మైలేజ్ పెంచేందుకు కంపెనీ చెప్పని సీక్రెట్స్! ఇలా చేస్తే మైలేజ్ ఊహించనంత పెరుగుతుంది! బెస్ట్ సీఎన్‌జీ టిప్స్
ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో, CNG కార్లు తిరిగి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ వాహనాలను ఎంతో మంది ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేసిన చాలా మంది ఆ తర్వాత వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. దీంతో దాని మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం వంటి ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ కారును తమ వద్ద కలిగి ఉన్నట్లయితే ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మేము చెప్పిన విషయాలను మీరు పాటించినట్లయితే మీ CNG కారు మెరుగైన మైలేజ్, పనితీరును అందిస్తుంది. అవెంటో కింది కథనంలో తెలుసుకుందాం.
CNG లీకేజీ ఉందేమో చెక్ చేయాలి: CNG కార్లు మంచి మైలేజ్ అందిస్తాయని అందరికీ తెలుసు. కానీ, కొంతకాలం తర్వాత మైలేజ్ తగ్గిపోవడం జరుగుతుంది. చాలామంది దీని అసలు కారణం ఏమిటో కూడా అర్థం చేసుకోలేరు. CNG వాహనాల్లో మైలేజ్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గ్యాస్ లీకేజీ. చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. చిన్నపాటి లీకేజీ కూడా ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు CNG వాసన వస్తుందేమో పరిశీలించాలి.

CNG సిలిండర్ ఒక అధిక పీడనంతో నింపబడిన గ్యాస్ ట్యాంక్. ఇది కారు ఇంజిన్ వరకు ప్రత్యేకమైన పైప్‌ల ద్వారా సరఫరా అవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ట్యాంక్ నుంచి ఇంజిన్ వరకు వెళ్లే పైపుల్లో చిన్నచిన్న లీకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల గ్యాస్ నెమ్మదిగా లీక్ అవుతుంది. దీని కారణంగా వాహనం మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి లీక్‌ను గమనించడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
వాల్వ్ చెక్ చేయాలి: వాల్వ్ సరిగ్గా పనిచేయకపోతే గ్యాస్ సరైన విధంగా సరఫరా కాకపోవడం లేదా లీక్ అవ్వడం జరుగుతుంది, దీని ప్రభావం మైలేజ్‌పై పడుతుంది .CNG కిట్‌లోని వాల్వ్ ప్రధానంగా గ్యాస్‌ను నియంత్రించే వ్యవస్థ. ఇది సరిగ్గా పనిచేయకపోతే మైలేజ్ తగ్గుతుంది. ఇంజిన్‌కు తగినంత ఇంధనం చేరకపోవడంతో కారు స్టార్ట్ కావడంలో సమస్యలు ఎదర్కొంటుంది. అందుకే వాల్వ్‌ను తరచూ చెక్ చేయాలి. డ్యామేజ్ ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి.

స్పీడ్ లిమిట్: CNG కార్లు మైలేజ్ ఇవ్వడంలో వాటి స్పీడ్ కూడా ప్రభావం చూపిస్తుంది. తక్కువ వేగంతో ఎక్కువ క్లచ్ వాడితే, ఇంధనం వినియోగం పెరిగి మైలేజ్ తగ్గిపోతుంది. అందుకే క్లచ్‌ను సమర్థంగా ఉపయోగించాలి. వేగాన్ని గంటకు 40-50 కి.మీ. వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల మైలేజ్ పెరగడమే కాకుండా పనితీరు కూడా మెరుగుపడుతుంది. 30 సెకన్ల కంటే ఎక్కువసేపు కారును ఆపవలసి వస్తే, ఇంజిన్‌ను ఆపివేయడం ఉత్తమం.
టైంకు సర్వీస్ చేయడం: సమయానికి సర్వీస్ చేయించకపోతే, మైలేజ్ తగ్గిపోవడమే కాకుండా పనితీరు కూడా ప్రభావితమవుతుంది. గ్యాస్ ఇంజెక్షన్ సిస్టమ్ వాల్వ్‌లు, సిలిండర్ ప్రెజర్ అన్నింటిపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే కారును సరైన సమయానికి సర్వీసింగ్ చేయడం మర్చిపోవద్దు. దీంతో ఇంజిన్ పనితీరు మెరుగవుతుంది. మైలేజ్ పెరుగుతుంది, ఇంధనం వృధా కాకుండా ఉంటుంది. ముఖ్యంగా అధీకృత సర్వీస్ సెంటర్‌లో మాత్రమే సర్వీస్ చేయడం బెస్ట్.

సరైన టైర్ ప్రెజర్: టైర్లలో సరైన గాలి లేకపోతే, టైర్ల అంచులు ఎక్కువగా తొక్కిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు కారణంగా మైలేజ్ టైర్ వేగంగా తిరగలేక మైలేజ్ బాగా తగ్గిపోతుంది. టైర్ల ప్రెజర్ తక్కువగా ఉంటే బ్రేకింగ్‌కు సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి, సరైన గాలి ఒత్తిడితో నడిపితే టైర్లు ఎక్కువ కాలం రావడంతో పాటు, మైలేజ్ కూడా మెరుగవుతుంది.


Click it and Unblock the Notifications








