పద్మిని తిరిగి పుట్టింది.. సోషల్‌మీడియా షేక్ అవుతుంది! ఈసారి మినీ కూపర్ గ్లామర్‌ లుక్‌తో కట్టిపడేస్తుంది

కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆటోమొబైల్ ప్రపంచంలో ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్ కలిగిన కార్లు మార్కెట్లో రోడ్లపై హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి టైంలో కూడా పాత జ్ఞాపకాల లాంటి వింటేజ్ కార్లకు మాత్రం ఇప్పటికీ చాలా మందిలో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త కొత్త డిజైన్లు, ఫీచర్లు వచ్చినా, కొన్ని వాహనాలు మాత్రం కాలాన్ని మించిన క్లాసిక్స్‌గా మిగిలిపోతాయి. అలాంటి కార్లలో ప్రతి భారతీయుడికి గుర్తొచ్చే పేర్లు, హిందూస్థాన్ అంబాసిడర్, మారుతి 800, ఫియట్ పద్మిని. ఈ మూడింటిలోనూ ఫియట్ పద్మినికి ఒక ప్రత్యేకం. ఆకట్టుకునే డిజైన్, పనితీరు పరంగా అప్పటి కాలం కారు లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న మోడల్. వాస్తవానికి, ఈ కార్ మొదట ఫియట్ 1100 డిలైట్ అనే పేరుతో భారతీయ రోడ్లపైకి వచ్చింది.

ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు తన గౌరవాన్ని నిలబెట్టుకొని, చివరికి ప్రీమియర్ పద్మిని అనే పేరుతో తిరిగి వచ్చింది. ఈ కారు ఒక కాలానికి ప్రతీక. ఫిల్మ్ స్టార్లు, రాజకీయ నాయకులు, అధికారి స్థాయిల వారందరూ ఒక సమయంలో ఈ కారులో ప్రయాణించడం గర్వంగా భావించేవారు. ముంబై వీధుల్లో నల్ల, పసుపు కలర్ లో టాక్సీగా పరుగెత్తిన పద్మినిలు ఇప్పటికీ కొన్ని ఫొటోలలో కనిపిస్తాయి.

Classic Premier Padmini Restored

వీధుల్లో ఒక్కొక్కసారి మన కళ్ల ముందు మెరుపుల్లా దూసుకెళ్లే ఓ పాత మోడల్ కారు కనిపిస్తే, క్షణంలోనే మన పాత రోజులకో తీసుకెళ్తుంది. అలాంటి అనుభూతిని కలిగించే కారుల్లో ఒకటి, భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రీమియర్ పద్మిని, ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ క్లాసిక్ లెజెండరీ కారు తాజాగా ఇంటర్నెట్‌లో మరోసారి హైలైట్ అయింది. తాజాగా ఈ కారును కొత్తగా మార్చారు.

ఐకానిక్ బ్రిటిష్ మినీ కూపర్‌ను గుర్తు చేసేలా, ఓ వ్యక్తి పద్మినిని పూర్తి స్థాయిలో మార్చివేశారు. దానికి సంబంధించిన ఫొటోలను మిస్టర్ మ్యాడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా, ఇప్పుు అది అందరి దృష్టిని ఆకర్షించింది. కారు ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లో మెరుస్తూ బాడీ, ఆపైన ఫినిషింగ్, ఒక డిజైన్ ఆర్ట్‌లా కనిపిస్తుంది. అంతేకాకుండా, కారుకు ప్రత్యేకమైన ఆఫ్టర్ మార్కెట్ బాడీ కిట్ అమర్చారు.

Padmini Restored Images Goes Viral More Details

ముఖ్యంగా ముందు, వెనుక భాగంలో ఉండే ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, కారుకు మరింత బలమైన అటిట్యూడ్‌ను అందిస్తున్నాయి. ఇక వెనుక ఫెండర్‌ల రూపంలో చేసిన జోడింపులు కారును మునుపెన్నడూ చూడని విధంగా గంభీరంగా మలుస్తున్నాయి. వీటన్నింటి మధ్యలో, కార్ సైడ్‌లో ఆకర్షణీయంగా మెరుస్తున్న క్రోమ్ స్ట్రిప్ క్లాసిక్ లుక్‌ కలిగిస్తోంది. బీడ్‌లాక్ డిజైన్‌తో రూపొందించబడిన వీటి ఆకారం, తక్కువ ప్రొఫైల్ టైర్లను కలగలిపి, కారు లుక్స్‌ను లగ్జరీ సెగ్మెంట్‌లోకి మార్చింది.

ఫియట్ 1100 డిలైట్గా 1964లో భారతదేశంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లోనే ఒక ఇంటర్నేషనల్ డిజైన్‌ను భారత్‌కు పరిచయం చేస్తూ, అది మిడిల్ క్లాస్ కలల కారుగా నిలిచింది. అయితే, 1970ల సమయంలో దీనికి ప్రీమియర్ పద్మిని" అనే పేరు పెడుతూ, భారతీయతకు దగ్గరయ్యేలా మార్పు చేశారు. పద్మిని అనే పేరుకు సంబంధించిన కథ కూడా అంతే ఆసక్తికరమైనది.

Classic Premier Padmini New

రాజపుత్రుల గౌరవ ప్రతీకగా చరిత్రలో నిలిచిన రాణి పద్మినికి గౌరవం తెలుపుతూ ఈ సెడాన్‌కు ఆ పేరు పెట్టారని చెబుతారు. 1970, 80లలో ఈ కారుకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. బాలీవుడ్ స్టార్స్ నుంచి రాజకీయ ప్రముఖులు వరకు ఎందరో ప్రముఖులు పద్మినితో వీధుల్లో పయనించారు. ఇక 2000 సంవత్సరానికి వచ్చేసరికి, కంపెనీ ఈ క్లాసిక్ కారును అధికారికంగా నిలిపివేసింది.

అయినప్పటికీ, ఆ కారుకు ఉన్న ఆదరణ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇందులో 1089 cc inline-4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 నుండి 50 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ, 71 Nm టార్క్‌తో మంచి పనితీరున అందించగలిగింది. ఈ కారు గంటకు 120 నుండి 130 కి.మీ వేగంతో పరుగెత్తగల సామర్థ్యం కలిగి ఉండేది.

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2025, 17:00 [IST]
English summary
Classic premier padmini restored images goes viral more details inside
Read more on: #auto news #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+