కథ మారుతోంది… ఇప్పుడు టాటా కాదు, ఎంజీ గురించి మాట్లాడుకోవాలి.. ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరిగిన ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కూడా ఈ మార్పును వేగవంతం చేస్తున్న అంశాలుగా నిలుస్తున్నాయి. కొత్తగా ఇంధన వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఎలక్ట్రిక్ అయితే తక్కువ మెయింటనెన్స్‌తో చాలా వరకు ఖర్చులు ఆదా చేసుకోవచ్చని ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈవీలకు డిమాండ్ బాగా పెరిగింది. తాజాగా విడుదలైన డేటా ప్రకరం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే, 2025 ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో గణనీయనమైన అభివృద్ధి నమోదైంది. 2024 ఏప్రిల్‌లో 7,777 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే నెలలో 12,319 కార్ల విక్రయాలు జరిగాయి.

ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 58.40 శాతం వృద్ధి. ఈ గణాంకాలు చూస్తే, ఎలక్ట్రిక్ వాహనాలపై భారత వినియోగదారుల్లో నమ్మకం క్రమంగా పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 2024లో అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు గతంలో కంటే సగానికి పైగా పెరిగాయి. ఈ మొత్తం అమ్మకాల్లో కీలక పాత్ర పోషించింది టాటా మోటార్స్. గత ఏప్రిల్‌లో కూడా టాటా మోటార్స్ అత్యధిక ఎలక్ట్రిక్ కార్లు విక్రయించి అగ్రస్థానంలో నిలిచింది.

Tata Nexon Ev

సాధారణంగా అయితే 2024 ఏప్రిల్‌తో పోలిస్తే, ఈ ఏడాది అదే నెలలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 5,172 కార్లను విక్రయించిన ఈ సంస్థ, 2025 ఏప్రిల్‌లో కేవలం 4,461 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. అంటే సుమారుగా 700 కార్ల తగ్గుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఈ రకమైన తగ్గుదల పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా పెరుగుతున్న సమయంలో టాటా మోటార్స్ తాత్కాలికంగా తక్కువ అమ్మకాలను సాధించినప్పటికి రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. టాటా మోటార్స్ తరువాత MG మోటార్ ఈవీ అమ్మకాల్లో ముందుకు సాగుతుంది. గతేడాది ఏప్రిల్‌లో కేవలం 1,268 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన MG మోటార్, ఈ ఏడాది అదే నెలలో 3,488 కార్లను విక్రయించి 175 శాతం వృద్ధిని సాధించింది.

Electric Cars Sales Recorded 12319 Units

ఈ వృద్ధికి ప్రధాన కారణంగా, MG మోటార్ ఇటీవల విడుదల చేసిన విండ్సర్ EV అనే మోడల్ నిలిచింది. ఈ కొత్త మోడల్ వినియోగదారుల ఆలోచనల్లో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. చాలా మంది మధ్య తరగతి వినియోగదారులు ఈ కారుకు అట్రాక్ట్ కావడం వలన ఎంజీ మొత్తం అమ్మకాలను పెంచడానికి ఇది చాలా దోహదపడింది. ఇది టాటా మోటార్స్‌కు పోటీ కాస్త గట్టిగా ఇచ్చింది.

దీని తరువాత మహీంద్రా కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో మెరుగైన అమ్మకాలను సాధించింది. గతేడాది అదే నెలలో కేవలం 670 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించిన ఈ సంస్థ, 2025 ఏప్రిల్‌లో ఏకంగా 3,002 కార్లను విక్రయించి దాదాపు 348 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది మహీంద్రా కంపెనీకి గణనీయమైన విజయం అని చెప్పవచ్చు. ఇక హ్యుందాయ్ విషయానికి వస్తే, కంపెనీ గణాంకాలు తక్కువ స్థాయిలోనే నిలిచినట్టు కనిపిస్తోంది.

Electric Cars Sales Recorded 12319 Units In April 2025

ఏప్రిల్ 2024లో కేవలం 91 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించిన హ్యుందాయ్, ఈ ఏడాది కూడా అంతగా అమ్మకాలను నమోదు చేయలేకపోయింది. మహీంద్రా విక్రయించిన 3,002 కార్లతో పోల్చితే, హ్యుందాయ్ ఎంతో వెనుకబడినదిగా స్పష్టంగా తెలుస్తోంది. 4వ స్థానంలో ఉన్నప్పటికీ, హ్యుందాయ్‌కు ఇంకా చాలామంది వినియోగదారుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2025, 13:29 [IST]
English summary
Electric cars sales recorded 12319 units in april 2025 all details check here
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+