ధంతేరాస్ సేల్స్ సునామీ.. ఒక్క రోజులో లక్ష కార్లు..రూ.10000కోట్ల విలువైన కార్లు సేల్.. రికార్డులన్నీ బ్రేక్

భారతదేశంలో పండుగ సీజన్ అంటే కొనుగోళ్ల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా ధంతేరాస్ రోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈసారి ధంతేరాస్ పండుగ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే 1,00,000 (లక్ష) కార్లకు పైగా డెలివరీలు జరిగాయి.

పండుగ డిమాండ్, జీఎస్టీ 2.0 సంస్కరణల సానుకూల ప్రభావంతో ఒకే రోజులో రూ.8,500 కోట్ల నుండి రూ.10,000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఆటో రంగమే కాకుండా, బంగారం, వెండి అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ రికార్డుల వివరాలు, పండుగ సీజన్ ప్రభావం గురించి ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

Dhanteras Sales Boom Over 100 000 Cars Sold in Single Day India s Auto Market Shatters All Records

ఈ ఏడాది ధంతేరాస్ పండుగ రోజున భారత ఆటోమొబైల్ మార్కెట్ చరిత్ర సృష్టించింది. పండుగ డిమాండ్‌కు తోడు, ఆర్థిక వ్యవస్థలో రికవరీ, జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం కారణంగా అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. ధంతేరాస్ రోజున 1,00,000 (లక్ష) యూనిట్లకు పైగా కార్లు డెలివరీ అయ్యాయి. ఒక్కో వాహనం సగటు ధర రూ.8.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తే, ఒకే రోజులో జరిగిన ఈ డెలివరీల విలువ రూ.8,500 కోట్ల నుండి రూ.10,000 కోట్ల వరకు ఉంది.

మారుతి సుజుకి ఇండియా (MSIL), టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ పండుగ సీజన్‌లో రికార్డు అమ్మకాలను ప్రకటించాయి. వినియోగదారుల విశ్వాసం పెరగడంతో అమ్మకాలు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి.

Dhanteras Sales Boom Over 100 000 Cars Sold in Single Day India s Auto Market Shatters All Records

టాటా మోటార్స్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ మాట్లాడుతూ.. ఈసారి ధంతేరాస్, దీపావళి డెలివరీలు శుభ ముహూర్తాల కారణంగా రెండు లేదా మూడు రోజులు విస్తరించాయని తెలిపారు. "మొత్తం డిమాండ్ చాలా బలంగా ఉంది. ఈ పండుగ సీజన్‌లో 25,000కు పైగా వాహనాలను డెలివరీ చేస్తామని ఆశిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. కంపెనీ 14,000 యూనిట్ల డెలివరీలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ. ఆటో రంగంతో పాటు, పండుగ సీజన్ ఇతర రంగాలలో కూడా వినియోగదారుల ఖర్చును పెంచింది.

Dhanteras Sales Boom Over 100 000 Cars Sold in Single Day India s Auto Market Shatters All Records

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం, పసిడి, వెండి అమ్మకాలు విలువ పరంగా 25 శాతానికి పైగా పెరిగాయి. మొత్తం ధంతేరాస్ వ్యాపారం రూ.లక్ష కోట్ల మార్కును దాటినట్లు అంచనా.

ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ.. బంగారు ధరలు తగ్గిన తర్వాత కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. "ఈ సీజన్‌లో పండుగ అమ్మకాలు రూ.50,000 కోట్లు దాటుతాయని ఆశిస్తున్నాము. పెరిగిన ధరలు ఉన్నప్పటికీ త్వరలో జరగబోయే వివాహ కొనుగోళ్లు, పండుగ కొనుగోళ్ల కారణంగా కస్టమర్లలో ఉత్సాహం అధికంగా ఉంది" అని ఆయన అన్నారు.

Dhanteras Sales Boom Over 100 000 Cars Sold in Single Day India s Auto Market Shatters All Records

ఆటోమొబైల్స్ నుండి ఆభరణాల వరకు, దీపావళి సీజన్ భారతీయ రిటైల్ మార్కెట్‌కు ఒక ఆశావాహ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. పండుగ ఉత్సాహం, ఆర్థిక పునరుద్ధరణ, జీఎస్టీ 2.0 సంస్కరణల కలయిక వినియోగదారుల సెంటిమెంట్‌ను పెంచింది. ఈ సీజన్ ఇటీవలి కాలంలో అత్యంత ఉల్లాసంగా ఉన్న పండుగ సీజన్లలో ఒకటిగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.

Article Published On: Monday, October 20, 2025, 10:00 [IST]
English summary
Dhanteras sales boom over 100 000 cars sold in single day indias auto market shatters all records
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+