26 కి.మీ మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు! డ్రీం కారుపై భారీ తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి!

భారతీయ కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన హోండా(Honda) కార్స్ ఇండియా గత కొన్నేళ్లగా మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తుంది. దేశంలో తన కార్లకు ఉన్న ఆదరణను కొనసాగిస్తూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన ప్రదర్శనతో ముగించింది. ఇటీవల వెల్లడించిన విక్రయాల నివేదిక ప్రకారం, కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 1,26,151 యూనిట్లను విక్రయించింది. వీటిలో 65,925 కార్లు దేశీయంగా అమ్ముడవ్వగా, మిగిలిన 60,226 కార్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇది హోండాకు సంతోషం కలిగించే విషయం అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు ఏకంగా 60 శాతం పెరగడం విశేషం. ఇక, మార్చి 2025 నెలపరంగా చూస్తే హోండా దేశీయంగా 7,228 కార్లను విక్రయించింది. అలాగే 4,656 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

ఈ గణాంకాలు కంపెనీకి తక్కువే అయినప్పటికీ మార్కెట్లో తిరిగి పుంజుకోవాలనే ప్రయత్నాలకు ఇది శుభారంభం అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయ వాహన మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. కార్ల తయారీదారులంతా కూడా తమ అమ్మకాలు పెంచుకుని ఎక్కువ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని గట్టిగా పోరాడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో హోండా కార్స్ క్రమంగా తాను అమ్మకాల్లో వృద్ధి సాధించడం గమనార్హం. తన మోడళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలని చేస్తుంది.

Honda City Car In April 2025 Offers

ఇదిలా ఉంటే తాజాగా హోండా కార్స్ ఇండియా ఏప్రిల్ 2025లో కొత్త ఆఫర్స్ తీసుకొచ్చింది. హోండా సిటీ e:HEV మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ ఏకంగా రూ. 65,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. ఇతర వేరే అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. అంతేకాదు, హోండా సిటీ మిగిలిన వేరియంట్లపై కూడా రూ. 63,300 వరకు తగ్గింపు లభిస్తుంది.

శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, క్లాస్‌తో కూడిన డిజైన్, ఫ్యామిలీ సెడాన్‌కి అవసరమైన అన్ని ఫీచర్లతో హోండా సిటీ ఇప్పటికే దేశీయంగా బాగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఈ భారీ తగ్గింపులు మరోసారి కస్టమర్లను తన హోండా షోరూం వైపు కొనుగోలుదారులను మళ్లించే అవకాశముంది. హోండా సిటీ భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వెర్టిస్‌లతో బలంగా పోటీ పడుతుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 12.28 లక్షలు.

Up To Rs 65000 Available On Honda City

అదే టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి రూ. 16.55 లక్షలు. హోండా సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.75 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే నగరాలను బట్టి మారుతూ మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. హోండా సిటీ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 121 BHP పవర్, 154 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. మైలేజ్ పరంగా అయితే కారు లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఈ కారులో అధునాతన ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

Discount Offer Up To Rs 65000 Available On Honda City

సేఫ్టీ విషయానికి వస్తే, దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు అమర్చారు. ఇంకా EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్‌వ్యూ కెమెరా, హోండా సెన్సింగ్ వంటివి ఉన్నాయి. ముఖ్య విషయం ఏమిటంటే వెబ్‌సైట్‌లో జాబితా హోండా సిటీ ఏప్రిల్ ఆఫర్‌ల ఇచ్చాము. ఇది నగరాలను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి ఆఫర్ పూర్తి వివరాల కోసం ముందుగా దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.

More from DriveSpark

Article Published On: Friday, April 4, 2025, 12:55 [IST]
English summary
Discount offer up to rs 65000 available on honda city car in april 2025 more details
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+