మేము చెప్పిందే చేస్తాం.. అని నిరూపించిన ఎలాన్ మస్క్! సైబర్‌ట్రక్‌తో ప్రపంచానికి సేఫ్టీ పాఠం చెప్పారు
ప్రముఖ వ్యాపారవేత్త ధనికవంతుడు అయినటువంటి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా సైబర్‌ట్రక్ (Tesla cybertruck) తన భద్రతా ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. తాజాగా అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ఈ ఎలక్ట్రిక్ ట్రక్‌కి డ్రైవర్, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక క్రాష్ టెస్ట్‌లలో ఐదు స్టార్ రేటింగ్‌ను ప్రకటించింది. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో మొత్తం భద్రతా పనితీరులో ఐదు స్టార్ రేటింగ్ సాధించిన ఈ వాహనం, ఇప్పుడు వ్యక్తిగత విభాగాల్లోనూ టాప్ రేటింగ్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన కఠినమైన పరీక్షల్లో సైబర్‌ట్రక్ అధికారులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ముందుభాగం ఢీకొన్న సందర్భంలో డ్రైవర్‌కు ఐదు స్టార్‌లు రావడం, ముందు సీటు ప్రయాణికుడికి నాలుగు స్టార్‌లు రావడం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
పక్క భాగాల సైడ్ ఇంపాక్ట్ టెస్టుల్లో మాత్రం ఇది అద్భుతంగా రాణించింది. ఫ్రంట్, రియర్ సీట్లకు.. బారియర్, పోల్ క్రాష్ టెస్టులలో.. రెండు విభాగాల్లోనూ పూర్తి ఐదు స్టార్ రేటింగ్ సాధించింది. రోల్ఓవర్ రిస్క్ టెస్టులో కూడా సైబర్‌ట్రక్ తన స్థిరత్వాన్ని చాటింది. వాహనం తిరగబడే ప్రమాదాన్ని కేవలం 12.4 శాతం వరకు మాత్రమే చూపిస్తూ, డైనమిక్ రోల్ఓవర్ పరీక్షలో టిప్ అవకుండా నిలబడింది.

మొత్తం మీద, భద్రతా ప్రమాణాల్లో ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పుడు డ్రైవర్, ప్రయాణికుల కోసం స్వతంత్రంగా ఐదు స్టార్ రేటింగ్‌లు పొందడంతో, టెస్లా సైబర్‌ట్రక్ తన ఇతర మోడళ్ల సరసన నిలబడిందని ధైర్యంగా చెప్పగలుగుతోంది. ఇప్పటికే మోడల్ 3, మోడల్ S, మోడల్ X, మోడల్ Y వంటి వాహనాలు అన్ని విభాగాల్లోనూ NHTSA అత్యుత్తమ భద్రతా గుర్తింపును సాధించాయి.
ఇప్పుడు సైబర్‌ట్రక్ కూడా ఆ జాబితాలో చేరడం టెస్లా భద్రతా ప్రమాణాలను మరింత బలపరుస్తోంది. దీంతో టెస్లా చేసిన ప్రకటనకు మరింత బలం చేకూరింది, అదే సైబర్‌ట్రక్ నిర్మాణంలో ఉపయోగించిన స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్సోస్కెలటన్ భద్రత. ప్రారంభంలో ఈ డిజైన్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారీగా, కఠినంగా ఉండే ఈ నిర్మాణం వాస్తవంగా ప్రమాదాల సమయంలో రక్షణ కల్పిస్తుందా? లేదా కేవలం డిజైన్ గిమ్మిక్ మాత్రమేనా? అన్న ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.

కానీ ఈ తాజా ఫలితాలు ఆ అనుమానాలకు సమాధానం చెబుతున్నాయి. భారీ ఢీకొనుళ్లను తట్టుకునేలా రూపొందించిన శక్తివంతమైన బాడీ స్ట్రక్చర్, సమర్థవంతంగా ప్రభావాన్ని గ్రహించే ఫ్రేమ్, లేటెస్ట్ సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థ.. ఇవన్నీ కలిపి సైబర్‌ట్రక్‌ను అత్యంత సురక్షిత ఎలక్ట్రిక్ వాహనాల సరసన నిలబెట్టాయి. టెస్లా ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలదు, మా వాహనాలు కేవలం భవిష్యత్తు టెక్నాలజీతో మాత్రమే కాకుండా, భద్రతా ప్రమాణాల్లోనూ అత్యుత్తమంగా నిలుస్తాయి అని.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. క్రాష్ టెస్ట్‌లలో సైబర్‌ట్రక్ అద్భుతమైన ప్రదర్శన చూపుతూ, టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న దృశ్యాలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. సైబర్‌ట్రక్ సాధించిన ఈ విజయంపై ఆయన ట్వీట్ చేస్తూ, టెస్లా సైబర్‌ట్రక్ క్రాష్ టెస్ట్‌లో టాప్ సేఫ్టీ రేటింగ్ పొందిందని తెలిపారు.



Click it and Unblock the Notifications








