పేద-మధ్యతరగతి వారి బడ్జెట్‌కు సరిపోయేలా మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ CNG కార్లు! మైలేజ్‌లో రారాజులు

ఇండియాలో చాలా మంది కార్ల వినియోగదారులు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లతో పాటు Cngలను సైతం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ, అలాగే ఖర్చు కూడా తక్కువగానే వస్తుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కొత్తగా కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు ఈవీతో పాటు Cngల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు ఇలాంటి వాటిని విడుదల చేస్తున్నాయి. మారుతీ సుజుకీ నుంచి మొదలుకుని దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్, దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ వరకు సీఎన్‌జీ కార్లను మార్కెట్లో ప్రస్తుతం విక్రయిస్తున్నాయి. చాలా మంది కస్టమర్లు రూ.10 లక్షల లోపు ధరలో లభించే వాటిని కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లో ఈ ధరలోపు అందుబాటులో ఉన్న కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

దేశయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన ప్రసిద్ధ మోడల్ టాటా పంచ్ SUV Cng ఆప్షన్‌లో తక్కువ ధరలో కొనుగోలుకు లభిస్తుంది. ఇది 1.2-లీటర్ CNG ఇంజిన్‌తో రన్ అవుతుంది. 73.5 PS హార్స్‌పవర్, 103 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. పంచ్ Cng మోడల్ ఇండియా మార్కెట్లో రూ.7.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది.

Cng Cars Under Rs 10 Lakh Tata Punch

ఇది ప్రారంభ ధర మాత్రమే. అదే టాప్ వేరియంట్‌ను మీరు ఎంచుకున్నట్లయితే మరింత ఎక్కువ చెల్లించాలి. మైలేజ్ విషయానికి వస్తే, కిలో ఇంధనానికి 27 కి.మీల వరకు అందిస్తుంది. ఇది చాలా ప్రధానంగా చాలా మంది వినియోగదారులను ఆకట్టుకునే అంశం. ఎందుకంటే ఇతర ఇంజిన్ ఆప్షన్లో ఈ విధంగా మైలేజ్ రాదు. ఈ కారులో 5 మంది ఈజీగా ప్రయాణించవచ్చు. డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్, సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.

అలాగే, మారుతీ సుజుకీ (Maruti Suzuki) విషయానికి వస్తే, ఈ కంపెనీ నుంచి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. ఇది 1.2-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. 69.75 PS పవర్, 101.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ముఖ్యంగా మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కిలో ఇంధనానికి ఏకంగా 32.85 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Cng Cars Under Rs 10 Lakh Maruti Swift

మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ CNG భారతీయ మార్కెట్లో రూ. 8.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారులో 5 మంది ఈజీగా ప్రయాణించవచ్చు. లోపల ప్రయాణికుల రక్షణకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగులు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉంటాయి. క్యాబిన్‌లో ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉంటాయి.

ఇక చివరగా, హ్యుందాయ్ (Hyundai) కంపెనీ విషయానికి వస్తే, ఆరా (Aura) సెడాన్ ప్రసిద్ధ Cng మోడల్‌గా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 7.54 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ CNG ఇంజిన్‌తో రన్ అవుతుంది. 69 PS హార్స్‌పవర్, 95.2 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. కిలో ఇంధనానికి 22 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు.

Cng Cars Under Rs 10 Lakh Hyundai Aura

కొత్త హ్యుందాయ్ ఆరా సెడాన్ కారులో 5 మంది ఈజీగా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రక్షణకు సంబంధించి ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 6 ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ఇతర సేఫ్టీ ప్రమాణాలు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, February 23, 2025, 9:10 [IST]
English summary
Cng cars under rs 10 lakh tata punch maruti swift and hyundai aura details check here
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+