ఎవరిని అడిగినా ఇవే పేర్లు! ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ కార్లనే కొన్నారు.. జనాల నుంచి భారీ రెస్పాన్స్

దక్షిణ కొరియా బ్రాండ్ అయినటువంటి హ్యుందాయ్ (Hyundai)కు జూన్ 2025 అంతగా కలిసిరాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం, యుద్ద భయాల కారణంగా ఆటోపరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీని ఫలితంగా గత నెల దేశీయంగా ఉండే ఆటో పరిశ్రమకు పెద్దగా మేలు చేయలేదు. అనేక కంపెనీలు అమ్మకాల పరంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. హ్యుందాయ్ కూడా ఈ నెమ్మదీ తరంగాన్ని తప్పించలేకపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన కార్లతో పోలిస్తే, ఈ ఏడాది అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. 2024 జూన్‌లో 50,103 యూనిట్లు డెలివరీ చేసిన హ్యుందాయ్, 2025 జూన్‌లో కేవలం 44,024 కార్లనే అమ్మగలిగింది. ఏడాది కాలంలో సేల్స్ తగ్గడంపై కంపెనీ చర్యలకు ఉపక్రమించింది.

2025 జూన్‌లో మొత్తం అమ్మకాల్లో స్థంభంగా నిలిచింది హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta). జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ మోడల్ ఇది. మొత్తం 15,786 యూనిట్లు డెలివరీ అయ్యాయి, అంటే కంపెనీ మొత్తం కార్ల అమ్మకాల్లో సగటున ప్రతి మూడో హ్యుందాయ్ కారు క్రెటానే అని చెప్పొచ్చు. ఇక, క్రెటా తర్వాతి స్థానాన్ని వెన్యూ (venue) దక్కించుకుంది. అయితే, ఈ SUV మాత్రం గతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలతో ఎదురైంది.

Hyundai Cars Sales

2024 జూన్‌లో 9,890 యూనిట్లు అమ్ముడైతే, 2025 జూన్‌లో ఆ సంఖ్య 6,858కి పరిమితమైంది. అంటే ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 31 శాతం తగ్గుదల. మూడు SUVలలో మరొకటి అయిన ఎక్స్‌టర్ (Exter) కూడా ఈసారి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. గత సంవత్సరం ఇదే నెలలో 6,908 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ ఈసారి 5,873 యూనిట్లే డెలివరీ అయ్యాయి, అంటే దాదాపు 15 శాతం తగ్గుదల.

అయినా, ఈ మూడు మోడళ్లదే హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో కీలక పాత్ర. క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ కలిపి గత నెల అమ్మకాలలో 28,517 యూనిట్లు కవర్ చేశాయి అంటే మొత్తం విక్రయాల్లో 65 శాతం వాటా వీటిదే. దీనిని బట్టి హ్యుందాయ్‌కి ఈ మూడు SUVలు ఏ స్థాయిలో ఆధారంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 10 మోడళ్ల లైనప్ ఉన్నా, మిగతా మోడళ్ల వృద్ధి లేకపోవడం గమనార్హం.

Hyundai Sales

క్రెటా పలు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దాని ఈ బేస్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 11.10 లక్షల నుంచి ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ఎక్కువగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా వినియోగదారుల అవసరాలను, ప్రయాణ శైలిని బట్టి ఎంపిక చేసుకునేలా మూడు వేరే ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంచుకునే వారికి, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ కావాలి.

స్పోర్టీవ్ డ్రైవింగ్‌ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. అదే సమయంలో, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరింత సాఫీగా, బడ్జెట్‌కు తగ్గ అనుభూతిని అందిస్తుంది. నిత్య ప్రయాణాలకు, ఫ్యామిలీ యూజ్‌కు ఇది మంచి ఎంపిక. మూడోది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, దీన్ని ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేసే వారికి రూపొందించారు. మెరుగైన మైలేజ్, టార్క్‌తో లాంగ్ రైడ్ లవర్స్‌కు ఇది బెస్ట్ చాయిస్.

Creta Exter And Venue Contributed 65 Percent Of Total

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 14:07 [IST]
English summary
Creta exter and venue contributed 65 percent of total hyundai sales in june 2025
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+