జనాలు ఆ కంపెనీ ఎలక్ట్రిక్‌ కార్లు మాత్రమే కావాలంటున్నారు.. సేల్స్‌లోనూ ఇవే టాప్‌!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు.. ఈవీలతో సందడి చేస్తున్నాయి. కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ఇప్పటికీ‌ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతుండగా.. విదేశీ కంపెనీలు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. మొత్తంగా ఈ 2025 జనవరి నెల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా.. మంచి ఫలితాలే అందించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత ఐదు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ తమ మోడళ్లతో వినియోగదారులకు బాగా చేరువైంది.

ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఈ సంస్థ నుంచి సేల్స్ జరుగుతున్నాయి. 2025 జనవరి నెలలో టాటా సంస్థ 5,047 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2024 జనవరి నెలలో చూస్తే.. ఈ అమ్మకాలు 5,082 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈ సారి టాటా మోటార్స్ అమ్మకాలు755 కార్లు తక్కువగా జరిగి, 13.01శాతం పతనం నమోదైంది.

2025 January Electric car sales in India

అయితే గతేడాది డిసెంబరుతో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో టాటా సంస్థ 1,000 ఎలక్ట్రిక్ కార్లను అధికంగా విక్రయించింది. డిసెంబరు నెలలో ఈ సంఖ్య 4,407 యూనిట్లుగా ఉంది. ఇక అమ్మకాల్లో రెండో స్థానంలో ఎంజీ మోటార్ నిలిచింది. సాధారణంగా టాటా తర్వాత స్థానంలో ఎంజీ సంస్థే ఉంటుంది. అయితే... ఈ 2025 జనవరి అమ్మకాల్లో సేల్స్‌లో గట్టి పోటీ ఇస్తూ మరింత దగ్గరగా వచ్చింది.

జనవరి నెలలో ఎంజీ మోటార్ అమ్మకాలు 4,237గా ఉన్నాయి. గతేడాది జనవరి నెలలో ఎంజీ సంస్థ అమ్మకాలు 1,203 యూనిట్లుగా ఉన్నాయి. ఈ లెక్కల్ని చూస్తే.. ఎంజీ సంస్థ ఏడాది కాలంలో మంచి పురోగతి కనబరిచిందని చెప్పవచ్చు. గతేడాది డిసెంబరు నెలలో ఎంజీ సంస్థ సేల్స్ సంఖ్య 3,643గా ఉంది.

2025 January Electric car sales in India

ఇక ఈ జాబితాలో 688 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలతో మహీంద్రా సంస్థ మూడో స్థానంలో నిలిచింది. హ్యూందాయ్, బీవైడీ సంస్థలు వరుసగా నాలుగో, ఐదో స్థానంలో నిలిచాయి. జనవరి నెలలో వీటి అమ్మకాల సంఖ్య వరుసగా 32, 313 యూనిట్లుగా ఉన్నాయి. సిట్రోయెన్... 269 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఇక 181 కార్ల అమ్మకాలతో BMW ఏడో స్థానంలో నిలిచింది.

గత కొన్ని రోజులుగా దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎంజీ మోటార్స్‌ ఇటీవలె ఈ విభాగంలో అదరగొడుతోంది. అయితే సేల్స్‌ రోజు రోజుకి పెరుగడం ద్వారా ఈ రంగం మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ఐసీఈ వెహికిల్స్‌తో పోటీగా ఇవి పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులోనూ సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

Tata Punch EV

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఇవే కాకుండా ఇతర వాహన తయారీ సంస్థలైన మెర్సెడెస్, కియా, వోల్వో, ఆడీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి మార్కెట్లో తమ సత్తా చాటాయి. అయినప్పటికీ.. ఈ జాబితాలో టాటానే మరోసారి టాప్‌లో నిలిచింది. అయితే...ఈ స్థానాన్ని బ్రిటిష్ కార్ల కంపెనీ అయిన ఎంజీ మోటార్ రానున్న నెలల్లో ఆక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2025, 13:23 [IST]
English summary
Electric car sales 2025 january in india tata motors top in the list check all details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+