ఎయిర్ పోర్ట్ సేఫ్టీలో కీలక పాత్ర పోషిస్తున్న తొలి కారుగా రికార్డ్ సృష్టించిన సిట్రోయెన్ ఎస్యూవీ
ఫ్రెంచ్ వాహన తయారీదారు సిట్రోయెన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటికీ..ఇక్కడ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. మొదల విడుదల చేసిన సీ5 ఎయిర్ క్రాస్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో, దేశీయంగా తయారైన మోడల్స్ పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అవి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. సిట్రోయెన్ వాహనాలు నాణ్యతలో రాజీపడకుండా, మంచి సస్పెన్షన్, ఇంజన్ ఆఫ్షన్లు, రైడ్ క్వాలిటీని అందిస్తాయి. కానీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది.
ఇప్పుడు, ఎయిర్ పోర్టులలో ప్రత్యేక విధుల కోసం సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్‌ను ఉపయోగించనున్నాయి. విమానాశ్రయాల ట్యాక్సీవేలు లేదా రన్‌వేలపై పసుపు రంగు ఎస్యూవీ వేగంగా వెళ్లడం మీరు చూసే ఉంటారు. ఇది 'ఫ్రిక్షన్ టెస్ట్ కార్' (ఘర్షణ పరీక్ష వాహనం). రన్‌వేలపై సేఫ్టీని నిర్ధారించడానికి ఈ వాహనాలను ఉపయోగిస్తారు. ఈ విధులను నిర్వహించడానికి సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్‌ను ఎంపిక చేశారు.

దేశీయంగా తయారైన ఫ్రిక్షన్ టెస్ట్ వాహనాన్ని ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి విమానాశ్రయం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అంతకు ముందు భారతీయ విమానాశ్రయాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్న ఫ్రిక్షన్ టెస్ట్ వాహనాల మీదనే ఆధారపడేవి. ఉదాహరణకు.. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో వోల్వో V90 మోడల్‌ను ఉపయోగించేవారు.
గతంలో సాబ్ 9-5 వాగన్‌లను కూడా ఈ అవసరాల నిమిత్తం ఉపయోగించారు. ఈ వాహనాలన్నీ విదేశీ తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్నవే. బెంగళూరు విమానాశ్రయంలో సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ రాక ఓ మైలు రాయిగా చెప్పవచ్చు. ఇది సాధారణ ప్రజలు కొనుగోలు చేసే స్టాండర్డ్ మోడల్ కంటే అనేక మార్పులతో రూపొందించారు. ఫ్రిక్షన్ టెస్ట్ కారుగా సిట్రోయెన్ ఎస్‌యూవీని స్పెషల్‌గా తయారు చేశారు.

రన్‌వేపై గ్రిప్ లెవల్ తెలుసుకునేందుకు ప్రత్యేక పరికరాలను ఈ వాహనంలో అమర్చారు. విమానాలు ఉపయోగించే డిప్లోయబుల్ వీల్‌ను C5 ఎయిర్‌క్రాస్‌లో అమర్చారు. ఇది ట్రాక్షన్ స్థాయిలను కొలిచే పరికరంలో భాగం. తడి పరిస్థితుల్లో పరీక్షించడానికి ఓ నాజిల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు.
700 లీటర్ల ఆన్‌బోర్డ్ వాటర్ రిజర్వాయర్ నుంచి టార్మాక్ పై కంట్రోల్డ్ 1 మిమీ నీటిని స్ప్రే చేస్తారు. వర్షం సమయంలో ల్యాండింగ్ పరిస్థితులను అనుకరించడానికి, అర్థం చేసుకోవడానికి ఈ పరికరం సాయపడుతుంది. రన్‌వే ఉష్ణోగ్రత స్థాయిలను ట్రాక్ చేయడానికి ఉష్ణోగ్రత సెన్సార్‌తో పాటు, SUVలో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, స్క్రీన్లు కూడా ఉన్నాయి.

ఈ సీ5 ఎస్యూవీ విశాలమైన ఇంటీరియర్ ఈ పరికరాలన్నింటినీ సౌకర్యవంతంగా అమర్చడానికి అనుకూలంగా ఉంటుంది. విమానాశ్రయాలలో రన్‌వే ఫ్రిక్షన్ టెస్ట్ ఎందుకు ముఖ్యమంటే.. సురక్షితమైన విమాన ప్రయాణానికి ఫ్రిక్షన్ టెస్టులు చాలా అవసరం.
ముఖ్యంగా వర్షాకాలంలో, జారుడుగా ఉండే రన్‌వేలపై నియంత్రణ కోల్పోవడం లేదా ఎక్కువ బ్రేకింగ్ దూరం అవసరం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గంటకు 65 కిమీ, 95 కిమీ వేగంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రన్‌వే గ్రిప్ డేటాను గుడ్, మీడియం/ఫెయిర్, పూర్ అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.

ఈ పరిణామం ఇండియాలో ఎయిర్ పోర్ట్ సేఫ్టీని మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విమానాశ్రయాల భద్రతను పెంచడానికి సాయపడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








