ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్ ఇచ్చే డీజిల్ కారు.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ మోడల్స్ ఇవే!
భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్, పెట్రోల్ కార్ల హవా నడుస్తున్నప్పటికీ, డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే శక్తివంతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన మైలేజ్ రెండూ ఒకేసారి కావాలనుకునే డ్రైవర్లకు డీజిల్ ఇంజన్లే బెస్ట్ ఆప్షన్. మన దేశంలో ఉన్న గుంతల రోడ్లపైనా, ట్రాఫిక్‌లోనూ నమ్మకంగా దూసుకుపోవాలంటే, డీజిల్ కార్లంటేనే ఎక్కువమందికి కంపరం. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, పవర్ రెండూ అందించే టాప్ 5 డీజిల్ కార్ల వివరాలను వివరంగా తెలుసుకుందాం.

మహీంద్రా బొలెరో
బొలెరో భారతీయ రోడ్లపై దాని బలం, దృఢత్వం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత శక్తివంతమైన డీజిల్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలుస్తుంది.ఇందులో 1.5 లీటర్ mHAWK75 డీజిల్ ఇంజన్ ఉంటుంది. 75 బీహెచ్‌పీ శక్తిని, 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు 16 నుంచి 16.7 కి.మీ మైలేజ్ ఇస్తుంది. హైవేలపై 17 కి.మీ వరకు ఇస్తున్నట్లు కస్టమర్లు చెబుతారు. బొలెరో ఫుల్ ట్యాంక్ ఇంధనంతో దాదాపు 900 నుంచి 1000 కి.మీ వరకు సులభంగా ప్రయాణించగలదు.

టాటా ఆల్ట్రోజ్
భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. దీనిలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 90 బీహెచ్‌పీ శక్తిని, 200 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. దీని అధికారిక (ARAI) మైలేజ్ లీటరుకు 23.6 కి.మీ. అయినప్పటికీ, వినియోగదారుల నివేదికల ప్రకారం సిటీ, హైవేలలో సగటున 17 నుంచి 19 కి.మీ వరకు మైలేజ్ లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో
బొలెరో కంటే మెరుగైన పవర్, కంఫర్ట్ కోరుకునే వారికి నియో బెస్ట్ ఆప్షన్. దీనిలో 1.5 లీటర్ mHAWK100 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 100 బీహెచ్‌పీ శక్తిని, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని అధికారిక మైలేజ్ 17.29 కి.మీ/లీటర్. డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి 13 నుంచి 16 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది. దీని 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను ఫుల్‌గా నింపితే, సుమారు 800 కి.మీ వరకు దర్జాగా లాంగ్ డ్రైవ్‌లు చేయవచ్చు.

మహీంద్రా XUV 3XO
మహీంద్రా నుంచి వచ్చిన ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ పవర్, టార్క్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీనిలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. 115 బీహెచ్‌పీ శక్తి, 300 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎమ్టీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అధికారికంగా 20.6 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తున్నా, సిటీ ట్రాఫిక్‌లో 13-14 కి.మీ, హైవేలపై 17 కి.మీ వరకు మైలేజ్ వస్తున్నట్లు కస్టమర్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

కియా సోనెట్
సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో శక్తివంతమైన డీజిల్ ఇంజన్‌తో కియా సోనెట్ పోటీ పడుతోంది. దీనిలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 114 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ అధికారికంగా 24.1 కి.మీ/లీటర్, ఆటోమేటిక్ వేరియంట్ 18.6 కి.మీ/లీటర్ అందిస్తున్నాయి. సాధారణ డ్రైవింగ్‌లో మ్యాన్యువల్ 17-19 కి.మీ/లీటర్, ఆటోమేటిక్ 14-16 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తున్నాయి.
కాలుష్య నియంత్రణ నిబంధనలు (ఎమిషన్ నార్మ్స్) కఠినతరం కావడంతో కొన్ని కంపెనీలు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను తగ్గించాయి. అయినప్పటికీ పర్ఫార్మెన్స్, మైలేజ్, నమ్మకమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఆశించే వారికి ఈ ఐదు డీజిల్ కార్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. భారతీయ రోడ్లపై డీజిల్ కార్లకు ఉన్న స్థానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఈ మోడల్స్ నిరూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








