈ వాహనం మరింత పవర్ ఫుల్ టర్బో ఇంజిన్‌తో మార్కెట్ చేయనున్నారు. 1.2-లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజన్ 109 bhp వరకు పవర్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

టార్క్ పరంగా, మాన్యువల్ 190ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే బసాల్ట్ ఆటోమేటిక్ 205ఎన్ఎం వరకు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బసాల్ట్ బేస్ వేరియంట్లలోని 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ 80 bhpపవర్, 115ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందించగలదు. ప్రస్తుతం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.25 లక్షల నుండి రూ.14 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
డార్క్ ఎడిషన్ ధర దాని మిగతా వేరియంట్స్ ధర కంటే సుమారు రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు ఎక్కువగా ఉండొచ్చు. C3, ఎయిర్‌క్రాస్‌ల మాదిరిగానే ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన బసాల్ట్ లెన్త్ 4,252ఎంఎం, వెడల్పు 1,765ఎంఎం, ఎత్తు 1,593ఎంఎం, వీల్‌బేస్ 2,651ఎంఎం కలిగి ఉంది. ఇదిలా ఉండగా, సిట్రోయెన్ కూపే SUV 470 లీటర్ల బూట్ స్పేస్, 180ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








