అన్నీ ఫీచర్లు ఉన్నా.. బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. టాటా సఫారీ వంక చూడని జనాలు.. కారణం ఇదే

భారతీయ కార్ల మార్కెట్‌లో టాటా సఫారీ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇది మంచి పర్ఫామెన్స్, ఎట్రాక్టివ్ ఫీచర్లకు పేరు పొందింది. అయితే, దీని అమ్మకాల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. ఈ జూన్ నెలలో కూడా ఇదే కొనసాగింది. కేవలం 922 యూనిట్లను మాత్రమే విక్రయించారు.

దీంతో గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల శాతం -34% తగ్గింది. 2024 ఇదే కాలంలో 1,394 యూనిట్లను విక్రయించారు. ఇంత మంచి ఫీచర్లున్న కారును కస్టమర్లు ఎందుకు కొనడం లేదో తెలుసుకుందాం.

ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో కూడా టాటా సఫారీ అమ్మకాల్లో హెచ్చుతగ్గులు కొనసాగాయి. మే నెలలో 1,109 యూనిట్లు, ఏప్రిల్‌లో 1,340 యూనిట్లు, మార్చిలో 1,415 యూనిట్లు, ఫిబ్రవరిలో 1,562 యూనిట్లు, జనవరి నెలలో 1,548 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని స్పష్టమవుతోంది.

Tata Safari

టాటా సఫారీ ఒక పెద్ద సైజ్ ఎస్‌యూవీ, ఇది కాంపిటేటివ్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.15.50 లక్షల నుండి రూ.27.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది స్మార్ట్, స్మార్ట్ (O), అడ్వెంచర్, అకంప్లిష్డ్ ప్లస్ వంటి అనేక వేరియంట్ల ఎంపికలో కూడా లభిస్తుంది.

ఈ కారు బయటి డిజైన్ చాలా అడ్వాన్సుడ్‎గా ఉంటుంది.. రోడ్డుమీద చూసేవారిని ఆకర్షిస్తుంది. ఇది కాస్మిక్ గోల్డ్, ఒబెరాన్ బ్లాక్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్‌నోవా కాపర్, లూనార్ స్లేట్ అనే కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది 4,668 మి.మీ పొడవు, 1,922 మి.మీ వెడల్పు, 1,795 మి.మీ ఎత్తును కలిగి ఉంది. దీనికి 205 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,741 మి.మీ వీల్‌బేస్ ఉన్నాయి.

Tata Safari

కొత్త సఫారీ ఎస్‌యూవీ పవర్ ఫుల్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఇది 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. వేరియంట్‌లను బట్టి 6-స్పీడ్ మ్యాన్యువల్/ 6-ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది భారీ కారు అయినప్పటికీ, సాధారణ కార్ల వలె లీటరు 14 నుండి 16.30కిమీ వరకు మైలేజీని అందిస్తుంది.

ఇందులో 6 లేదా 7 సీటింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చుని సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. వీకెండ్లలో, సెలవుల్లో ట్రిప్‌లకు వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి 420 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీనికి 50 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయెల్ ట్యాంక్ కూడా ఉంది.

Tata Safari

ఈ కారు క్యాబిన్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది.. అందరినీ ఆకర్షిస్తుంది. ఇది 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీతో సహా అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది.

కొత్త సఫారీ ఎస్‌యూవీ భద్రతకు కూడా పేరు పొందింది. ప్రయాణికుల రక్షణ కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్, ఈఎస్‌సి, టీపీఎంఎస్, 360-డిగ్రీ కెమెరా వంటి వివిధ రక్షణ ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2025, 11:37 [IST]
English summary
Despite strong features tata safari sees significant sales decline in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+