జనాలందరూ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లే కావాలంటున్నారు.. దేశంలో ఏకంగా టాప్ ప్లేస్‌కు వచ్చింది
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ ఏర్పడిన ఉత్సాహం రోజురోజుకూ కొత్త ఎత్తులకు చేరుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సహక చర్యలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన.. ఈ మూడు కలిసి భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మెల్లగా కానీ బలంగా ఎలక్ట్రిక్ మోడ్‌కి తిప్పేస్తున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లలో EVల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు కన్పించడం సాధారణమైపోయింది. కస్టమర్లలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ దృష్టిని వేగంగా ఎలక్ట్రిక్ విభాగంపై కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, గత నవంబర్‌లో ఏ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయో వివరాలను చూద్దాం.
ఎప్పటిలాగే టాటా మోటార్స్ ఈ జాబితాలో తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఈసారి విక్రయాల గతంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. అక్టోబర్ నెలలో కంపెనీ 7,363 వాహనాలను విక్రయిస్తూ బలం చూపించగా, నవంబర్‌లో మాత్రం ఈ సంఖ్య 6,096 యూనిట్లకు చేరింది. అమ్మకాల పరంగా ఇది ఓ తగ్గుదలగా కనిపించినప్పటికీ, మొత్తం మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టాటా తన స్థిరమైన డిమాండ్‌ను ఎలక్ట్రిక్ విభాగంలో కొనసాగిస్తోందని స్పష్టమవుతోంది.

MG ఈవీ విభాగంలో రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఈ కంపెనీ అమ్మకాల గ్రాఫ్‌లో కూడా తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్ నెలలో MG మొత్తం 4,744 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ద్వారా మంచి దూకుడు చూపించింది. కానీ నవంబర్‌లో ఈ సంఖ్య 3,658 యూనిట్లకు పడిపోయింది. అంటే నెలతరువాతి నెలలో అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. అమ్మకాలు తగ్గినా, బ్రాండ్ స్థానం మాత్రం రెండో స్థానంలో కొనసాగుతుండటం విశేషం.
మహీంద్రా ప్రస్తుతం ఈవీ అమ్మకాల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ కంపెనీ విక్రయాల గ్రాఫ్ కూడా ఈసారి కాస్త క్షీణించింది. అక్టోబర్‌లో మొత్తం 3,989 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన మహీంద్రా, నవంబర్‌లో మాత్రం 2,920 యూనిట్ల వరకు మాత్రమే చేరుకుంది. అంటే నెల తరువాతి నెలలో అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. డిమాండ్ మారినా, బ్రాండ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం, భవిష్యత్‌లో ఇంకా సేల్స్ పెంచుకోవచ్చు.

కియా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఎలక్ట్రిక్ విభాగంలో కంపెనీకి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, నవంబర్‌లో అమ్మకాలు బలహీనపడ్డాయి. అక్టోబర్‌లో కియా 636 ఈవీ వాహనాలను విక్రయించి మంచి ఫలితం సాధించింది, కానీ నవంబర్‌లో ఈ సంఖ్య కేవలం 463 యూనిట్లకు మాత్రమే చేరింది. ఇది కియా కోసం నెలవారీ అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల. అయినప్పటికి జాబితాలు నాలుగో స్థానం దక్కించుకుంది.
ఐదో స్థానంలో ఉన్న BYD కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అక్టోబర్‌లో 562 యూనిట్లు విక్రయించిన ఈ బ్రాండ్, నవంబర్‌లో మాత్రం 417 వాహనాలకు పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా EV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా గుర్తింపు పొందినా, భారత్‌లో గత నెల అమ్మకాలు తగ్గడం అనేక విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ధరల మార్పులు, వినియోగదారుల కొనుగోలు శైలి మార్పు వంటి అంశాలు BYD పనితీరుపై ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది.

హ్యుందాయ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. అక్టోబర్‌లో మొత్తం 437 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన హ్యుందాయ్, నవంబర్‌లో ఈ సంఖ్యను 370 యూనిట్లకు మాత్రమే తీసుకెళ్లగలిగింది. ఇది కూడా నెలవారీ అమ్మకాలలో స్పష్టమైన తగ్గుదల. హ్యుందాయ్ ప్రస్తుతం తమ EV పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ, కొత్త మోడళ్ల విడుదల ఇంకా కొంత సమయం పడుతుండటంతో, ప్రస్తుత అమ్మకాలు కోల్పోయినట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








